Perni Nani : చంద్రబాబునీ..సీఎం జగన్ చావు దెబ్బ కొట్టాడు..పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు..!!
Perni Nani : ఇటీవల తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకి ఐటీ శాఖ నోటీసులు పంపించడం తెలిసిందే. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో దాదాపు 118 కోట్లు అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలు జరిగిన క్రమంలో నిర్వహించిన విచారణలో ఆధారాలు సేకరించడం జరిగింది. ఈ విషయాన్ని హిందుస్థాన్ టైమ్స్ తన పత్రికలో కథనం ప్రచురించింది. ఈ క్రమంలో చంద్రబాబుకి ఐటీ నోటీసులు రావడం పై మాజీ మంత్రి పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. అమరావతి పేరుతో చంద్రబాబు […]
Perni Nani : ఇటీవల తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకి ఐటీ శాఖ నోటీసులు పంపించడం తెలిసిందే. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో దాదాపు 118 కోట్లు అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలు జరిగిన క్రమంలో నిర్వహించిన విచారణలో ఆధారాలు సేకరించడం జరిగింది. ఈ విషయాన్ని హిందుస్థాన్ టైమ్స్ తన పత్రికలో కథనం ప్రచురించింది. ఈ క్రమంలో చంద్రబాబుకి ఐటీ నోటీసులు రావడం పై మాజీ మంత్రి పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు.
అమరావతి పేరుతో చంద్రబాబు గుట్టెంత ఐటీ బయట పెట్టిందని పేర్కొన్నారు. ప్రజల ఆస్తిని చంద్రబాబు ఎలా కొట్టేశారు అనేది బహిర్గతం అయింది. ఇన్ ఫ్రా సంస్థల సబ్ కాంట్రాక్టర్ ల నుండి ముడుపులు తీసుకున్నారని పేర్కొన్నారు. ఈ క్రమంలో చంద్రబాబు పీఏ శ్రీనివాస్ ఇంతలో ప్రముఖ పాత్ర పోషించారు అని ఎర్రి నాని పేర్కొన్నారు. అవినీతి బయటపడటంతో చంద్రబాబు ఐటీ నోటీసులపై నోరు మెదపడం లేదని విమర్శించారు. సరిగ్గా 1997లో సెప్టెంబర్ మొదటి తారీకు ఎన్టీఆర్ ని కుట్రపూరితంగా ముఖ్యమంత్రి పదవి నుండి తొలగించి ఆరోజు సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేశారు.
ఇప్పుడు అదే తారీకు ఆయనకు నోటీసులు రావడంతో పైన ఎన్టీఆర్ ఆత్మ చంద్రబాబును వెంటాడుతుంది. ఆయన ఎన్టీఆర్ మీపై కక్ష తీర్చుకుంటూనే మరోపక్క వైఎస్ జగన్ ని ఆశీర్వదిస్తున్నారు. రాజకీయాలలో జగన్ మీకు ఆల్రెడీ కుక్క చావుని రుచి చూపించాడు అంటూ పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు.