Kumari Aunty : హాయ్.. నాన.. చెప్పండి ఏం కావాలి అంటూ ప్రేమగా మాట్లాడుతూ ఫుడ్ బిజినెస్ తో ఒక్కసారిగా ఫేమస్ అయిపోయింది కుమారి ఆంటీ. హైదరాబాద్ లో ఫుడ్ బిజినెస్ చేస్తూ ఉన్న ఆమెను కొంతమంది సోషల్ మీడియా ఫుడ్ వ్లాగ్ చేసే వాళ్లు వెళ్లి వీడియోలు తీశారు. అవి కాస్తా ఫేమస్ కావడంతో ఆమె ఒక్కసారిగా ఎక్కడికో వెళ్లిపోయింది. మరీముఖ్యంగా ఆమె చెప్పి.. మీది మొత్తం తౌజెండ్ అయింది.. రెండు లివర్లు ఎక్స్ ట్రా అనే డైలాగ్ సోషల్ మీడియాను ఓ ఊపు ఊపేసింది. దాంతో ఒక్కసారిగా ఆమెపై మీమ్స్, ట్రోల్స్ విపరీతంగా వచ్చేశాయి. దాంతో దెబ్బకు ఆమె సోషల్ మీడియా స్టార్ అయిపోయింది.
ఎంతలా అంటే ఆమె ఫుడ్ బిజినెస్ ఒక్కసారిగా ఫైవ్ స్టార్ హోటళ్లకు కూడా షాక్ ఇచ్చేంతగా గిరాకీ వచ్చేసింది. ఆమె బిజినెస్ ముందు పబ్లిక్ ను కంట్రోల్ చేయలేక పోలీసులే ఇబ్బందులు పడ్డారు. అంతగా ఫేమస్ అయిన ఆమె మీద అప్పట్లో కొన్ని కేసులు కూడా నమోదయ్యాయి. ఎందుకంటే ట్రాఫిక్ కు ఇబ్బంది కలిగిస్తున్నారంటూ ఆమె మీద పోలీసులు కేసులు నమోదు చేశారు. కొన్ని రోజులు ఆమె ఫుడ్ బిజినెస్ మూసేయాల్సి వచ్చింది. అప్పట్లో రేవంత్ రెడ్డి స్వయంగా కలుగ జేసుకుని ఆమె బిజినెస్ ను రీ ఓపెన్ చేయించారు. అప్పటి నుంచి ఆమె బిజినెస్ బాగానే జరుగుతోంది. ఇక మధ్యలో ఆమె చాలానే ఇంటర్వ్యూలు ఇచ్చారు. దాంతో ఇంకా ఫేమస్ అయ్యారు. అయితే ఇప్పుడు ఆమెను ఏపీ రాజకీయాల్లోకి కూడా తీసుకువస్తున్నారు. ప్రస్తుతం ఆమెను గుడివాడలో టీడీపీ అభ్యర్థి వెనిగండ్ల రాము తరఫున ప్రచారం చేయించారు. ఆమె మాట్లాడుతూ పదేండ్లుగా గుడివాడ ఎలా ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉందంటూ తెలిపారు.
రాముకు ఓటేసి గెలిపించాలని కోరారు. అయితే ఆమె గతంలో జగన్ మోహన్ రెడ్డి వల్లే తనకు సొంత ఇల్లు వచ్చిందని తెలిపారు. కానీ ఇప్పుడు టీడీపీ తరఫున ప్రచారం చేస్తున్నారు. ఇది ఒక రకంగా వైసీపీకి షాక్ అంటున్నారు. టీడీపీ తరఫున ఆమె ప్రచారం చేయడం అంటే ఇది ఒక రకంగా కూటమికి ప్లస్అ వుతుందని అంటున్నారు. అయితే ఓటర్లను ప్రభావితం చేసేంత సీన్ కుమారీ ఆంటీకి ఉందా లేదా అనేది ఇక్కడ ఆలోచించాలి. మరి ఆమె ఏ మేరకు ఓట్లను తెప్పిస్తుందో చూడాలి.
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప 2 Pushpa 2 The Rule ప్రమోషన్స్ జోరందుకున్నాయి. సినిమాను పాన్…
Wheat Flour : ప్రస్తుతం మార్కెట్లో దొరికే ప్రతి వస్తువు కూడా కల్తీ గా మారింది. అలాగే ఎక్కడ చూసినా కూడా…
IPL 2025 Schedule : క్రికెట్ ప్రేమికులకి మంచి మజా అందించే గేమ్ ఐపీఎల్. ధనాధన్ ఆటతో ప్రేక్షకులకి మంచి…
This website uses cookies.