Sake Sailajanath : టీడీపీకు అసలు వారసుడు ఎవరు? సాకే శైలజానాథ్ సెటైర్లు | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Sake Sailajanath : టీడీపీకు అసలు వారసుడు ఎవరు? సాకే శైలజానాథ్ సెటైర్లు

 Authored By ramu | The Telugu News | Updated on :27 May 2025,6:00 pm

ప్రధానాంశాలు:

  •  Sake Sailajanath : టీడీపీకు అసలు వారసుడు ఎవరు? సాకే శైలజానాథ్ సెటైర్లు

Sake Sailajanath : తెలుగుదేశం పార్టీ కి అసలు వారసత్వం ఎవరిది అనే చర్చ మళ్లీ వేడెక్కుతోంది. ఎన్టీఆర్ స్థాపించిన పార్టీకి ఇప్పుడు ఎవరు అసలైన వారసుడో అనే దానిపై సోషల్ మీడియా వేదికగా తీవ్ర వ్యాఖ్యలు వెల్లువెత్తుతున్నాయి. “దబిడి దిబిడి” అంటున్న వ్యక్తి నిజమైన వారసుడా? లేక మరోవైపు మరో మహిళా నేత మరో పార్టీలో అధ్యక్ష పదవిని ఎప్పుడు తీసేస్తారోనన్న భయంతో ఉండటం పార్టీ వర్గాల్లో గుసగుసలు రేపుతోంది. ఈ నేపథ్యంలో # Jr NTR పేరును తెరపైకి తెచ్చారు. అతడే అసలైన వారసుడా? కాదా? అని ఇప్పటికీ పార్టీ వర్గాల్లో స్పష్టత లేకపోవడం గమనార్హం.

Sake Sailajanath డీపీకు అసలు వారసుడు ఎవరు సాకే శైలజానాథ్ సెటైర్లు

Sake Sailajanath : డీపీకు అసలు వారసుడు ఎవరు? సాకే శైలజానాథ్ సెటైర్లు

Sake Sailajanath : మహానాడు వేడుక జరుగుతుండగా.. సాకే శైలజానాథ్ కీలక వ్యాఖ్యలు

సినీ నటుడు, స్వర్గీయ ఎన్టీఆర్ మనవడు అయిన Jr. NTR తెలుగుదేశం పార్టీపై తన అనుబంధాన్ని కొన్నిసార్లు బయటపెట్టినా, రాజకీయంగా పూర్తిగా పార్టీకి దూరంగా ఉన్నారు. కానీ ఆయన పేరును తరచూ వారసత్వం చర్చలో ప్రస్తావించటం అనుమానాలను పెంచుతోంది. మరోవైపు ఎన్టీఆర్ కుమార్తె, ప్రస్తుతం బీజేపీలో ఉన్న పురంధేశ్వరి పై చర్చలు కూడా తారాస్థాయికి చేరుతున్నాయి. పార్టీలో ఆమెకున్న రాజకీయ భవిష్యత్తు ఏమిటన్న ప్రశ్నలు టీడీపీ భవిష్యత్తు నాయకత్వంపై అనిశ్చితిని పెంచుతున్నాయి.

ఈ క్రమంలో టీడీపీకి అధ్యక్ష పదవి చేపట్టిన చంద్రబాబు పట్ల ఎన్‌టీఆర్ అభిమానులు, పాత వర్గాలు ప్రశ్నలు సంధించడం మొదలైంది. “ఎన్టీఆర్‌ను సీఎం పదవి నుండి తొలగించిన వారే ఇప్పుడు ఎన్టీఆర్ పెట్టిన పార్టీకి నాయకులు కావడం టీడీపీ నమ్మిన వారికి బాధ కలగడం లేదా?” అంటూ శైలజానాథ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా సెన్సేషన్ అయిపోయాయి. ఈ వ్యాఖ్యలతో టీడీపీలోని అంతర్గత పోరు, వారసత్వ సంక్లిష్టత మళ్లీ వెలుగులోకి వచ్చింది. ఎన్టీఆర్ ఆశయాలను నమ్మినవారు ఎవరు? పార్టీ భవిష్యత్తు ఎవరి చేతుల్లో ఉండాలి? అనే ప్రశ్నలు సమాధానాల కోసం ఎదురు చూస్తున్నాయి.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది