Perni Nani : పేర్ని నానికి అరెస్ట్ భయం పట్టుకుందా..?
ప్రధానాంశాలు:
నన్ను అరెస్ట్ చేయడమే అతడి లక్ష్యం - పేర్ని నాని
పేర్ని నాని పాపం పండింది.. ఎట్టిపరిస్థితుల్లో వదిలేస్తుంది లేదు - మంత్రి కొల్లు రవీంద్ర
Perni Nani : పేర్ని నానికి అరెస్ట్ భయం పట్టుకుందా..?
Perni Nani : మాజీ మంత్రి పేర్ని నాని మరియు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర మధ్య రాజకీయ దాడులు రోజు రోజుకు ఎక్కువుతున్నాయి. మోకా భాస్కరరావు హత్య కేసులో కొల్లు రవీంద్ర అరెస్ట్ కావడంతో తనపై కక్ష కట్టి వేధింపులకు పాల్పడుతున్నారని పేర్ని నాని ఆరోపించారు. “నన్ను అరెస్ట్ చేయించడమే కొల్లు రవీంద్ర లక్ష్యమై ఉన్నాడు. నకిలీ పట్టాల కేసులో నన్ను ఇరికించడానికి ఏడాది కాలంగా ప్రయత్నాలు చేస్తున్నారు,” అని పేర్ని నాని మీడియాతో అన్నారు. ఈ కేసులో చట్టపరంగా పోరాడతామని, న్యాయస్థానాలను ఆశ్రయిస్తామని తెలిపారు.

Perni Nani : పేర్ని నానికి అరెస్ట్ భయం పట్టుకుందా..?
Perni Nani : నన్ను అరెస్ట్ చేయడమే అతడి లక్ష్యం – పేర్ని నాని
దీనికి కౌంటర్‌గా మంత్రి కొల్లు రవీంద్ర ఘాటుగా స్పందించారు. “పేర్ని నానికి పాపం పండింది, ఇక వదిలేది లేదు” అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గత ఐదు సంవత్సరాల పాలనలో పేర్ని నాని ప్రజలను తీవ్రంగా నష్టపరిచారని, ఇప్పుడు నిష్కలుషుడిలా నటించడం సిగ్గుచేటని విమర్శించారు. 2023లో బదిలీ అయిన తహసీల్దార్ 2024లో పట్టాలు ఎలా ఇచ్చాడని ప్రశ్నించారు. పేదల పట్ల ప్రేమ ఉంటే 6400 టిడ్కో ఇళ్లను ఎందుకు పెండింగ్‌లో పెట్టారని నిలదీశారు.
ఇక పేర్ని నాని అవినీతికి సంబంధించి పలు ఆరోపణలు చేశారు. “బందరు పోర్టు 2006లో ప్రైవేట్ వ్యక్తులకు అమ్మేందుకు ప్రయత్నించిన నీచుడు పేర్ని నానియే,” అంటూ ధ్వజమెత్తారు. CRZ భూముల్లో పట్టాలు ఇవ్వడాన్ని కోర్టులే తప్పుపట్టాయని గుర్తు చేశారు. రేషన్ బియ్యం బస్తాలను బొక్కి బుకాయించడం హేయ చర్య అని పేర్కొన్నారు. ప్రజల దృష్టిలో పేర్ని నాని అవినీతి పరుడిగా మారిపోయాడని విమర్శించారు. ఈ నేపథ్యంతో ఇద్దరి మధ్య మాటల యుద్ధం మరింత రాజకీయం అవుతోంది.