RK Roja : రోజాకు రాజకీయంగా ఎదురుదెబ్బ?
RK Roja : ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. వైసీపీ ప్రభుత్వంలో కీలక మంత్రి గా వ్యవహరించిన ఆర్కే రోజాకు కూటమి ప్రభుత్వం భారీ షాక్ ఇవ్వబోతోందని ప్రచారం జరుగుతోంది. టీడీపీ సర్కార్, గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతిపై దర్యాప్తు ప్రారంభించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా క్రీడాశాఖ మంత్రి గా ఉన్న రోజా ఆధ్వర్యంలో జరిగిన ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంపై పెద్దఎత్తున నిధుల దుర్వినియోగం జరిగిందని ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యేలు ఈ వ్యవహారాన్ని లేవనెత్తగా, రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి దర్యాప్తునకు ఆదేశాలు ఇచ్చే అవకాశముందని తెలుస్తోంది.
RK Roja : రోజాకు రాజకీయంగా ఎదురుదెబ్బ?
ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం కింద రాష్ట్రవ్యాప్తంగా యువతకు క్రికెట్ కిట్లు పంపిణీ చేసి పోటీలు నిర్వహించారు. ఈ ప్రాజెక్టు కేవలం 45 రోజుల్లోనే రూ.119 కోట్లు ఖర్చు చేసిందని, మొత్తం రూ.400 కోట్ల నిధులను మళ్లించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహారంపై అసెంబ్లీలో అధికార పార్టీ ఎమ్మెల్యేలు ప్రశ్నించగా, ప్రభుత్వం దీనిపై ఏసీబీ విచారణకు సిఫార్సు చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. రోజా మంత్రిగా ఉండగా ఈ నిధుల కోసం ఇచ్చిన ఆదేశాలు, ఖర్చు వివరాలు, ఆడుదాం ఆంధ్ర ద్వారా ఉపయోగించిన బడ్జెట్ అన్నింటినీ అధికారులు సేకరిస్తున్నారు.
ఈ వివాదంలో రోజా పేరు కీలకంగా వినిపించడంతో, ఆమెకు రాజకీయంగా ఎదురుదెబ్బ తగలొచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. క్రీడాశాఖ నిధుల అక్రమ వినియోగం జరిగిందని నిరూపితమైతే, ఆమెపై చట్టపరమైన చర్యలు కూడా తీసుకునే అవకాశం ఉందని అంటున్నారు. ముఖ్యంగా జగన్ ప్రభుత్వం హయాంలో ఈ కార్యక్రమం కోసం భారీగా ఖర్చు పెట్టారని, ముగింపు వేడుకకు ముఖ్యమంత్రి రాకపోవడం వంటి అంశాలను టీడీపీ నాయకులు ప్రస్తావిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ రోజాను టార్గెట్ చేసేందుకు కూటమి సర్కార్ వ్యూహాత్మకంగా ముందుకు సాగుతుందని తెలుస్తోంది. ఇక ఏసీబీ దర్యాప్తు ఎలాంటి సంచలన విషయాలను వెలుగులోకి తెస్తుందో వేచి చూడాలి.
Rains | రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మంగళ, బుధవారాల్లో భారీ వర్షాలు (Heavy Rains) కురిసే అవకాశం ఉందని హైదరాబాద్…
Kiwi fruit | ఇటీవలి కాలంలో ఆరోగ్యంపై అవగాహన పెరిగిన నేపథ్యంలో పోషకాలు పుష్కలంగా ఉండే పండ్లకు డిమాండ్ ఎక్కువవుతోంది.…
Ginger | బరువు తగ్గడానికి స్పెషల్ డైట్ లేదా ఖరీదైన ఆహారం అవసరమే లేదు. మన ఇంట్లో దొరికే సాదాసీదా…
Morning Tiffin | రాత్రంతా నిద్రపోయిన తర్వాత శరీరం ఖాళీగా ఉంటుంది. ఆ సమయంలో శక్తి అవసరం అవుతుంది. అందుకే ఉదయం…
Health Tips | బొప్పాయి మంచి పోషకాలతో నిండి ఉండే పండు. ఇందులో విటమిన్లు ఎ, సి, ఇ ఎక్కువగా…
Banana peel Face Pack | మెరిసే చర్మం ఎవరికైనా ఇష్టమే! అందుకే మార్కెట్‌లో లభించే విభిన్నమైన బ్యూటీ క్రీములకు ఎంతో…
September | సెప్టెంబర్లో శుక్రుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించనున్న నేపథ్యంలో, కొన్ని రాశుల వారికి అదృష్టదాయక సమయం ప్రారంభం కాబోతుంది. ముఖ్యంగా…
Flipkart Jobs: పండుగ సీజన్ దగ్గరపడుతుండటంతో ఈ-కామర్స్ రంగంలో జోరు పెరిగింది. ముఖ్యంగా ఫ్లిప్‌కార్ట్ తన బిగ్ బిలియన్ డేస్…
This website uses cookies.