Roja : పవన్ కళ్యాణ్ కు ప్యాకేజ్ ఉంటె చాలు ఎవరు ఏమైపోయినా పర్వాలేదు : రోజా
Roja : వైసీపీ ఆధినేత జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు మేరకు మాజీ మంత్రి ఆర్కే రోజా చెవిలో పువ్వులు పెట్టుకొని వినూత్న నిరసన చేపట్టారు. తిరుపతిలో నిర్వహించిన “వెన్నుపోటు దినం” కార్యక్రమంలో పాల్గొన్న ఆమె, కూటమి ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు ప్రజల విశ్వాసాన్ని ద్రోహించిన వ్యక్తిగా అభివర్ణించారు.
Roja : పవన్ కళ్యాణ్ కు ప్యాకేజ్ ఉంటె చాలు ఎవరు ఏమైపోయినా పర్వాలేదు : రోజా
గంజాయి, మద్యం, ఇసుక అక్రమ రవాణా వంటి సంఘటనలు కూటమి ప్రభుత్వ హయాంలో బాగా పెరిగిపోయాయని తెలిపారు. మహిళలపై హింసాత్మక సంఘటనలు, విద్యార్థుల సమస్యలు అధికమవుతున్నాయని ఆమె మండిపడ్డారు. ఏడాది పాలనలో ప్రజలకు ఎటువంటి భద్రతా గ్యారెంటీ లేదని, సంక్షేమం మాట అటుంచితే ప్రాథమిక హక్కులు కూడా లేని స్థితి దాపురించిందని విమర్శించారు. చంద్రబాబు ప్రభుత్వం ప్రజలకు వెన్నుపోటు పొడిచిందని ధ్వజమెత్తారు.
ఈ సందర్భంగా రోజా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై కూడా తీవ్రంగా స్పందించారు. ఎన్నికల ముందు ఉత్సాహంగా మాట్లాడిన పవన్, నేడు మహిళలపై జరుగుతున్న దారుణాలపై మౌనం పాటిస్తున్నారని విమర్శించారు. పౌరులకు గళం కల్పించాల్సిన సమయమిదని, వాగ్దానాలను నెరవేర్చని నారా లోకేష్‌పై కూడా “పప్పు” అనే వ్యాఖ్య చేశారు. చివరగా, రెడ్‌బుక్ పాలనకు బదులు ప్రజల సంక్షేమానికి కట్టుబడి ఉండాలని, లేకపోతే రోడ్డెక్కి పోరాడతామని హెచ్చరించారు.
Vivo | స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో గట్టి పోటీ నడుస్తున్న ఈ రోజుల్లో ప్రముఖ మొబైల్ బ్రాండ్ వివో (Vivo) తన…
Jupitar Price | దేశవ్యాప్తంగా జీఎస్టీ రేట్లలో మార్పులు సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి వచ్చిన నేపథ్యంలో, ప్రముఖ ద్విచక్ర…
Asia Cup 2025 | పాకిస్తాన్‌తో జరగబోయే ఫైనల్లో గెలిచి ఆసియా కప్ 2025 ట్రోఫీని కైవసం చేసుకోవాలని సూర్య…
Aghori | రాష్ట్రంలో సంచలనం సృష్టించిన అఘోరీ – వర్షిణి వ్యవహారం మళ్లీ వార్తల్లోకెక్కింది. అఘోరీని పోలీసులు అరెస్ట్ చేసి…
Raja Saab | రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఈగర్ వెయిట్ చేస్తున్న చిత్రాల్లో 'రాజాసాబ్' ఒకటి. చాలా…
Telangana | తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు దంచికొడుతున్నాయి. రాష్ట్రంలో ఇప్పటికే పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండగా, వచ్చే రెండు…
Makhana | బరువు తగ్గాలనుకుంటున్నారా? డయాబెటిస్‌ను నియంత్రించాలనుకుంటున్నారా? ఎముకల బలహీనతతో బాధపడుతున్నారా? అయితే మీరు మఖానాను తప్పక మీ రోజువారీ…
Salt | ఉప్పు లేకుండా మన రోజువారీ ఆహారం అసంపూర్ణమే. వంటల్లో రుచి కోసం, ఆహారంలో ఫ్లేవర్ కోసం, చివరికి…
This website uses cookies.