Peddi Reddy Ramachandra Reddy : ఎంపీ మిథున్ రెడ్డి కడిగిన ముత్యంలా బయటకు వస్తాడు : పెద్దిరెడ్డి | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Peddi Reddy Ramachandra Reddy : ఎంపీ మిథున్ రెడ్డి కడిగిన ముత్యంలా బయటకు వస్తాడు : పెద్దిరెడ్డి

 Authored By ramu | The Telugu News | Updated on :20 July 2025,9:00 pm

ప్రధానాంశాలు:

  •  ఎంపీ మిథున్ రెడ్డి అరెస్ట్ పై పెద్దిరెడ్డి ఏమంటున్నాడంటే !!

  •  కొడుకు అరెస్ట్ పై పెద్దిరెడ్డి రియాక్షన్

  •  Peddi Reddy Ramachandra Reddy : ఎంపీ మిథున్ రెడ్డి కడిగిన ముత్యంలా బయటకు వస్తాడు : పెద్దిరెడ్డి

Peddi Reddy Ramachandra Reddy : వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి midhun reddy లిక్కర్ స్కాం కేసులో సిట్ అధికారులు అరెస్ట్ చేసిన నేపథ్యంలో ఆయన తండ్రి, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తీవ్రంగా స్పందించారు. ఈ అరెస్ట్ వెనుక కూటమి ప్రభుత్వ కక్షసాధింపు కుట్రే కారణమని పెద్దిరెడ్డి ఆరోపించారు. గతంలోనూ ఎయిర్‌పోర్టు మేనేజర్‌ను అడ్డుపెట్టుకుని తన కుమారుడిపై తప్పుడు కేసు పెట్టారని, అది నిలబడనట్లే ఇప్పుడు కూడా ఈ లిక్కర్ కేసు నిలబడదని పేర్కొన్నారు.

Peddi Reddy Ramachandra Reddy ఎంపీ మిథున్ రెడ్డి కడిగిన ముత్యంలా బయటకు వస్తాడు పెద్దిరెడ్డి

Peddi Reddy Ramachandra Reddy : ఎంపీ మిథున్ రెడ్డి కడిగిన ముత్యంలా బయటకు వస్తాడు : పెద్దిరెడ్డి

Peddi Reddy Ramachandra Reddy : ఎంపీ మిథున్ రెడ్డి అరెస్ట్ పై నోరువిప్పిన పెద్దిరెడ్డి

ఎంపీగా మూడుసార్లు విజయం సాధించిన మిథున్ రెడ్డి, వైఎస్ జగన్‌కు అత్యంత సన్నిహితుడిగా ఉన్నారన్న కారణంగానే కుట్రలు జరుగుతున్నాయని పెద్దిరెడ్డి ఆరోపించారు. మదనపల్లి ఫైళ్ల పేరిట ప్రచారం చేసినా, వాటిల్లో తమపై ఎలాంటి తప్పులు లేవని ఇప్పటికే రుజువైందన్నారు. చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం తమ కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని తప్పుడు కేసుల ద్వారా వేధింపులకు గురిచేస్తోందని ఆరోపించారు. ఇది పూర్తిగా రాజకీయ ప్రేరణతో కూడిన చర్య అని, ఈ కేసు కూడా కోర్టులో నిలబడదని స్పష్టంచేశారు.

తాము ఎలాంటి తప్పూ చేయలేదని, మిథున్ రెడ్డి కడిగిన ముత్యంలా బయటకు వస్తారని పెద్దిరెడ్డి నమ్మకం వ్యక్తం చేశారు. తమ కుటుంబంపై ఉన్న ద్వేషం కారణంగా ప్రభుత్వం కుట్రలు చేసుకుంటోందని, ప్రజలు ఈ దుర్మార్గాలకి తగిన సమాధానం చెప్పే రోజు దూరంగా లేదని హెచ్చరించారు. రాష్ట్రంలో నియంత పాలన సాగుతోందని, ప్రజల దృష్టి మరల్చేందుకు విపక్ష నేతల అరెస్ట్‌లకు తెగబడుతోందని ఆయన మండిపడ్డారు. చంద్రబాబు ప్రభుత్వం ఎన్నికల హామీలను నెరవేర్చలేక మహిళలు, యువతను మోసం చేస్తోందని అన్నారు.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది