Nagababu : నాగబాబు ఎప్పటికీ నోరు మూసుకునేలా మంత్రి రోజా స్ట్రాంగ్ కౌంటర్ !
Nagababu : ఆంధ్రప్రదేశ్ Andhra pradesh రాజకీయాలలో వైసీపీ మంత్రి రోజా Roja జనసేన పార్టీ Janasena నేత నటుడు నాగబాబు Nagababu మధ్య గట్టిగా కోల్డ్ వార్ నడుస్తోంది. ఇద్దరూ కూడా నువ్వా నేనా అన్నట్టుగా ఒకరిపై మరొకరు కామెంట్లు చేసుకుంటున్నారు. ఒకప్పుడు జబర్దస్త్ కామెడీ షో లో పక్కపక్కన కూర్చుని తనివి తీర నవ్వుతూ.. షో సక్సెస్ కావడంలో వీళ్ళిద్దరూ కీలకపాత్ర పోషించారు. జబర్దస్త్ కామెడీ షో లో జడ్జీలుగా చాలా కాలం పాటు టెలివిజన్ ప్రేక్షకులను అలరించారు. అటువంటిది ఇప్పుడు ఏపీ రాజకీయాలలో ఇద్దరు వేరువేరు పార్టీలు కావడంతో ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. పైగా రోజా అధికార పార్టీకి చెందిన మంత్రి కావటంతో ఎక్కడ తగ్గటం లేదు. కొన్ని వారాల క్రితం మెగా ఫ్యామిలీ పై తనదైన శైలిలో తీవ్రస్థాయిలో విమర్శలు చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ మంత్రిగా రాణిస్తున్న రోజా ఇటీవల తన సొంత నియోజకవర్గం నగరిలో పలు కార్యక్రమాలలో పాల్గొనడం జరిగింది.
గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొని 11 లక్షల రూపాయలు నిధులు కేటాయించారు. గ్రామాల్లో తాగునీరు మరియు పైప్ లైన్ లకు పూజ చేసి ప్రారంభించారు. తన సొంత నియోజకవర్గంలో ప్రజలతో గడిపిన వివిధ కార్యక్రమాల ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి తనకి ఆత్మసంతృప్తి కలిగించిందని సోషల్ మీడియాలో తెలియజేశారు. అయితే ఈ ఫోటోలపై జనసేన పార్టీ నేత నాగబాబు వ్యంగ్యంగా స్పందించారు. హంద్రీనీవా సుజల స్రవంతి ప్రారంభించిన రోజా చిత్తూరు కర్నూలు అనంతపురం, కడప జిల్లాల ప్రజల దాహార్తిని తీర్చిన వైసిపీ(మాయ) పార్టీ నాయకురాలు రోజా… ఈ ప్రాజెక్టు ద్వారా రాయలసీమలోని 6.025 లక్షల ఎకరాలకి సాగునీరు, 33 లక్షల మందికి త్రాగునీరు అందించినట్లు సమాచారం అని ట్విట్టర్ వేదికగా సెటైర్లు వేశారు. అయితే నాగబాబు చేసిన కామెంట్ కు మంత్రి రోజా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ‘ఆ గ్రామ ప్రజలు ఐదు దశాబ్దాలుగా ఈ నీటి కోసమే ఎదురుచూస్తున్నారు.
సుదూర ప్రాంతాల నుంచి పైప్ లైన్ లాగి తాగునీటికి ఇచ్చాం నాగబాబు. గాడిదకి ఏం తెలుసు గంధపువాసన, నేను కాబట్టి ఇదిగో వివరాలు చూపిస్తున్నా. అదే ఆ గ్రామానికి వెళ్లి వెటకారం మాటలు మాట్లాడి చూడు తగిన రీతిలో చెప్తారు గుణపాఠం’ అని కౌంటర్ ఇస్తూనే కొన్ని వివరాలను కూడా ట్విట్టర్‌లో షేర్ చేశారు. ఈ పరిణామంతో రోజా వర్సెస్ నాగబాబు మధ్య గట్టిగా పొలిటికల్ వార్ నడుస్తూ ఉంది. రోజా ఇచ్చిన కౌంటర్ నాగబాబు ఎప్పటికీ నోరు మూసుకునేలా ఉంది అని నేటిజెన్ లు ఆమెను సపోర్ట్ చేస్తున్నారు. రాజకీయంగా ఇంకా సినిమా పరంగా నాగబాబు చేసింది ఒరిగిందేమీ లేదని… కూడా కౌంటర్లు వేస్తున్నారు.
