Rayapati Aruna : సొంత పార్టీ నేతలపై రాయపాటి అరుణ సంచలన కామెంట్స్…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Rayapati Aruna : సొంత పార్టీ నేతలపై రాయపాటి అరుణ సంచలన కామెంట్స్…!

 Authored By tech | The Telugu News | Updated on :14 March 2024,9:00 pm

ప్రధానాంశాలు:

  •  Rayapati Aruna : సొంత పార్టీ నేతలపై రాయపాటి అరుణ సంచలన కామెంట్స్...!

Rayapati Aruna : జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి రాయపాటి అరుణ గురించి అందరికీ తెలిసే ఉంటుంది. పాకిస్తాన్ లోని ప్రకాశం జిల్లాలో జన్మించిన రాయపాటి అరుణ మధ్యతరగతి కుటుంబానికి చెందిన మహిళ. ఇక జనసేన పార్టీలో ఈమె ఒక కీలక నియామకం అని చెప్పాలి. ప్రకాశం జిల్లా కు చెందిన రాయపాటి అరుణ జనసేన పార్టీ అధికార ప్రతినిధిగా నియమితులయ్యారు. పార్టీ విధానాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడంతో పాటు పలు రకాల సమస్యలపై స్పందించడం, విమర్శలను దీటుగా ఎదుర్కొనే రాయపాటి అరుణ తీరు గమనించిన పవన్ కళ్యాణ్ ఆమెను జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమించడం జరిగింది. అయితే ఈమె ప్రకాశం జిల్లాలోని ఒంగోలు నగరానికి చెందినవారు. అయితే రాయపాటి అరుణ ప్రస్తుతం ప్రకాశం జిల్లాలో సంయుక్త కార్యదర్శిగా కొనసాగుతున్నారు. సాధారణ కుటుంబానికి చెందిన మహిళ అయినప్పటికీ రాజకీయ పార్టీ కార్యక్రమాలలో రాయపాటి అరుణ చాలా చురుగ్గా పాల్గొంటుంటారు.

అయితే ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయో మనం చూస్తూనే ఉన్నాం. ఈ క్రమంలోనే టీడీపీ మరియు జనసేన పొత్తులో భాగంగా ముందుకు వెళుతున్నాయి. దీంతో జనసేన పార్టీ కేవలం 24 సీట్లు మాత్రమే పొందడం జరిగింది. ఇక ఈ విషయంపై తాజాగా రాయపాటి అరుణ స్పందించడం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..జనసేన పార్టీకి మొదట్లో 52 , 60 సీట్లు వస్తాయని అనుకున్నాం. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల దృష్ట్యా పవన్ కళ్యాణ్ గారు 24 సీట్లు తీసుకోవాల్సి వచ్చింది. కానీ ఇప్పుడు 21 సీట్లు మాత్రమే ఇస్తానంటూ చర్చలు జరుగుతున్నాయని తెలియజేశారు. అయితే మొన్నటి వరకు 24 మరియు 70 సీట్లకు మధ్య వ్యత్యాసం ఉంది కాబట్టి వాటి గురించి చర్చించాం కానీ ఇప్పుడు 21కి 24 కు పెద్ద తేడా ఏముంది. ఇక ఇప్పుడు కూటమిలో భాగంగా వెళ్తున్న జనసేన పార్టీ ఇప్పుడు గెలుపు పై దృష్టి పెట్టాలని తెలియజేశారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయం ప్రకారం 100% సక్సెస్ ఇవ్వడం మన బాధ్యత అని ఈ సందర్భంగా ఆమె తెలియజేశారు.

కాబ్బటి వచ్చే ఎన్నికల్లో మన అభ్యర్థులు గెలుపు అనేది జగన్ పాలనపై ఆధారపడి ఉందని , జగన్ పాలన చూసిన ప్రజలు మన అభ్యర్థుల విజయాలను ముందుగానే ఖరారు చేశారని ఆమె తెలిపారు. ఇక వచ్చే ఎలక్షన్స్ సాఫిగా సాగాలంటే మన అధినేతలు అధికారం సాధించాలంటే పొత్తులో భాగంగానే కలిసి ముందుకు వెళ్లాలని ఈ సందర్భంగా ఆమె చెప్పుకొచ్చారు. కాబట్టి పోత్తులో ఎలాంటి అల్లర్లు లేకుండా మిత్రపక్షంతో సాఫీగా సాగాల్సిందిగా ఈ సందర్భంగా ఆమె కోరడం జరిగింది. ఇక వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా విజయం మనదేనని దాంట్లో ఆలోచించాల్సిన అవసరం లేదంటూ ఆమె తెలియజేశారు. కాబట్టి మిత్ర పక్షాలతో అందరూ సమన్వయంతో పని చేయాలని చెప్పుకొచ్చారు. ఇక అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా పార్టీ నేతలు అంతే సమన్వయంతో మిత్రపక్షంతో పనిచేయాలని రాయపాటి అరుణ చెప్పుకొచ్చారు. కాబట్టి జనసేన నేతలు ప్రస్తుతం సీట్ల విషయాలను పక్కనపెట్టి ఎలాంటి గొడవలు చేయకుండా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేయాల్సిందిగా ఆమె కోరారు. దీంతో రాయపాటి అరుణ చేసిన కామెంట్స్ ప్రస్తుతం రాజకీయ వర్గాలలో తీవ్ర చర్చానియాంశంగా మారాయి.

tech

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది