Raghurama krishnam raju : 2019 అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో వైయస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన బీ ఫామ్ తో గెలిచారు రఘురామకృష్ణం రాజు. ఆ తర్వాత కాలంలో వైయస్ జగన్మోహన్ రెడ్డికి, వైసీపీకి పూర్తిగా వ్యతిరేకంగా మారారు. రఘురామకృష్ణం రాజు వర్సెస్ వైయస్ జగన్మోహన్ రెడ్డి అన్నట్లుగా పరిస్థితి మారిపోయింది. ఏపీ సీఐడీ ఆయనను మాన్ హ్యాండ్లింగ్ చేసిందని ఆరోపణలు చేశారు. ఆ తర్వాత బెయిల్ తెచ్చుకొని హైదరాబాద్ నుంచి నేరుగా ఢిల్లీకి షిఫ్ట్ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను ఆయన పూర్తిగా పక్కన పెట్టేశారు. దీంతో ఆయన రాజకీయాలనుంచి పూర్తిగా తప్పుకుంటున్నారని వైసీపీ వర్గాల నుంచి రూమర్స్ వినిపిస్తున్నాయి. రఘురామకృష్ణంరాజు నరసాపురం టికెట్ను ఆశిస్తున్నారు. గత ఎన్నికల్లో అక్కడ వైయస్ జగన్ సపోర్టుతో ఆయనకున్న చరిష్మాతో గెలిచారు.
ఇక ఇప్పుడు కూడా నరసాపురం నుంచి పోటీ చేయాలని భావిస్తున్నట్టు సమాచారం. ఇక ఇప్పుడు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఓట్లు తనకు వస్తాయని రఘురామకృష్ణం రాజు భావిస్తున్నట్లు తెలుస్తుంది. బీజేపీ ద్వారా ఎంపీగా గెలిచి పార్లమెంట్లో అడుగు పెట్టాలని ఆయన చూస్తున్నారని అంటున్నారు. వైయస్ జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా తన గెలుపును చాటుకోవాలని రఘురామకృష్ణం రాజు ప్రయత్నిస్తున్నారని అంటున్నారు. వైయస్ జగన్ సహాయం లేకుండా గెలవాలని పార్లమెంట్లో అడుగుపెట్టి వైయస్ జగన్ కు వ్యతిరేకంగా ఉండాలని చూస్తున్నారు. కానీ గతంలో రఘురామ కృష్ణంరాజుకు ఇచ్చిన మాట లాగే ప్రభాస్ భారీ ఫ్యాన్ బేస్ ని చేసుకొని రానున్న ఎన్నికల్లో ప్రభాస్ పెద్దమ్మ కృష్ణంరాజు భార్య శ్యామలాదేవికి నర్సాపురం టికెట్ ఇవ్వాలని వైసీపీ నిర్ణయం తీసుకుందని ప్రచారం జరుగుతుంది. నర్సాపురం నుంచి శ్యామలాదేవి పోటీ చేస్తారని ఎప్పటినుంచో వైసీపీ ప్రచారం చేస్తుంది.
ఇదే కనుక నిజమైతే రఘురామకృష్ణం రాజుకు పెద్ద దెబ్బ పడుతుందని ఆయన రాజకీయ జీవితం ముగుస్తుందని అంటున్నారు. ఎందుకంటే ఆయన ఈ ప్రాంతంలో తప్ప వేరే ప్రాంతంలో గెలవడం కష్టం. అలాగే కృష్ణంరాజు భార్య శ్యామలాదేవికి ఈ ప్రాంతం కాకుండా వేరే ప్రాంతం ఇస్తే గెలవడం కష్టం. అయితే ప్రభాస్ పెద్దమ్మ శ్యామలాదేవి రాజకీయాల్లోకి వస్తారా లేరా అనేది తెలియాల్సి ఉంది. దీనిపై ఇప్పటివరకు ఎటువంటి అధికారిక ప్రకటన అయితే లేదు. కానీ వైసీపీ వర్గాలు శ్యామలాదేవి నరసాపురం నుంచి పోటీ చేయబోతున్నారని వార్తలను వైరల్ చేస్తున్నారు. రఘురామకృష్ణం రాజుకు పోటీగా ఆమెను దింపి విజయం సాధించాలని వైసీపీ భావిస్తుందని అంటున్నారు.
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప 2 Pushpa 2 The Rule ప్రమోషన్స్ జోరందుకున్నాయి. సినిమాను పాన్…
Wheat Flour : ప్రస్తుతం మార్కెట్లో దొరికే ప్రతి వస్తువు కూడా కల్తీ గా మారింది. అలాగే ఎక్కడ చూసినా కూడా…
IPL 2025 Schedule : క్రికెట్ ప్రేమికులకి మంచి మజా అందించే గేమ్ ఐపీఎల్. ధనాధన్ ఆటతో ప్రేక్షకులకి మంచి…
PM YASASVi : పీఎం యంగ్ అచీవర్స్ స్కాలర్ షిప్ అవార్డ్ స్కీం అనేది భారత ప్రభుత్వం నుంచి ఒక…
This website uses cookies.