Roja : బాలకృష్ణ కు అది ఎక్కువ అంటూ రోజా ఘాటు వ్యాఖ్యలు.. వీడియో !
ప్రధానాంశాలు:
బాలకృష్ణ కు అది ఎక్కువ అంటూ రోజా ఘాటు వ్యాఖ్యలు..!
Roja : టాలీవుడ్‌లో హీరోయిన్‌గా చెరగని ముద్ర వేసిన రోజా రాజకీయ రంగంలోనూ తనదైన గుర్తింపు తెచ్చుకున్నారు. భైరవ ద్వీపం, బొబ్బిలి సింహం, శ్రీ కృష్ణార్జున విజయం వంటి ఎన్నో హిట్ చిత్రాల్లో నటించి ప్రేక్షకులకు చేరువయ్యారు. టెలివిజన్ రంగంలో ‘జబర్దస్త్’ షో ద్వారా సెన్సేషన్ క్రియేట్ చేసి, టీవీ ప్రేక్షకుల మధ్య ప్రత్యేక ఆదరణ పొందారు. రాజకీయాల్లో మొదట తెలుగుదేశం పార్టీతో ప్రయాణం ప్రారంభించిన ఆమె, తర్వాత వైఎస్ జగన్ Ys Jagan నాయకత్వంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరి నగరి నియోజకవర్గం నుంచి గెలిచి ఎమ్మెల్యేగా , మంత్రి గా సేవలు అందించారు. గత ఎన్నికల్లో ఓటమి చెందడం తో ప్రస్తుతం మళ్లీ బుల్లితెరపై సందడి చేస్తుంది.

బాలకృష్ణ కు అది ఎక్కువ అంటూ రోజా ఘాటు వ్యాఖ్యలు..!
Roja : బాలకృష్ణ కు దమ్ముంటే చూపించాలంటూ రోజా సవాల్
ఈ క్రమంలో ఓ ఇంటర్వ్యూలో రోజా చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. నందమూరి బాలకృష్ణపై తీవ్ర విమర్శలు చేస్తూ ఆయనపై సూటిగా ప్రశ్నలు సంధించారు. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత షూటింగ్‌లు చేయడాన్ని సమర్థించుకునే బాలకృష్ణ, తన టీవీ షోలు మాత్రం తప్పుగా అభిప్రాయపడటం మగ అహంకారానికి నిదర్శనమని రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. బాలకృష్ణ నాయికలతో నటిస్తూ చేసే స్టెప్పులు ప్రశ్నించకుండా, తాను డ్యాన్స్ చేస్తే విమర్శించడం తగదన్నారు. తాను ఎవరితోనూ వ్యక్తిగత విభేదాలు లేకుండా ప్రజాసేవ చేస్తున్నానని తెలిపారు.
బాలకృష్ణ హిందూపురం నియోజకవర్గంలో ఎంత అభివృద్ధిని చేసాడో..? అసెంబ్లీకి ఎన్నిసార్లు వచ్చారో చెప్పాలని ప్రశ్నించారు. దమ్ముంటే తన సవాల్‌ను స్వీకరించాలని ఛాలెంజ్ చేసింది. రాజకీయాల్లో ఉన్న ప్రతి ఒక్కరు ప్రజలకు నివేదిక ఇవ్వాలని సూచించిన రోజా, నాయకులు సినిమా వ్యాపారంతో కాకుండా ప్రజల అవసరాలతో వ్యవహరించాలని హెచ్చరించారు. మరి రోజా ఛాలెంజ్ ను బాలకృష్ణ స్వీకరిస్తారా..? రోజా వ్యాఖ్యలకు బాలయ్య ఎలా కౌంటర్ ఇస్తారనేది చూడాలి.
Attaa Roja Massive Slippery Shots!🔥
నేను ఎమ్మెల్యేగా ఉండి జబర్దస్త్ చేస్తే తప్పు.
బాలకృష్ణ ,పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా గెలిచి షూటింగ్ లు తీస్తే తప్పులేదు.
నేను డాన్స్ చేస్తే తప్పు.బాలకృష్ణ నడుము గిల్లుతూ డాన్సులు చేస్తే తప్పు కాదు.
– రోజా pic.twitter.com/nLCOYhe0lE
— 𝐍𝐚𝐯𝐞𝐞𝐧 𝐘𝐒𝐉 𝐕𝐢𝐳𝐚𝐠 (@YSJ2024) July 5, 2025