Perni Nani VS Chiranjeevi : చిరంజీవి నీ తమ్ముడు గిల్లితే గిల్లించుకోవడానికి మేము ప్రకాష్ రాజ్ పక్కన పోరి కాదు.. పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు వైరల్

Authored By Breaking News 2 | The Telugu News | Published on: August 10, 2023, 2:00 pm

Perni Nani VS Chiranjeevi : నేను చిరంజీవి గారికి పిచ్చి అభిమానిని. దండలు వేసిన వాళ్లం. నా అభిమాన హీరో. కానీ.. హైదరాబాద్ ఫిలిం నగర్ నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయానికి ఎంత దూరమో.. ఇక్కడి నుంచి అక్కడికి కూడా అంతే దూరం అని నా హీరోకు చెబుతున్నా. చిరంజీవి గారికి ఒకటే కోరుకుంటున్నా.. ధృతరాష్ట్రుడికి ద్రౌపది గారి మధ్య ఎలాంటి ప్రేమ ఉండేదో ఆ ప్రేమ రాజ్యానికి నష్టం చేసింది. ఇప్పుడు సమాజానికి నష్టం చేసే పరిస్థితి వస్తోంది.. అంటూ మెగాస్టార్ చిరంజీవి ఏపీ ప్రభుత్వం మీద చేసిన వ్యాఖ్యలకు పేర్ని నాని కౌంటర్ ఇచ్చారు.

రామ్ చరణ్ మీద గానీ.. రవితేజ మీద కానీ.. మహేశ్ బాబు మీద కానీ.. ఇతర హీరోల మీద కానీ.. ఏనాడు అయినా ఏ రాజకీయ పార్టీ అయినా మాట్లాడిందా? కానీ.. ఇక్కడ ఒక రాజకీయ నాయకుడు జనాలను సంక్రాంతి వేడుకల్లో రంజింప జేయడం కోసం ఆరోజు ఆయన ఏ వేషధారణతో ఏ బట్టలు వేసుకొని డ్యాన్స్ చేశారో.. అదే బట్టలను ఒకతడికి వేసి ఒక నటుడి పాత్ర ప్రవేశ పెట్టారు. నేను గిల్లినప్పుడు గిచ్చిచ్చుకోవాలి కానీ.. ఎదురు గిల్లకూడదు అని ఓ సినిమాలో ప్రకాష్ రాజ్ చెబుతారు. కానీ.. అది సినిమా వరకే పరిమితం.సినిమా వాళ్లు వేరు. ఇక్కడ గిల్లితే మళ్లీ గిల్లుతూనే ఉంటారు. ఏ సినిమా హీరో పారితోషికం ఎంత.. వాళ్ల గురించి ఎవరైనా ఎప్పుడైనా రాజకీయ నాయకులు మాట్లాడారా? గిల్లినప్పుడు గిల్లుతారు..

perni nani reacts on chiranjeevi comments

perni nani reacts on chiranjeevi comments

Perni Nani VS Chiranjeevi : ఇక్కడ గిల్లితే మళ్లీ గిల్లుతూనే ఉంటారు

రెమ్యునరేషన్ గురించి ఎందుకు వచ్చింది. పవన్ కళ్యాణ్ గిల్లితేనే మేము కూడా ఆయన గురించి మాట్లాడాం. అంతే తప్పితే వేరే ఏ హీరో గురించి ఏ రాజకీయ పార్టీ మాట్లాడదు.. ఇప్పటి వరకు మాట్లాడలేదు. పవన్ కళ్యాణ్ మా మీద విమర్శలు చేశాడు కాబట్టే మేము కూడా ఆయనపై విమర్శలు చేస్తున్నాం అంటూ పేర్ని నాని కామెంట్ చేశారు.

Breaking News 2

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp