RGV : తెలుగు సినీ ఇండస్ట్రీలో ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గత ఏడాది వ్యూహం అనే పొలిటికల్ సినిమాను ప్రకటించిన విషయం మనందరికీ తెలిసిందే. ఇక ఇప్పుడు వ్యూహం 2 పేరుతో రెండో భాగాన్ని రాంగోపాల్ వర్మ తెరమీదకు తీసుకొస్తున్నారు. అయితే ఈ సినిమా ఎప్పుడో విడుదల కావాల్సి ఉంది కానీ దీనిపై సుప్రీంకోర్టులో కేసు వేయడం వలన విడుదలకు బ్రేక్ పడింది. తాజాగా సుప్రీంకోర్టు కూడా సినిమా విడుదలకు ఆమోదం తెలిపినట్లుగా రాంగోపాల్ వర్మ తన సోషల్ మీడియా ఖాతా ద్వారా తెలియజేశారు. ఇక ఈ సినిమా విడుదల తేదీని కూడా త్వరలోనే తెలియజేస్తామని రాంగోపాల్ వర్మ చెప్పుకొచ్చారు. ఇది ఇలా ఉంటే ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ఉండే రాంగోపాల్ వర్మ తాజాగా ఇంటర్వ్యూలో పాల్గొనడం జరిగింది. ఇక ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యూహం సినిమాలోని పలు పాత్రల గురించి సినిమా గురించి ఇంటర్వ్యూలో తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల గురించి జగన్మోహన్ రెడ్డి రాజకీయ భవిష్యత్తు గురించి అలాగే జగన్ భార్య వైఎస్ భారతి గురించి పలు రకాల కామెంట్ చేశారు.
అయితే ఈ సినిమాలో వైయస్ భారతి పాత్రలో మానసా రాధాకృష్ణన్ అనే యువతీ నటించగా దక్షిణాది నటుడు అజ్మల్ అమీర్ జగన్ పాత్రను పోషిస్తున్నారు. అయితే రాజకీయపరంగా వైఎస్ఆర్సిపి పార్టీకి అనుకూలంగా ఈ సినిమా ఉంటుందని , ఇక ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఈ సినిమా విడుదలయితే ఓటర్లను చీల్చే అవకాశం ఉందని విపక్ష పార్టీలు ఈ సినిమాపై కేసు వేయడం జరిగింది. ఈ క్రమంలోనే ఈ సినిమా విడుదలకు బ్రేక్ పడగా తాజాగా సినిమా విడుదలకు కూడా ఆదేశాలు జారీ చేసింది.
అయితే ఇంటర్వ్యూలో భాగంగా రాంగోపాల్ వర్మ మాట్లాడుతూ సినిమా గురించి పలు రకాల వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ సినిమాలో వైయస్ భారతి పాత్రను చూపించేందుకు ఎంతో కష్టపడ్డానని రాంగోపాల్ వర్మ తెలియజేశారు. సినిమా మొత్తంలో భారతి పాత్ర కోసం ఎంతగానో కష్టపడ్డానని ఎట్టకేలకు ఆమె క్యారెక్టర్ కు న్యాయం చేయగలిగాను అంటూ రాంగోపాల్ వర్మ చెప్పుకొచ్చారు. అదేవిధంగా జగన్ గురించి మాట్లాడుతూ నిజ జీవితంలో రాజకీయం గురించి నాకు తెలియదు అంటూ , జగన్ యొక్క రాజకీయ విధానం వైఎస్ఆర్సిపి పార్టీ యొక్క ప్రస్థానం గురించి కూడా నాకు ఏమాత్రం తెలియదని రాంగోపాల్ వర్మ కామెంట్స్ చేశారు. ఆ తర్వాత ఇంటర్వ్యూ చేసే యాంకర్ ఈ సినిమాలో జగన్ ఫ్యామిలీ ఆయనకు దూరంగా వెళ్లడాన్ని చూపించారా ..?విజయమ్మ షర్మిల గురించి సినిమాలో ఉంటుందా అని కూడా అడిగారు. దీనికి సమాధానం రాంగోపాల్ వర్మ మాట్లాడుతూ విజయమ్మ షర్మిల పాత్రలు కూడా ఉన్నాయని కానీ అవి అవసరమైనంతవరకే ఉంటాయని తెలియజేశారు. అయితే ఎప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారే రాంగోపాల్ వర్మ ఏ కామెంట్స్ చేసినా సరే ఇట్టే వైరల్ అవుతూ ఉంటాయి. ఈ నేపథ్యంలో తాజాగా రాంగోపాల్ వర్మ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ గా మారాయి.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.