Pawan Kalyan : సెంటిమెంట్ వర్కవుట్ కాకనే పవన్ కళ్యాణ్ తన క్యాంప్ ఆఫీసుని చేంజ్ చేశారా..!
ప్రధానాంశాలు:
Pawan Kalyan : సెంటిమెంట్ వర్కవుట్ కాకనే పవన్ కళ్యాణ్ తన క్యాంప్ ఆఫీసుని చేంజ్ చేశారా..!
Pawan Kalyan : ఇటీవల పవన్ కళ్యాణ్ ఊహించని నిర్ణయాలు తీసుకుంటున్నారు. తాజాగా ఆయన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి లేఖ రాశారు. విజయవాడలోని క్యాంపు కార్యాలయాన్ని ఫర్నిచర్‌తో సహా వెనక్కి తీసుకోవాలని ఆ లేఖలో కోరారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని తన నివాసాన్ని క్యాంపు కార్యాలయంగా వినియోగించుకోవాలని పవన్ కళ్యాణ్ నిర్ణయం తీసుకున్నారు. అందుకే విజయవాడలో కేటాయించిన క్యాంపు కార్యాలయాన్ని, అక్కడి ఫర్నీచర్, ఇతర సామాగ్రి సహా వెనక్కు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు పవన్ కళ్యాణ్.విజయవాడలో ఎంతో విశాలమైన క్యాంపు కార్యాలయాన్ని తనకు కేటాయించడంపై చంద్రబాబుకు పవన్ కృతజ్ఞతలు తెలిపారు.విజయవాడ క్యాంపు కార్యాలయాన్ని ప్రభుత్వానికి తిరిగి అప్పగిస్తున్నానని లేఖలో పేర్కొన్నారు.
Pawan Kalyan యాంటి సెంటిమెంట్..
అయితే పవన్ కళ్యాణ్ క్యాంప్ ఆఫీసు మార్చడం పట్ల అందరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. జలవనరుల శాఖ భవనాన్ని గతంలో క్యాంప్ ఆఫీసుగా వాడుకున్న వారు అంతా మాజీలు అయ్యారు. అంతే కాదు రాజకీయంగా కను మరుగు అయ్యారు. అప్పటి జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ వాడుకోగా, అడ్రెస్ లేకుండా పోయారు. అప్పటి విద్యా శాఖ మంత్రిగా ఉన్న బొత్స సత్యనారాయణకు ఈ భవనం క్యాంప్ ఆఫీసుగా ఇచ్చారు. అయితే ఆయన తనకు కంచుకోట లాంటి చీపురుపల్లిలో ఓటమి పాలు అయ్యారు. రాజకీయంగా ఈ క్యాంప్ ఆఫీస్ సెంటిమెంట్ అందరిని ఇబ్బంది పెట్టిందని, అందుకే పవన్ కూడా ఖాళీ చేసారనే టాక్ ఉంది.

Pawan Kalyan : సెంటిమెంట్ వర్కవుట్ కాకనే పవన్ కళ్యాణ్ తన క్యాంప్ ఆఫీసుని చేంజ్ చేశారా..!
పవన్ కళ్యాణ్‌కు కేటాయించిన భవనానికి సంబంధించి ప్రభుత్వం రూ.82 లక్షలు నిధులు విడుదల చేసిందట. ఈ వ్యవవహారంపై పవన్ కళ్యాణ్ టార్గెట్‌గా వైఎస్సార్‌సీపీ విమర్శలు చేసింది. ప్రభుత్వం దగ్గర అసలు నిధులు లేవని చెప్పిన పవన్ కళ్యాణ్ ఆఫీస్‌కు అన్ని లక్షలు ఎక్కడి నుంచి వచ్చాయని కొందరు ఆ జీవోతో సోషల్ మీడియాలో ప్రశ్నించారు. ప్రభుత్వానికి ఆ రూ.82 లక్షలు కూడా మిగల్చాలనే ఉద్దేశంతో పవన్ ఈ నిర్ణయం ఈ నిర్ణయం తీసుకున్నారనే చర్చ జరుగుతోంది. కారణం ఏదైనా పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయంపై ప్రశంసలు కురిపిస్తున్నారు.