Perni Nani VS Kollu Ravindra : బందరు లడ్డు ఎవరిదో.. ? పేర్ని నాని VS కొల్లు రవీంద్ర..!
Perni Nani VS Kollu Ravindra : ఏపీలో హాట్ హాట్ సీట్లలో ఒకటి మచిలీపట్నం. వైసీపీ మార్క్ రాజకీయ విమర్శలతో కొడాలి నాని తో పాటు పేర్ని నాని కూడా హైలెట్ అయ్యారు.ఇప్పుడు ఆయన వైదొలగి ఆయన కుమారుడికి సీటు ఇప్పించుకున్నారు. టీడీపీ తరపున మాజీ మంత్రి కొల్లు రవీంద్ర పోటీ చేయనున్నారు. పోటీ హోరా హోరీగా ఉన్నా జనసేన పొత్తు ఉండటం వలన టీడీపీకి సేఫ్ అవుతుంది. ప్రస్తుతం మచిలీపట్నం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైసీపీ తరపున పేర్ని నాని ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్నారు. గత ఎన్నికల్లో మాజీ మంత్రి కొల్లు రవీంద్ర పై పోటీ చేసి ఘనవిజయం సాధించారు. ప్రభుత్వంపై వ్యతిరేకత ఎక్కువగా ఉండడంతో టీడీపీ నుంచి కొల్లు రవీంద్ర ఈసారి బందర్ సీటు తమదే అని ధీమాతో ఉన్నారు. బందర్ సెగ్మెంట్లో టీడీపీ లో పెద్దగా గ్రూపులు లేకపోవడం పార్టీకి అడ్వాంటేజ్ అవుతుందని చెబుతున్నారు.
గత ఎన్నికల్లో జనసేన కాపు సామాజిక ఓట్లను చీల్చడం వల్లే రవీంద్ర ఓడిపోయారని భావన ఉంది. ఈసారి పొత్తు ఉండడంతో పెద్దగా రిస్కు ఉండదని టీడీపీ అనుకుంటుంది. మత్సకార సామాజిక వర్గానికి చెందిన కొల్లూ రవీంద్ర కి ఆ సామాజిక వర్గ ఓట్లు పెద్ద ప్లస్ పాయింట్. పేర్ని నాని జనసేనకు సామాజిక వర్గానికి వ్యతిరేకంగా ఉండడం వలన ఎవరికి ప్లస్ అవుతుందో తెలియని పరిస్థితి. పేర్ని నాని అదే సామాజిక వర్గానికి చెందిన నేత కావడం టీడీపీ తో జనసేన పొత్తు తప్పు పట్టడం కూడా ఇక్కడ ప్రధానంగా చర్చకు వస్తుంది. నియోజకవర్గంలో రోజురోజుకూ క్షీణిస్తున్న శాంతి భద్రత సమస్య వచ్చే ఎన్నికల్లో తీవ్ర ప్రభావం చూపనుంది.
రానున్న కాలంలో శాంతి భద్రతలపై తీసుకున్న చర్యలే విజేతలను నిర్ణయిస్తారని అభిప్రాయం వ్యక్తం అవుతుంది. టీడీపీ, జనసేన పొత్తు దాదాపు ఖరారు అయిన నేపథ్యంలో కాపు సామాజిక వర్గ ఓట్లు కూడా గెలుపు ఓటములను నిర్ణయించునున్నాయి. గత ఎన్నికల్లో పేర్ని నాని వైసీపీ తరపున ఘనవిజయం సాధించారు. కొల్లు రవీంద్ర ఓడిపోయారు. ఇప్పుడు బందరు నుంచి పేర్ని నాని కొల్లు రవీంద్ర పోటీ చేస్తున్న క్రమంలో ఎవరు గెలుస్తారు అనేదానిపై ఆసక్తి నెలకొంది. జనసేన, టీడీపీ పొత్తు కుదరటం వలన కొల్లు రవీంద్ర కి అడ్వాంటేజ్ అవుతుందని తెలుస్తుంది. సిట్టింగ్ ఎమ్మెల్యే పేర్ని నాని బలంగా ఉండడంతో ఎవరు గెలుస్తారు అనేదానిపై ఆసక్తి నెలకొంది.
Nepal Crisis Deepens : నేపాల్లో జెన్-జెడ్ యువత ఆందోళనలు దేశ రాజకీయాలను కుదిపేశాయి. సోషల్ మీడియా నిషేధం, అవినీతి…
Apple Event | ఐఫోన్ అభిమానులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న క్షణం ఆసన్నమైంది. ప్రపంచ టెక్ దిగ్గజం ఆపిల్ తన…
Group 1 | గ్రూప్–1 మెయిన్స్ పరీక్షలో జరిగిన అవకతవకలపై పలు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో, తెలంగాణ హైకోర్టు…
Rains | తెలుగు రాష్ట్రాల ప్రజలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం కీలక హెచ్చరికను జారీ చేసింది. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనున్న…
Allu Family |సినీ నటుడు అల్లు అర్జున్ కుటుంబానికి చెందిన ప్రముఖ నిర్మాణం ‘అల్లు బిజినెస్ పార్క్’ ఇప్పుడు వివాదాస్పదంగా…
kajal aggarwal | ఒకప్పుడు టాలీవుడ్లో టాప్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన కాజల్ అగర్వాల్ Kajal Aggarwal ప్రస్తుతం…
Betel leaf | భారతీయ సంప్రదాయంలో తమలపాకు (బీట్ల్ లీవ్స్) ప్రత్యేక స్థానం పొందిన పౌష్టికవంతమైన ఆకులలో ఒకటి. ఇది…
Honey and Garlic | నేటి హైటెక్ జీవనశైలిలో ఆరోగ్యంపై శ్రద్ధ చూపించే వారు పెరుగుతున్నారు. ఈ క్రమంలో మన…
This website uses cookies.