Roja : మరో మూడు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రచారం మొదలుపెట్టాయి.జనసేన, టీడీపీ కలిసి వైయస్సార్ సిపి పార్టీపై వార్ ని ప్రకటించాయి. బీజేపీ కూడా జనసేన, టీడీపీ తో కలిస్తే వై.యస్.జగన్మోహన్ రెడ్డికి ఓటమి ఖాయం అని అంటున్నారు. ఇక వై.యస్.జగన్మోహన్ రెడ్డి గెలవాలని సీట్ల విషయంలో ఆచితూచి అడుగు వేస్తున్నారు. ఇక ఇటీవల నగరి నియోజకవర్గ ఎమ్మెల్యే రోజాకు ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో సీటు రాదని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా వీటిపై ఆర్కే రోజా స్పందించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తనకు టికెట్ రాదని ప్రచారం చేస్తున్నారని ప్రతిపక్షాలు, ఎల్లో మీడియా పై రోజా మండిపడ్డారు. ఈరోజు తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రోజా అనంతరం మీడియాతో మాట్లాడారు. తనపై అసత్య ప్రచారం చేస్తూ కొంతమంది శునకానందం పొందుతున్నారని ఆమె ఫైర్ అయ్యారు.
ప్రభుత్వ కార్యక్రమాలు ఏది జరిగిన ముందు వరుసలో ఉండేది నేనే. టికెట్ ఎవరికీ ఇచ్చిన నాకు అభ్యంతరం లేదు. నేను సీఎం జగనన్నకు సైనికురాలిని. జగనన్న కోసం ప్రాణ ఇవ్వడానికైనా సిద్ధం. సీటు ఇవ్వకపోయినా జగనన్న వెంటే ఉంటా అని అన్నారు. రోజా కి సీటు లేదని ప్రచారం చేస్తున్న వాళ్లకి కొన్ని రోజులు మాత్రమే ఆ ఆనందం. ఆ కార్యకర్తలకు, నాయకులకు ఎటువంటి బాధ లేదు. ఎందుకంటే వాళ్లకి నిజం తెలుసు. నాకు టికెట్ ఉందని, ఒకవేళ నాకు సీటు లేదని, మీరు ఆనందపడిన నాకు ఇబ్బంది లేదు. మిషన్ 2024లో 175 నియోజకవర్గాల్లో భాగం అవుతారని ఆమె అన్నారు. ఎన్నికల్లో పోటీ చేసే అంశం పైన స్పందించారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని స్పష్టం చేశారు. అయితే జగనన్న మాట తనకు శిరోధార్యం అని ఆమె తెలిపారు.
రాష్ట్రం బాగుండాలని, సీఎం వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని, దేవుడిని కోరుకున్నట్లు రోజా తెలిపారు. ఎల్లో మీడియా దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని ఆమె అన్నారు. ప్రతిపక్ష పార్టీలకు 175 నియోజకవర్గాల్లో అభ్యర్థులు దొరకటం లేదని, వైసీపీలో ఎవరు గొడవపడతారా అని చూస్తున్నారు. ఎవరికైనా సీటు ఇవ్వకుండా ఉంటే బాగుంటుంది, వాళ్లు మన పార్టీలోకి వస్తారు అని అనుకుంటున్నారు. గోతి కాడ గుంట నక్క లాగా చూస్తున్నారు. జగనన్న మీద ప్రజలకు ఎంత ప్రేమ ఉందో, అంతకు రెట్టించిన ప్రేమ మా అందరికీ ఉంది అని ఆమె అన్నారు. జగనన్నకు ఎక్కడా వ్యతిరేకం లేదు. ఎందుకంటే దేశంలో ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా సంక్షేమ పథకాలు అందించారు. పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు ఎక్కడ పోటీ చేయాలో తెలియక సర్వే చేయించుకుంటున్నారని రోజా అన్నారు.
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప 2 Pushpa 2 The Rule ప్రమోషన్స్ జోరందుకున్నాయి. సినిమాను పాన్…
Wheat Flour : ప్రస్తుతం మార్కెట్లో దొరికే ప్రతి వస్తువు కూడా కల్తీ గా మారింది. అలాగే ఎక్కడ చూసినా కూడా…
This website uses cookies.