Ys Jagan : డిల్లీ పీఠం దద్దరిల్లే లా YCP సంచలన నిర్ణయం , వైఎస్ జ‌గ‌న్‌ కోసం ఏపీ కి డిల్లీ పెద్దలు..!

Authored By Ramu Tandu Ramalingaiah | The Telugu News | Updated on : 12 February 2026, 6:00 pm
  •  Ys Jagan : డిల్లీ పీఠం దద్దరిల్లే లా YCP సంచలన నిర్ణయం , వైఎస్ జ‌గ‌న్‌ కోసం ఏపీ కి డిల్లీ పెద్దలు..!

Ys Jagan : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ Ysrcp Ys Jagan అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి  భద్రత విషయంలో ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద దుమారం రేగుతోంది. జగన్ ప్రాణాలకు ముప్పు పొంచి ఉందని, అందుకే ఆయనకు వెంటనే జడ్ ప్లస్ కేటగిరీ భద్రత కల్పించాలని కోరుతూ పార్టీ నేతలు కేంద్ర హోం శాఖకు లేఖ రాయడం సంచలనంగా మారింది. జగన్ కేవలం ఒక మాజీ ముఖ్యమంత్రి మాత్రమే కాదని, ఆయనకు కోట్లాది మంది అభిమానులు, బలమైన ఓటు బ్యాంకు ఉన్నాయని, అటువంటి ప్రజా నాయకుడికి భద్రత తగ్గించడం ఏమాత్రం సరికాదని సీనియర్ జర్నలిస్ట్ పురుషోత్తం ఈ వీడియోలో విశ్లేషించారు. ప్రభుత్వం బయట ఏమో ఆయనకు భద్రత ఇస్తున్నామని చెబుతూనే, లోపల మాత్రం పోలీసుల ద్వారా ఇబ్బందులు పెడుతోందని ఆరోపణలు వస్తున్నాయి. ముఖ్యంగా పర్యటనల సమయంలో బాంబ్ స్క్వాడ్ తనిఖీలు చేయకపోవడం, చివరి నిమిషంలో రూట్లు మార్చేలా ఒత్తిడి తేవడం వంటివి జగన్ Jagan  భద్రతను ప్రమాదంలో పడేస్తున్నాయని వైసీపీ YCP శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Ys Jagan : డిల్లీ పీఠం దద్దరిల్లే లా YCP సంచలన నిర్ణయం , వైఎస్ జ‌గ‌న్‌ కోసం ఏపీ కి డిల్లీ పెద్దలు..!

Ys Jagan : డిల్లీ పీఠం దద్దరిల్లే లా YCP సంచలన నిర్ణయం , వైఎస్ జ‌గ‌న్‌ కోసం ఏపీ కి డిల్లీ పెద్దలు..!

మరోవైపు మాజీ మంత్రి అంబటి రాంబాబు Ambati Rambabu అరెస్ట్ వ్యవహారం కూడా రాజకీయాలను వేడెక్కిస్తోంది. అంబటిని పరామర్శించిన ఉండవల్లి అరుణ్ కుమార్ Undavalli Arun Kumar చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అందరి నోటా వినిపిస్తున్నాయి. అంబటి ఇంటిపై Ambati Rambabu దాడులు చేసి నిప్పు పెట్టిన వాళ్లకు స్టేషన్ బెయిల్ ఇచ్చి, కేవలం విమర్శలు చేసినందుకు అంబటిని జైలుకు పంపడం ఏ రకమైన న్యాయమని ఆయన ప్రశ్నించారు. ఈ ఒక్క మాటతో ప్రభుత్వం చేస్తున్న కక్ష సాధింపు రాజకీయం సామాన్య ప్రజల్లోకి బలంగా వెళ్లిందని, ఇది జగన్ పార్టీకి రాజకీయంగా పెద్ద ఎత్తున సానుభూతిని తెచ్చిపెడుతుందని విశ్లేషకులు చెబుతున్నారు. అసెంబ్లీ సమావేశాలకు జగన్ హాజరు కావడంపై జరుగుతున్న ప్రచారంలో కూడా నిజం లేదని, ఆయన వరుసగా అరవై రోజులు రాలేదు కాబట్టి అనర్హత వేటు వేస్తామనడం కేవలం రాజకీయ విమర్శలే తప్ప చట్టపరంగా అది సాధ్యం కాదని క్లారిటీ ఇచ్చారు.

చెన్నైలో జరిగిన పెళ్లి వేడుకల్లో జగన్ పాల్గొనడం కూడా ఒక పొలిటికల్ మైలేజ్ లాగే కనిపిస్తోంది. అక్కడ తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, హీరో విజయ్ వంటి వారితో జగన్ కలవడం చూస్తుంటే, రాబోయే రోజుల్లో దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ పార్టీల కూటమికి జగన్ నేతృత్వం వహించే అవకాశాలు ఉన్నాయని చర్చ జరుగుతోంది. దేశవ్యాప్తంగా మాస్ ఇమేజ్ ఉన్న యువ నాయకుల్లో జగన్ ఒకరని, అందుకే ఆయనపై వస్తున్న ఈ విమర్శలు, వేధింపులు ఆయన క్రేజ్‌ను తగ్గించలేవని పురుషోత్తం వివరించారు. ఉండవల్లి లాంటి మేధావులు కూడా జగన్ పక్షాన గళం విప్పడం వల్ల ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఏకమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఒక రకంగా చూస్తే, ఈ పరిణామాలన్నీ జగన్ చుట్టూ రాజకీయాలను తిప్పడమే కాకుండా, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి కొత్త ఉత్సాహాన్ని ఇచ్చేలా ఉన్నాయి. ప్రభుత్వం ఎంత అణచాలని చూస్తే, అంబటి అరెస్ట్ వంటి ఘటనల వల్ల జగన్ ఇమేజ్ అంతగా పెరుగుతూ ప్రజల్లో సానుకూలతను కలిగిస్తోంది.

Ramu Tandu Ramalingaiah

Author Bio Info : Ramu Tandu Ramalingaiah is experienced in Media field. He worked in various Telugu media houses for about 15+ years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Editor of thetelugunews.com | Contact Details : ramu@thetelugunews.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp