Lokesh & Ram Mohan Naidu : లోకేష్ ..రామ్మోహన్ నాయుడు లను చూస్తే అన్నదమ్ములు కూడా ఇంత అన్యోన్యంగా ఉండరేమో !! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Lokesh & Ram Mohan Naidu : లోకేష్ ..రామ్మోహన్ నాయుడు లను చూస్తే అన్నదమ్ములు కూడా ఇంత అన్యోన్యంగా ఉండరేమో !!

 Authored By sudheer | The Telugu News | Updated on :29 August 2025,9:13 pm

Lokesh & Ram Mohan Naidu : తెలుగుదేశం పార్టీ ఎప్పటి నుంచో ఒక పెద్ద కుటుంబంలా కొనసాగుతూ వస్తోంది. ఎవరు ఏ స్థాయి పదవిలో ఉన్నా పార్టీ అధినేతలను కుటుంబ పెద్దల్లా గౌరవించడం ఆ పార్టీ సంప్రదాయం. తాజాగా విశాఖపట్నంలోని నోవాటెల్‌లో జరిగిన ఏరోస్పేస్, డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరర్స్ సదస్సులో రాష్ట్ర మంత్రి నారా లోకేష్, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు మధ్య చోటుచేసుకున్న సంఘటన దీనికి మరొక నిదర్శనంగా నిలిచింది. వయసులో పెద్దవాడు లోకేష్‌ అయినప్పటికీ హోదాలో రామ్మోహన్ నాయుడు అగ్రస్థానంలో ఉన్నారు. అయితే ఈ సమావేశంలో ఇద్దరూ పదవులను పక్కన పెట్టి అన్నదమ్ముల్లా ప్రవర్తించడం సభలోని ప్రతిఒక్కరినీ ఆకట్టుకుంది.

Ram Mohan Naidu lokesh

Ram Mohan Naidu , lokesh

సదస్సు కార్యక్రమంలో ప్రోటోకాల్ ప్రకారం కేంద్ర మంత్రి చివరగా మాట్లాడాల్సి ఉంది. కానీ నారా లోకేష్ ప్రసంగం ప్రారంభించడానికి సిద్ధమయ్యారు. దీనిని గమనించిన రామ్మోహన్ నాయుడు “అన్నా ముందు నేను మాట్లాడతాను” అంటూ లేవగా, లోకేష్ వెంటనే వారిస్తూ “వద్దు రాము… నువ్వు కేంద్ర మంత్రి కాబట్టి చివర్లో మాట్లాడాలి, ఇప్పుడు నేనే మాట్లాడతాను” అని సరదాగా స్పందించారు. పదవుల హోదాలను పక్కనబెట్టి అన్నదమ్ముల్లా వారిద్దరి మధ్య చోటుచేసుకున్న ఈ చిన్న సంఘటన సభలో ఉన్న వారిని అలరించింది.

ఈ పరిణామం కూటమి ప్రభుత్వంపై ప్రజల విశ్వాసాన్ని మరింత పెంచిందనే చెప్పాలి. ఏమైనా చిన్నపాటి భిన్నాభిప్రాయాలు ఉన్నా వాటిని పక్కనబెట్టి కలిసి పనిచేస్తున్నారనే స్పష్టత ఇచ్చింది. ముఖ్యంగా వైసీపీ నేతలు కూటమిలో విభేదాలున్నాయని చేస్తున్న ప్రచారానికి ఈ సంఘటన బలమైన సమాధానంగా నిలిచింది. లోకేష్, రామ్మోహన్ నాయుడు ప్రదర్శించిన ఆత్మీయత, సమన్వయం కూటమి ప్రభుత్వం ప్రజలకు మేలు చేయడానికి కట్టుబడి ఉందనే నమ్మకాన్ని కలిగించింది.

sudheer

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది