
pawan kalyan slams on ap cm ys jagan mohan reddy
Pawan Kalyan – YS Jagan : ఏంటో అసలు. ఏపీ రాజకీయాలు ఎప్పుడు ఎటువైపునకు వెళ్తాయో ఎవ్వరికీ తెలియదు. అన్ని రాజకీయాల్లో ఏపీ రాజకీయాలే వేరయా అన్నట్టుగా ఉంది వ్యవహారం. ఏపీలో ప్రస్తుతం రాజకీయ పోరు రెండు పార్టీల మధ్యకే షిఫ్ట్ అయింది. అధికార పార్టీ వైసీపీ, జనసేన పార్టీ మధ్య ప్రస్తుతం పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా తయారైంది. అసలైన ప్రత్యర్థి పార్టీ టీడీపీ ఇక్కడ పక్కకు తప్పుకోగా.. అధికార పార్టీ వర్సెస్ జనసేనగా మారింది వ్యవహారం.
అసలే వారాహి యాత్ర పేరుతో పవన్ కళ్యాణ్ చేసే రచ్చ మనమంతా చూశాం. పవన్ కళ్యాణ్ వారాహి యాత్రలో కేవలం సీఎం జగన్ ను, వైసీపీ ప్రభుత్వాన్ని విమర్శించడమే పనిగా పెట్టుకున్నట్టుగా అనిపిస్తోంది. చివరకు వీళ్ల రాజకీయాలు ఎక్కడి వరకు వెళ్లాయంటే ఒకరిని మరొకరు వ్యక్తిగతంగా విమర్శించుకునే వరకు వెళ్లాయి. ఇటీవల సీఎం జగన్ కూడా పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్ల గురించి మాట్లాడటంతో ఇక.. పవన్ కూడా సీఎం జగన్ వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడటం మొదలు పెట్టారు.
pawan kalyan slams on ap cm ys jagan mohan reddy
తాజాగా భీమవరంలో జరిగిన వారాహి యాత్రలో సీఎం జగన్ కు పవన్ కళ్యాణ్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. సీఎం జగన్.. నీకే చెబుతున్నా.. చెవులు రిక్కించి విను. నీ వ్యక్తిగత జీవితం మొత్తం నాకు తెలుసు. నా వ్యక్తిగత జీవితాల గురించి నువ్వు పనికిమాలిన మాటలు మాట్లాడితే నేను చూస్తూ ఉండను. నువ్వు హైదరాబాద్ లో ఉండి ఏం చేశావో నాకు తెలుసు. చాలా లోతైన విషయాలు కూడా నాకు తెలుసు. అవన్నీ నాకు మాట్లాడటం చేతగాక కాదు.. నీ పర్సనల్ అంతా తెలుసు. కావాలంటే నీ మనిషిని పంపించు. నేను చెప్పే విషయాలు వింటే చెవుల నుంచి మీకు రక్తం వస్తుంది. నువ్వు ఏదైనా అనుకో.. ఇది వార్నింగ్ అనుకుంటావో.. ఇంకేమైనా అనుకుంటావో.. నేను మాత్రం నీకు బలమైన పోరాటం ఇవ్వబోతున్నాను.. అంటూ పవన్ కళ్యాణ్ సీఎం జగన్ కు స్ట్రాంగ్ వార్నింగే ఇచ్చేశారు.
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్రత్యేకమైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…
Peanuts Vs Almonds | బరువు తగ్గాలనే లక్ష్యంతో ఉన్నవారు సాధారణంగా తక్కువ క్యాలరీల ఆహారాన్ని ఎంచుకుంటారు. అయితే, ఆరోగ్యకరమైన…
Palm | గ్రహస్థితుల మాదిరిగానే, హస్తసాముద్రికం (Palmistry) కూడా ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రాధాన్యత పొందింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మన అరచేతిలోని…
Green Chilli | మన భారతీయ వంటల్లో పచ్చి మిరపకాయలు తప్పనిసరి భాగం. ఎర్ర మిరపకాయల కంటే పచ్చి మిరపకాయలలో…
Lemon | మన ఇళ్లలో తరచుగా కనిపించే నిమ్మకాయ వంటింటికి మాత్రమే కాదు, చర్మ సంరక్షణకు కూడా అద్భుతమైన సహజ…
Health Tips | భారతీయ సంప్రదాయంలో తమలపాకు (Betel Leaf) ప్రత్యేక స్థానం కలిగి ఉంది. భోజనం తర్వాత నోటి శుభ్రత…
This website uses cookies.