Ram Mohan Naidu , lokesh
Lokesh & Ram Mohan Naidu : తెలుగుదేశం పార్టీ ఎప్పటి నుంచో ఒక పెద్ద కుటుంబంలా కొనసాగుతూ వస్తోంది. ఎవరు ఏ స్థాయి పదవిలో ఉన్నా పార్టీ అధినేతలను కుటుంబ పెద్దల్లా గౌరవించడం ఆ పార్టీ సంప్రదాయం. తాజాగా విశాఖపట్నంలోని నోవాటెల్‌లో జరిగిన ఏరోస్పేస్, డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరర్స్ సదస్సులో రాష్ట్ర మంత్రి నారా లోకేష్, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు మధ్య చోటుచేసుకున్న సంఘటన దీనికి మరొక నిదర్శనంగా నిలిచింది. వయసులో పెద్దవాడు లోకేష్ అయినప్పటికీ హోదాలో రామ్మోహన్ నాయుడు అగ్రస్థానంలో ఉన్నారు. అయితే ఈ సమావేశంలో ఇద్దరూ పదవులను పక్కన పెట్టి అన్నదమ్ముల్లా ప్రవర్తించడం సభలోని ప్రతిఒక్కరినీ ఆకట్టుకుంది.
Ram Mohan Naidu , lokesh
సదస్సు కార్యక్రమంలో ప్రోటోకాల్ ప్రకారం కేంద్ర మంత్రి చివరగా మాట్లాడాల్సి ఉంది. కానీ నారా లోకేష్ ప్రసంగం ప్రారంభించడానికి సిద్ధమయ్యారు. దీనిని గమనించిన రామ్మోహన్ నాయుడు “అన్నా ముందు నేను మాట్లాడతాను” అంటూ లేవగా, లోకేష్ వెంటనే వారిస్తూ “వద్దు రాము… నువ్వు కేంద్ర మంత్రి కాబట్టి చివర్లో మాట్లాడాలి, ఇప్పుడు నేనే మాట్లాడతాను” అని సరదాగా స్పందించారు. పదవుల హోదాలను పక్కనబెట్టి అన్నదమ్ముల్లా వారిద్దరి మధ్య చోటుచేసుకున్న ఈ చిన్న సంఘటన సభలో ఉన్న వారిని అలరించింది.
ఈ పరిణామం కూటమి ప్రభుత్వంపై ప్రజల విశ్వాసాన్ని మరింత పెంచిందనే చెప్పాలి. ఏమైనా చిన్నపాటి భిన్నాభిప్రాయాలు ఉన్నా వాటిని పక్కనబెట్టి కలిసి పనిచేస్తున్నారనే స్పష్టత ఇచ్చింది. ముఖ్యంగా వైసీపీ నేతలు కూటమిలో విభేదాలున్నాయని చేస్తున్న ప్రచారానికి ఈ సంఘటన బలమైన సమాధానంగా నిలిచింది. లోకేష్, రామ్మోహన్ నాయుడు ప్రదర్శించిన ఆత్మీయత, సమన్వయం కూటమి ప్రభుత్వం ప్రజలకు మేలు చేయడానికి కట్టుబడి ఉందనే నమ్మకాన్ని కలిగించింది.
Telangana Education Sector : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యా రంగంపై ప్రత్యేక దృష్టి సారించారు. రాష్ట్రంలోని పాఠశాలలు,…
విశాఖపట్నం పర్యటనలో భాగంగా జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ రుషికొండలో గత ప్రభుత్వ కాలంలో నిర్మించిన విలాసవంతమైన…
Chiranjeevi | అభిమానం హద్దులు దాటి, జీవితాన్నే పణంగా పెట్టి తన అభిమాన నటుడిని కలవాలని పట్టుదలగా ప్రయత్నించిన ఓ మహిళా…
War 2 | మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ మూవీ వార్ 2 .కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన…
Barrelakka | తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో “బర్రెలక్క”గా అందరి దృష్టిని ఆకర్షించిన శిరీష్ ఇప్పుడు మరోసారి హాట్ టాపిక్‌గా నిలిచింది.…
Hansika | స్టార్ హీరోయిన్ హన్సిక వ్యక్తిగత జీవితంపై గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో రకరకాల పుకార్లు హల్చల్ చేస్తున్న…
LOBO | టీవీ నటుడు, బిగ్‌బాస్ కంటెస్టెంట్, యాంకర్ లోబోకు ఏడాది జైలు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు వెల్లడించింది.…
Sleep | మానసిక ఒత్తిడి, ఆహార అలవాట్లు ఇలా ఎన్నో కారణాల వల్ల చాలా మంది నిద్రలేమితో బాధపడుతున్నారు. ఈ పరిస్థితుల్లో…
This website uses cookies.