Sajjala Ramakrishna Reddy : వైయస్ షర్మిల కాంగ్రెస్ లో చేరడానికి చంద్రబాబు దే స్కెచ్ – సజ్జల రామకృష్ణారెడ్డి..!!

Sajjala Ramakrishna Reddy : వైసీపీ ప్రధాన కార్యదర్శి, ఏపీ ప్రభుత్వం సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వై.యస్.షర్మిల కాంగ్రెస్ లో చేరడానికి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ప్రోత్సాహం ఉందని సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. ఆయన మాట్లాడుతూ. . సొంత పార్టీ పెట్టుకోవడానికి ఎవరికైనా హక్కు ఉంటుంది. వైఎస్ షర్మిలకు కూడా ఆ హక్కు ఉంది. ఆమె ఏ పార్టీ పెట్టుకున్న ఎటువంటి అభ్యంతరం ఉండదు. గతంలో వై.యస్.జగన్మోహన్ రెడ్డి వైయస్సార్ సీపీ పార్టీని స్థాపిస్తే టీడీపీ, కాంగ్రెస్ కలిసి జగన్ ను అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపించారు. ఆ పార్టీని మధ్యలోనే తుంపేయాలని చూశారు. మొదటి నుంచి చంద్రబాబు మీద అనుమానాలు ఉన్నాయి. వై.యస్.రాజశేఖర్ రెడ్డి మరణం పై కూడా పలు అనుమానాలు వెల్లడయ్యాయి. టీడీపీ, కాంగ్రెస్ కలిసి వైఎస్ఆర్ సీపీ పార్టీని అంతం చేయాలని చూశాయి.

కాంగ్రెస్ టీడీపీ తెర వెనుక ఉండి ప్రోత్సహిస్తూ జగన్ మీద ఆరోపణలు చేస్తూ వస్తుంది. ఇప్పుడు కాంగ్రెస్ కు వై.యస్.షర్మిల జీవం పోశారు. వై.యస్.జగన్మోహన్ రెడ్డిని దువ్వెత్తిపోవడానికి వై.ఎస్.షర్మిల కాంగ్రెస్ లోకి చేరారు. జగన్ కు వచ్చే ఓట్లను లాగేయడానికి కాంగ్రెస్ చూస్తుంది. వై.యస్.షర్మిల కాంగ్రెస్ లోకి చేరడానికి టీడీపీ, జనసేన హస్తం కచ్చితంగా ఉంది. చంద్రబాబు గెలవడానికి ఏదైనా చేస్తారు. తనకు ఏమి కావాలో ఇతరుల ద్వారా చేయించుకుంటారు. ఈ క్రమంలోనే వై.యస్.షర్మిలను కూడా కాంగ్రెస్ లోకి వచ్చేలా చేశారు. వై.యస్.జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలతో ప్రజలను ఆకట్టుకున్నారు. మేనిఫెస్టోలో లేనివి కూడా పెట్టి పాజిటివిటీని దక్కించుకున్నారు.

అది చూసి తట్టుకోలేక టీడీపీ జగన్ పై అవినీతి ఆరోపణలు చేస్తున్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయలేదని చెబుతున్నారు. కానీ ఆంధ్రప్రదేశ్లో పేదల కుటుంబాలు వై.యస్.జగన్మోహన్ రెడ్డి పెట్టిన సంక్షేమ పథకాల వలన బాగుపడ్డాయి. ఈ క్రమంలోనే అమ్మఒడి, విద్యా దీవెన పథకాల వలన యువత చదువుకోవడానికి ముందుకు వస్తున్నారు. ఇంకా ప్రజలకు చాలా మేలు చేసిన వైయస్ జగన్మోహన్ రెడ్డిని ఎలాగైనా ప్రజలలో బ్యాడ్ చేయాలని జనసేన, టీడీపీ ప్రయత్నిస్తున్నాయి. కానీ ప్రజలు వై.యస్.జగన్మోహన్ రెడ్డి అంటే ఏంటో తెలుసుకున్నారు. జగన్ కూడా మీ ఇంట్లో మేలు జరిగితే నాకు ఓటు వేయండి అని చెప్పారు. ఇలాంటి గొప్ప నాయకుడిని ప్రజలు మళ్లీ గెలిపిస్తారని సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు.

Recent Posts

Onion Black Streaks : నల్ల మచ్చలు ఉన్న ఉల్లిగడ్డలు తినే వాళ్లు వెంటనే ఇది చదవండి

Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…

1 week ago

Jaggery Vs Sugar : తియ్యగా ఉంటాయని చెక్కర, బెల్లం తెగ తినేస్తున్నారా?

Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…

1 week ago

Benefits of Eating Fish : మీకు నచ్చినా నచ్చకపోయినా చేపలు తినండి.. పది కాలాల పాటు ఆరోగ్యంగా ఉండండి

Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…

1 week ago

Egg vs Paneer : ఎగ్ వర్సెస్ పనీర్.. ఏది మంచిది? ఏది తింటే ప్రొటీన్ అధికంగా దొరుకుతుంది?

Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…

1 week ago

Snoring Health Issues : నిద్రపోయేటప్పుడు గురక పెడుతున్నారంటే మీకు ఈ అనారోగ్య సమస్యలు ఉన్నట్టే

Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…

1 week ago

Swallow Bubble Gum : బబుల్‌ గమ్ మింగేస్తే ఏమౌతుంది? వెంటనే ఏం చేయాలి?

Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…

2 weeks ago

Garlic Health Benefits : రోజూ రెండు వెల్లుల్లి రెబ్బలు తింటే మీ బాడీలో ఏం జరుగుతుందో తెలుసా?

Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…

2 weeks ago