Pawan Kalyan : అమిత్ షాతో పవన్ కల్యాణ్ భేటీ !
ప్రధానాంశాలు:
Pawan Kalyan : అమిత్ షాతో పవన్ కల్యాణ్ భేటీ !
Pawan Kalyan : రాష్ట్రంలో శాంతిభద్రతల వైఫల్యంపై జనసేన పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తన మంత్రివర్గ సహచరురాలు హోంమంత్రి వంగలపూడి అనితపై సోమవారం పిఠాపురంలో జరిగిన ర్యాలీలో చేసిన ఘాటు వ్యాఖ్యలు రాష్ట్రంలో దుమారం రేపుతున్నాయి. పోలీసుల వైఫల్యంపై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ద్వారకా తిరుమలరావు మర్యాదపూర్వకంగా రిప్లై ఇవ్వగా, ఉప ముఖ్యమంత్రికి ఢిల్లీ నుంచి కాల్ రాగా ఆయన బయల్దేరి వెళ్లనున్నారు. ఈ సాయంత్రం తరువాత కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సమావేశం కోసం ఢిల్లీకి బయలుదేరారు.
హోంమంత్రి అనితపై పవన్ కళ్యాణ్ వివాదాస్పద వ్యాఖ్యలు, లా అండ్ ఆర్డర్ సమస్యలపై పోలీసు శాఖ అలసత్వం వహించిన రెండు రోజుల తర్వాత ఇది వచ్చింది. ఈ భేటీ ఎందుకు జరుగుతుందనే దానిపై ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వాస్తవానికి బుధవారం ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబునాయుడు అధ్యక్షతన జరిగే కేబినెట్ సమావేశానికి పవన్ కళ్యాణ్ హాజరుకావాల్సి ఉంది. చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో కేబినెట్ సమావేశం కొనసాగుతుంది. ఈ సమావేశానికి పవన్ కళ్యాణ్ హాజరు కాలేదు.
ఇటీవల పవన్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో లా అండ్ ఆర్ఢర్ పూర్తిగా విఫలమైందంటూ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. దాంతో కూటమి ప్రభుత్వంలో లుకలుకలు మొదలైనట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక, పవన ఢిల్లీ పర్యటనపై చంద్రబాబు ఆరా తీసినట్టు సమాచారం.

Pawan Kalyan : అమిత్ షాతో పవన్ కల్యాణ్ భేటీ !
ఇదిలా ఉండగా.. తాజాగా డిప్యూటీ సీఎం పవన్‌పై మందకృష్ణ మాదిగ ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబును మందకృష్ణ కలిసిన తర్వాత పవన్ తీరుపై మండిపడ్డారు. పవన్ వ్యాఖ్యలు సరికాదంటూ వాఖ్యానించారు.