Sajjala Ramakrishna Reddy : పవన్ పక్కన లేకపోతే చంద్రబాబుకు వాల్యూ లేదు.. ఇంటికి వెళ్లి కాళ్లు మొక్కి సభకు తీసుకొచ్చారు | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Sajjala Ramakrishna Reddy : పవన్ పక్కన లేకపోతే చంద్రబాబుకు వాల్యూ లేదు.. ఇంటికి వెళ్లి కాళ్లు మొక్కి సభకు తీసుకొచ్చారు

Sajjala Ramakrishna Reddy : ఏపీలో ఎన్నికలకు ఇంకా మూడు నాలుగు నెలల సమయం కూడా లేదు. దీంతో ప్రధాన పార్టీలన్నీ ఎన్నికలకు వ్యూహాలు రచించే పనిలో బిజీ అయ్యాయి. ఇటీవలే టీడీపీ యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్ర పూర్తి చేసుకున్న సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు బహిరంగ సభను నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ సభకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా హాజరయ్యారు. ఈ సభపై తాజాగా వైసీపీ నేత సజ్జల రామకృష్ణ […]

 Authored By kranthi | The Telugu News | Updated on :23 December 2023,2:00 pm

ప్రధానాంశాలు:

  •  నారా లోకేష్, పవన్ కళ్యాణ్ పై సజ్జల ఫైర్

  •  పవన్ కాళ్లను చంద్రబాబు పట్టుకొని మరీ సభకు తీసుకొచ్చారని మండిపాటు

  •  పవన్ పక్కన లేకపోతే చంద్రబాబు నిల్

Sajjala Ramakrishna Reddy : ఏపీలో ఎన్నికలకు ఇంకా మూడు నాలుగు నెలల సమయం కూడా లేదు. దీంతో ప్రధాన పార్టీలన్నీ ఎన్నికలకు వ్యూహాలు రచించే పనిలో బిజీ అయ్యాయి. ఇటీవలే టీడీపీ యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్ర పూర్తి చేసుకున్న సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు బహిరంగ సభను నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ సభకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా హాజరయ్యారు. ఈ సభపై తాజాగా వైసీపీ నేత సజ్జల రామకృష్ణ రెడ్డి స్పందించారు. వాళ్లు ఎప్పుడు పవర్ లోకి రావాలి అనేదే ఉంది. వేల కిలోమీటర్లు నారా లోకేష్ నడిచాడా? వీళ్లు ముగ్గురు మాట్లాడిన దాన్ని గమనిస్తే ఎంత త్వరగా పవర్ లోకి రావాలనేదే వాళ్లలో కనిపిస్తోంది. మళ్లీ ప్రజల్లో విశ్వాసం తెచ్చుకోవడం కోసం పడే ఆత్రం వాళ్లలో కనిపిస్తోంది. చంద్రబాబు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్ వీళ్లంతా ఒక మాండేట్ ఇచ్చారు.

వీళ్ల మైత్రి కలకాలం కొనసాగాలట. అధిష్ఠానం మాటకు అందరూ కట్టుబడి ఉండాలట. కేవలం ఎన్నికల కోసం పవన్ కళ్యాణ్ పక్కన లేకపోతే జనం దృష్టిలో వాల్యూ లేదని చంద్రబాబుకు తెలుసు. ఆయన రాకుంటే ఇంటికి వెళ్లి కాళ్లా వేళ్లా పడి సభకు తీసుకొచ్చుకున్నాడన్నారు. ఒకపక్క డెస్పరేషన్, మరో పక్క మేమంతా కలిశాం అనేది చెప్పుకోవడానికి ప్రయత్నించారు. వాళ్లు క్రియేట్ చేసుకున్న ఇమేజ్ అది. నిజంగా అదే కనిపిస్తోంది. జగన్ మోహన్ రెడ్డి క్యారెక్టర్ గురించి వాళ్లకు మాట్లాడే అర్హత లేదు. అన్నింటికంటే ముఖ్యంగా వాళ్లు ఏం చేశారో తెలుసుకోవడం లేదు.

Sajjala Ramakrishna Reddy : ఐదేళ్లు ఈ పెద్దమనిషి ఏం చేశాడు?

2014 నుంచి 2019 వరకు ఈ పెద్దమనిషి ఏం చేశాడో ఎందుకు చెప్పలేకపోతున్నాడు. ఎందుకు దాని గురించి ప్రస్తావించడం లేదు. ఒక కొత్త పార్టీ పెడితే ఏ నాయకుడు అయినా ఎలా హామీలు గుప్పిస్తారో అలా హామీలు గుప్పిస్తున్నారు. ప్రజలు అడగరా? 2014 లో కూడా పవన్ కళ్యాణ్ సపోర్ట్ తోనే గెలిచారు. మరి 2019 లో ఎందుకు పవన్.. చంద్రబాబుతో వ్యతిరేకించారు అంటూ సజ్జల ప్రశ్నించారు.

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది