
rushikonda palace
విశాఖపట్నం పర్యటనలో భాగంగా జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ రుషికొండలో గత ప్రభుత్వ కాలంలో నిర్మించిన విలాసవంతమైన భవనాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన భవనాల లోపల ఉన్న అత్యంత విలాసవంతమైన బెడ్ రూమ్‌లు, బాత్ రూమ్‌లను చూసి ఆశ్చర్యానికి గురయ్యారు. ప్రజాధనాన్ని ఇలా ప్యాలెస్‌ల నిర్మాణానికి వినియోగించడం ఎంతవరకు అవసరం అనే ప్రశ్నను లేవనెత్తుతూ, ప్రజా డబ్బును సరైన విధంగా వినియోగించకపోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ భవనాన్ని చూస్తున్న సమయంలోనే సీలింగ్ పైపెచ్చులు ఉండడం చూసి షాక్ కు గురయ్యారు.
ఈ సందర్భంగా పర్యాటకశాఖ మంత్రి కందుల దుర్గేష్ రుషికొండ ప్రస్తుత పరిస్థితులను పవన్ కల్యాణ్‌కు వివరించారు. గతంలో ఇక్కడ హరిత రిసార్ట్స్ ఉన్నప్పుడు ప్రభుత్వానికి ఏడాదికి దాదాపు ఏడు కోట్ల రూపాయల ఆదాయం వచ్చేదని చెప్పారు. కానీ ఇప్పుడు కొత్తగా నిర్మించిన ఈ భవనాల నిర్వహణకే కోటి రూపాయలకుపైగా బకాయిలు పేరుకుపోయాయని వెల్లడించారు. ఈ నిర్మాణాలపై గ్రీన్ ట్రిబ్యునల్‌లో కేసు కొనసాగుతోందని, ఆర్థికపరంగా, పర్యావరణపరంగా ఇది భారమవుతోందని అధికారులు వివరించారు.
పరిస్థితిని సమీక్షించిన అనంతరం పవన్ కల్యాణ్ మాట్లాడుతూ ప్రకృతిని విస్మరించి ఇలాంటి నిర్మాణాలు చేస్తే ఉన్న సౌందర్యం కూడా నాశనం అవుతుందని వ్యాఖ్యానించారు. రుషికొండ నిర్మాణాల ఖర్చు, పర్యావరణ ప్రభావం, విధ్వంసం వంటి అంశాలపై శాసనసభ వేదికగా చర్చ జరగాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. గతంలో ప్రతిపక్షంగా ఉండగా ఈ నిర్మాణాలను పరిశీలించనీయలేదని గుర్తుచేసుకుంటూ, ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో భాగంగా ప్రజల ముందుకు నిజాలను తెచ్చే ప్రయత్నం చేస్తున్నానని తెలిపారు. భవనాలు పాడైపోకుండా వెంటనే మరమ్మతులు చేపట్టాలని ఆయన అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.