RGV : భారతి క్యారెక్టర్ ను అలా చూపించడానికి చాలా కష్టపడ్డ… రాంగోపాల్ వర్మ..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

RGV : భారతి క్యారెక్టర్ ను అలా చూపించడానికి చాలా కష్టపడ్డ… రాంగోపాల్ వర్మ..!

RGV : తెలుగు సినీ ఇండస్ట్రీలో ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గత ఏడాది వ్యూహం అనే పొలిటికల్ సినిమాను ప్రకటించిన విషయం మనందరికీ తెలిసిందే. ఇక ఇప్పుడు వ్యూహం 2 పేరుతో రెండో భాగాన్ని రాంగోపాల్ వర్మ తెరమీదకు తీసుకొస్తున్నారు. అయితే ఈ సినిమా ఎప్పుడో విడుదల కావాల్సి ఉంది కానీ దీనిపై సుప్రీంకోర్టులో కేసు వేయడం వలన విడుదలకు బ్రేక్ పడింది. తాజాగా సుప్రీంకోర్టు కూడా సినిమా విడుదలకు ఆమోదం తెలిపినట్లుగా రాంగోపాల్ […]

 Authored By aruna | The Telugu News | Updated on :9 February 2024,9:00 pm

ప్రధానాంశాలు:

  •  RGV : భారతి క్యారెక్టర్ ను అలా చూపించడానికి చాలా కష్టపడ్డ...రాంగోపాల్ వర్మ..!

RGV : తెలుగు సినీ ఇండస్ట్రీలో ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గత ఏడాది వ్యూహం అనే పొలిటికల్ సినిమాను ప్రకటించిన విషయం మనందరికీ తెలిసిందే. ఇక ఇప్పుడు వ్యూహం 2 పేరుతో రెండో భాగాన్ని రాంగోపాల్ వర్మ తెరమీదకు తీసుకొస్తున్నారు. అయితే ఈ సినిమా ఎప్పుడో విడుదల కావాల్సి ఉంది కానీ దీనిపై సుప్రీంకోర్టులో కేసు వేయడం వలన విడుదలకు బ్రేక్ పడింది. తాజాగా సుప్రీంకోర్టు కూడా సినిమా విడుదలకు ఆమోదం తెలిపినట్లుగా రాంగోపాల్ వర్మ తన సోషల్ మీడియా ఖాతా ద్వారా తెలియజేశారు. ఇక ఈ సినిమా విడుదల తేదీని కూడా త్వరలోనే తెలియజేస్తామని రాంగోపాల్ వర్మ చెప్పుకొచ్చారు. ఇది ఇలా ఉంటే ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ఉండే రాంగోపాల్ వర్మ తాజాగా ఇంటర్వ్యూలో పాల్గొనడం జరిగింది. ఇక ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యూహం సినిమాలోని పలు పాత్రల గురించి సినిమా గురించి ఇంటర్వ్యూలో తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల గురించి జగన్మోహన్ రెడ్డి రాజకీయ భవిష్యత్తు గురించి అలాగే జగన్ భార్య వైఎస్ భారతి గురించి పలు రకాల కామెంట్ చేశారు.

అయితే ఈ సినిమాలో వైయస్ భారతి పాత్రలో మానసా రాధాకృష్ణన్ అనే యువతీ నటించగా దక్షిణాది నటుడు అజ్మల్ అమీర్ జగన్ పాత్రను పోషిస్తున్నారు. అయితే రాజకీయపరంగా వైఎస్ఆర్సిపి పార్టీకి అనుకూలంగా ఈ సినిమా ఉంటుందని , ఇక ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఈ సినిమా విడుదలయితే ఓటర్లను చీల్చే అవకాశం ఉందని విపక్ష పార్టీలు ఈ సినిమాపై కేసు వేయడం జరిగింది. ఈ క్రమంలోనే ఈ సినిమా విడుదలకు బ్రేక్ పడగా తాజాగా సినిమా విడుదలకు కూడా ఆదేశాలు జారీ చేసింది.

అయితే ఇంటర్వ్యూలో భాగంగా రాంగోపాల్ వర్మ మాట్లాడుతూ సినిమా గురించి పలు రకాల వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ సినిమాలో వైయస్ భారతి పాత్రను చూపించేందుకు ఎంతో కష్టపడ్డానని రాంగోపాల్ వర్మ తెలియజేశారు. సినిమా మొత్తంలో భారతి పాత్ర కోసం ఎంతగానో కష్టపడ్డానని ఎట్టకేలకు ఆమె క్యారెక్టర్ కు న్యాయం చేయగలిగాను అంటూ రాంగోపాల్ వర్మ చెప్పుకొచ్చారు. అదేవిధంగా జగన్ గురించి మాట్లాడుతూ నిజ జీవితంలో రాజకీయం గురించి నాకు తెలియదు అంటూ , జగన్ యొక్క రాజకీయ విధానం వైఎస్ఆర్సిపి పార్టీ యొక్క ప్రస్థానం గురించి కూడా నాకు ఏమాత్రం తెలియదని రాంగోపాల్ వర్మ కామెంట్స్ చేశారు. ఆ తర్వాత ఇంటర్వ్యూ చేసే యాంకర్ ఈ సినిమాలో జగన్ ఫ్యామిలీ ఆయనకు దూరంగా వెళ్లడాన్ని చూపించారా ..?విజయమ్మ షర్మిల గురించి సినిమాలో ఉంటుందా అని కూడా అడిగారు. దీనికి సమాధానం రాంగోపాల్ వర్మ మాట్లాడుతూ విజయమ్మ షర్మిల పాత్రలు కూడా ఉన్నాయని కానీ అవి అవసరమైనంతవరకే ఉంటాయని తెలియజేశారు. అయితే ఎప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారే రాంగోపాల్ వర్మ ఏ కామెంట్స్ చేసినా సరే ఇట్టే వైరల్ అవుతూ ఉంటాయి. ఈ నేపథ్యంలో తాజాగా రాంగోపాల్ వర్మ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ గా మారాయి.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది