Pawan Kalyan : ఈ వెరైటీ నిరసస‌లేంటి ప‌వ‌న్‌..!

Authored By Breaking News | The Telugu News | Published on: September 11, 2023, 11:00 am

Pawan Kalyan : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ శనివారం విజయవాడ రోడ్లపై రకరకాలుగా నిరసనలు చేపట్టారు. హైదరాబాదు నుండి గన్నవరం ప్రత్యేక విమానం ద్వారా రావాలని అనుకున్నా పవన్ కళ్యాణ్ కి ఏపీ పోలీసులు షాక్ ఇవ్వడం తెలిసిందే. గన్నవరం విమానాశ్రయంలో ల్యాండింగ్ కి అనుమతి ఇవ్వలేదు. పరిస్థితి ఇలా ఉంటే మరో పక్క చంద్రబాబుని ఏసీబీ పోలీసుల అరెస్టు చేయటంతో పవన్ కళ్యాణ్ ఉదయాన్నే ఖండించారు. ఈ క్రమంలో కలవాలని భావించినా ఆయనకు..

విమానా మార్గం ద్వారా అనుమతి రాకపోవడంతో… రోడ్డు మార్గం ద్వారా విజయవాడలోకి ప్రవేశించే క్రమంలో తెలంగాణ ఆంధ్ర సరిహద్దు ప్రాంతం వద్ద పోలీసులు ఆపేశారు. సరిగ్గా విజయవాడకు 60 కిలోమీటర్ల దూరంలో పవన్ కళ్యాణ్ కాన్వాయ్ ని అడ్డుకున్నారు. ఇటువంటి క్రమంలో అర్ధరాత్రి పవన్ కాన్వయ్ వద్దే నిరసనలు తెలియజేశారు. కారులో నుంచి పవన్ కళ్యాణ్ ని దిగకుండా పోలీస్ అడ్డుకున్న క్రమంలో నడుచుకుంటూ మంగళగిరి వెళ్తానని.. సగం దూరం నడవడంతో అభిమానులు కార్యకర్తలు రావడంతో ఉద్రిక్తత వాతావరణం చోటుచేసుకుంది.

pawan Kalyan variety protests

pawan Kalyan variety protests

ఇదే సమయంలో రోడ్డుపై అడ్డంగా పడుకోవడం జరిగింది. ఈ రకంగా తనని విజయవాడలోకి ఏపీ పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో విజయవాడ రోడ్లపై పవన్ కళ్యాణ్ వెరైటీగా నిరసనలు తెలియజేశారు. దీంతో భారీ ఎత్తున కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ నెలకొంది. ఈ క్రమంలో పోలీసులు తమ ప్రత్యేక వాహనాలపై పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ నీ ఎక్కించుకొని మంగళగిరి పార్టీ ప్రధాన కార్యాలయంలో చేర్చారు.

Breaking News

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp