Husband Wife : దారుణం : భార్య నైటీ వేసుకుని బయట తిరుగుతోందని.. భర్త ఏం చేశాడో తెలుసా?

Authored By Ramu Tandu Ramalingaiah | The Telugu News | Updated on : 5 May 2026, 8:10 pm
  •  Husband Wife : దారుణం : భార్య నైటీ వేసుకుని బయట తిరుగుతోందని.. భర్త ఏం చేశాడో తెలుసా?

Husband Wife  : నేటి సమాజంలో మనుషుల ప్రాణాలకు విలువే లేకుండా పోతోంది. చిన్నపాటి మనస్పర్థలు, అనవసరపు అనుమానాలు నిండు ప్రాణాలను బలితీసుకుంటున్నాయి. నూరేళ్లు కలిసి ఉండాల్సిన భార్యాభర్తలు చిన్న చిన్న కారణాలకే గొడవపడి ఒకరి ప్రాణాలను ఒకరు తీసుకునే స్థాయికి దిగజారుతున్నారు. తాజాగా ఆంధ్రప్రదేశ్‌లోని కడప జిల్లా ప్రొద్దుటూరులో జరిగిన ఒక హత్య ఉదంతం పోలీసులనే విస్మయానికి గురిచేసింది. తన భార్య నైటీ వేసుకుని బజారులో తిరుగుతోందనే వింత కారణంతో ఒక భర్త ఆమెను కడతేర్చిన వైనం ఇప్పుడు జిల్లావ్యాప్తంగా సంచలనంగా మారింది.

Husband Wife : దారుణం : భార్య నైటీ వేసుకుని బయట తిరుగుతోందని.. భర్త ఏం చేశాడో తెలుసా?

Husband Wife : దారుణం : భార్య నైటీ వేసుకుని బయట తిరుగుతోందని.. భర్త ఏం చేశాడో తెలుసా?

Husband Wife  అసలు ఏం జరిగింది?

కడప జిల్లా ప్రొద్దుటూరు మండలం ఈశ్వర్ రెడ్డి నగర్‌లో నివాసముంటున్న భద్రిపల్లి పద్మజ (31) అనే మహిళ గత నెల 29వ తేదీ అర్ధరాత్రి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. మొదట ఆమెది సహజ మరణమని అందరూ భావించినా, మృతురాలి కుటుంబ సభ్యులకు మాత్రం ఆమె చావుపై గట్టి అనుమానం కలిగింది. పద్మజ ఆరోగ్యంగా ఉండేదని, అకస్మాత్తుగా ఎలా చనిపోతుందని వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Husband Wife  సస్పెక్ట్ డెత్.. కాస్తా మర్డర్ అని తేలింది!

పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించగా, అది సహజ మరణం కాదని, హత్య అని ప్రాథమికంగా తేలింది. దీంతో పోలీసులు ఆమె భర్త భద్రిపల్లి కిరణ్‌ను అదుపులోకి తీసుకుని విచారించారు. అతడు చెప్పిన పొంతన లేని సమాధానాలతో పోలీసులకు మరింత అనుమానం వచ్చి, కిరణ్ ఫోన్ కాల్స్ మరియు మొబైల్ డేటాను విశ్లేషించారు. సాంకేతిక ఆధారాల ముందు నిందితుడు కిరణ్ తలవంచి, తానే తన భార్యను చంపినట్లు అంగీకరించాడు.

భర్త చెప్పిన కారణం విని పోలీసులకే మతిపోయింది!
ఎందుకు చంపావని పోలీసులు ప్రశ్నించగా కిరణ్ చెప్పిన కారణం విని పోలీసు అధికారులు సైతం ఆశ్చర్యపోయారు. తన భార్య పద్మజ పద్ధతిగా ఉండటం లేదని, ఆమె ఎప్పుడూ నైటీ వేసుకుని బజారులో తిరుగుతోందని, అది తనకు నచ్చడం లేదని కిరణ్ తెలిపాడు. నైటీ వేసుకుని బయటకు వెళ్లవద్దని తాను ఎన్నిసార్లు చెప్పినా వినడం లేదనే కోపంతో ఆమెను చంపేసినట్లు నిందితుడు వెల్లడించాడు.

కేవలం నైటీ వేసుకుని బజారులో తిరుగుతోందనే కారణంతో ప్రాణాలు తీయడం ఏంటని పోలీసులు ఈ కేసును మరింత లోతుగా విచారిస్తున్నారు. నిందితుడు చెబుతున్న ఈ కారణం వెనుక మరేదైనా వివాహేతర సంబంధం ఉందా లేదా ఇతర కుటుంబ గొడవలు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు సాగిస్తున్నారు. చిన్న చిన్న విషయాలకే ప్రాణాలు తీసుకునే స్థాయికి మానవ సంబంధాలు పడిపోవడం ఆందోళనకరం. ఈ ఘటన ప్రొద్దుటూరు ప్రాంతంలో తీవ్ర కలకలం రేపింది. ప్రస్తుతం పోలీసులు నిందితుడు కిరణ్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ కేసులో మరిన్ని వాస్తవాలు రాబట్టేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

Ramu Tandu Ramalingaiah

Author Bio Info : Ramu Tandu Ramalingaiah is experienced in Media field. He worked in various Telugu media houses for about 15+ years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Editor of thetelugunews.com | Contact Details : ramu@thetelugunews.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp