Pithapuram : జగన్ సభ కోసం వైసీపీ నాయకులు పిఠాపురంలో విధ్వంసం సృష్టిస్తున్నారా...!
Pithapuram : ప్రస్తుతం ఏపీలో రాజకీయం రంజుగా నడుస్తుంది. కూటమి వర్సెస్ వైసీపీ మధ్య గట్టి పోటీ ఉంది. ఎవరికి వారు జోరుగా ప్రచారాలు చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. అయితే ఈ రోజు జనసేన అధినేత, పిఠాపురం కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి పవన్ కల్యాణ్ పిఠాపురంలో రోడ్ షో నిర్వహించడానికి ప్లాన్ చేశారు. పవన్ కల్యాణ్ రోడ్ షోకు అనుమతి ఇవ్వాలని జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు పిఠాపురంలోని ఆర్వో కార్యాలయానికి వెళ్లారు. అయితే ఉదయం వెళ్లిన కూటమి నాయకులకు సర్వర్ పని చెయ్యడం లేదని చెప్పిన ఆర్వో కార్యాలయం అధికారులు వారిని సాయంత్రం 6.30 గంటల వరకు అక్కడే వేచి ఉండేలా చేశారని ఆరోపణలు ఉన్నాయి.
ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ కూడా ఈ రోజు పిఠాపురంలో బహిరంగ సభలో పాల్గొంటారని జోరుగా ప్రచారం జరిగింది. కాని దానిని ఒక రోజు వాయిదా వేశారు. ముందు కూటమి నాయకులు ఆర్జీ ఇవ్వడంతో వారికే పర్మీషన్ దొరికినట్టు సమాచారం .అయితే సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచార సభల కోసం ఆ పార్టీ నాయకులు విధ్వంసానికి పాల్పడుతున్నారు. పిఠాపురంలో ఈ నెల 11వ తేదీన సీఎం జగన్ ఎన్నికల ప్రచారంనిర్వహించనున్న విషయం తెలిసిందే. దీంతో సభా స్థలం కోసం ఆ పార్టీ నాయకులు హల్‌చల్ చేస్తున్నారు. పిఠాపురం మెయిన్ రోడ్‌లో దారి పొడవునా ఉన్న చెట్లన్నీ నరికేశారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల క్రీడా మైదానంలో హెలిప్యాడ్ నిర్మాణం కోసం కాంక్రీట్ వేస్తున్నారు.
Pithapuram : జగన్ సభ కోసం వైసీపీ నాయకులు పిఠాపురంలో విధ్వంసం సృష్టిస్తున్నారా…!
వైసీపీ నాయకుల దౌర్జన్యాలపై స్థానికులు మండిపడుతున్నారు. సభల పేరుతో చెట్లను నరికేయడం, క్రీడా మైదానాల్లో కాంక్రీట్ వేయడం ఏంటంటూ ప్రశ్నిస్తున్నారు. పిఠాపురంలో ఆటలు ఆడుకునేందుకు ఉన్న మైదానం ఇదొక్కటే అని.. అందులో కూడా కాంక్రీట్ నిర్మాణం చేపట్టడంతో ఇక ఆటలు ఆడుకునే అవకాశమే లేకుండా పోయిందని పట్టణ వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ సారి పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలిపించాలని వారు భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. పవన్ కి ఒక్కసారి ఛాన్స్ ఇవ్వాలని అనుకుంటున్నట్టు సమాచారం.
Ys Jagan : అసెంబ్లీ ఎన్నికల్లో చిత్తూ చిత్తుగా ఓటమి చవిచూసిన జగన్..ఇప్పుడు పూర్తిస్థాయిలో ప్రజల్లోకి వెళ్లాలని డిసైడ్ అయ్యాడు. ఐదేళ్లలో…
Former MLCs : తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి నిత్యం సొంత పార్టీ నేతలను ఏదొక సమస్య ఎదురవుతూనే ఉంటుంది. ముఖ్యంగా…
Allu Ajun : ఐకన్ స్టార్ అల్లు అర్జున్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో ఓ సినిమా ఉంటుందనే ప్రచారం…
Chandrababu : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరోసారి తన పాలన శైలిని ప్రజల ముందు ఉంచారు. చిత్తూరు…
Green Chicken Curry : ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా కొత్త వంటకాన్ని ట్రై చేసి చూడాలి అనుకుంటారు.…
Hari Hara Veera Mallu Movie Trailer : తెలుగు చిత్ర పరిశ్రమలో తిరుగులేని హీరోగా వెలుగొందుతున్న పవర్స్టార్ పవన్…
Ram Charan Fans : 'ఆర్.ఆర్.ఆర్' సినిమా తరువాత, పలు నిర్మాతలు రామ్ చరణ్తో సినిమాలు చేయాలని ఆసక్తి చూపినా,…
Buddhas Hand : ప్రపంచం లో ఇలాంటి ప్రత్యేకమైన పండు ఒకటి ఉందని మీకు తెలుసా. ఈ పండుని చాలా…
This website uses cookies.