Pawan Kalyan | పవన్ కళ్యాణ్ అది ఆశిస్తారు.. బన్నీ వాసు ఆసక్తికర కామెంట్స్
Pawan Kalyan | గీతా ఆర్ట్స్ నిర్మాణ సంస్థలో కీలక స్థాయికి చేరుకున్న ప్రముఖ నిర్మాత బన్నీ వాసు, తన రాజకీయ అరంగేట్రం కోసం ప్రణాళికలు వేస్తున్నట్లు సంకేతాలు ఇస్తున్నారు. ఇప్పటికే నిర్మాతగా, డిస్ట్రిబ్యూటర్‌గా బిజీగా ఉన్న బన్నీ వాసు, జనసేన పార్టీకి గత ఎన్నికల నుంచే మద్దతుగా ఉన్నారు. 2024 ఎన్నికల్లో పార్టీ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేయమని ఆఫర్ వచ్చినా, ఆర్థికంగా పూర్తిగా సిద్ధంగా లేని కారణంగా వెనకడుగు వేశారు.
#image_title
కీలక వ్యాఖ్యలు..
తాజాగా ఓ ఇంటర్వ్యూలో బన్నీ వాసు మాట్లాడుతూ, “నాకు గతంలో పార్టీ నుంచి అవకాశం వచ్చింది. కానీ నేను ఎవరినీ డబ్బులు అడగకుండా, స్వయం సమర్థుడిగా ఉండాలనుకున్నాను. రాజకీయాల్లోకి వస్తే పూర్తి డెడికేషన్‌తో రావాలి. జనసేన పార్టీ, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి దగ్గర పనిచేయాలంటే పూర్తి డెడికేషన్, మనం బాధ్యత తీసుకోవడం ఆశిస్తారు. నా వల్ల కాదు అని చెప్పడమే మంచిది కానీ అక్కడా ఇక్కడ కాలు వేయడం కరెక్ట్ కాదు. భవిష్యత్తులో అయితే కచ్చితంగా రాజకీయాల్లోకి వెళ్తాను, పోటీ చేస్తాను. నాకు ఇంట్రెస్ట్ ఉంది అని తెలిపారు
రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం మేరకు, బన్నీ వాసు 2029లో జనసేన తరపున గోదావరి జిల్లాలో ఒక నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది. అప్పటివరకు ఆయన ఆర్థికంగా పూర్తిగా స్థిరపడేందుకు, తన సినీ కెరీర్‌ను కూడా మరో స్థాయికి తీసుకెళ్లేందుకు కసరత్తులు చేస్తున్నట్టు తెలుస్తోంది.