nimmagadda Ramesh : బ్రేకింగ్ : నిమ్మగడ్డ అతిపెద్ద బ్రహ్మాస్త్రం – ఏపీ కి కొత్త గవర్నర్ ?
nimmagadda Ramesh : ఏపీలో రాజకీయాలు అతి వేగంగా మారుతున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ కోసం నిమ్మగడ్డ పట్టిన పంతం నెరవేరబోతుంది. అధికార పార్టీకి వ్యతిరేకంగా ఆయన ఖచ్చితంగా ఎన్నికలు నిర్వహించాలని భావించాడు. అనుకున్నట్లుగానే స్థానిక సంస్థల ఎన్నికలను నిమ్మగడ్డ రమేష్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాడు. దానికి ప్రభుత్వం ఇష్టం లేకుండానే ఒప్పుకోవాల్సి వచ్చింది. ఇక నిమ్మగడ్డ రమేష్ చేస్తున్న పనులు కొన్ని ప్రభుత్వంకు మరింతగా కోపం తెప్పిస్తున్నాయి. రాష్ట్ర ఎన్నికల సంఘం ఇప్పటికే పలువురు అధికారులను విధుల నుండి తొలగించడం జరిగింది. వైఎస్ జగన్ ప్రభుత్వంకు మద్దతుగా నిలిచే వారిని దూరం పెట్టే ప్రయత్నం చేసిన నిమ్మగడ్డ రమేష్ చివరకు ఏపీ గవర్నర్ ను కూడా తప్పించే ప్రయత్నాలు చేస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.
వైఎస్ జగన్‌కు అనుకూలంగా గవర్నర్..
నిమ్మగడ్డ రమేష్ కుమార్ తనకు ఎన్నికల నిర్వహణలో అడ్డు వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా దూరం పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగా ఎన్నికల నిర్వహణ విషయంలో పలు సార్లు గవర్నర్ కు నిమ్మగడ్డ రమేష్ పిర్యాదు చేయడం జరిగింది. అయినా కూడా ఆయన పట్టించుకోలేదు. గవర్నర్ ఇంతకు ముందు కూడా విపక్షాలు అపాయింట్ మెంట్ కోరగా అంగీకరించలేదు. బిజీ ఉండటం వల్ల ఇతర పార్టీ నాయకులతో మాట్లాడేందుకు కూడా సమయం కేటాయించలేను అంటూ గవర్నర్ వారి అపాయింట్ మెంట్ ను క్యాన్సినల్ చేసిన సందర్బాలు ఉన్నాయి. ఇలా వైఎస్ జగన్ కు అనుకూలంగా గవర్నర్ వ్యవహరిస్తున్నారు అంటూ విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
అదే జరిగితే వైఎస్ జగన్ కు షాక్..
నిమ్మగడ్డ రమేష్ కేంద్రంకు గవర్నర్ పై ఫిర్యాదు చేస్తూ లేఖ రాసే విషయమై సిద్దం అవుతున్నాడు. ఇప్పటికే గవర్నర్ కు కేంద్ర ఎన్నికల సంఘంకు ఫిర్యాదు చేయడం జరిగిందట. రాత పూర్వకంగా ఫిర్యాదు ఇవ్వాలంటూ సూచించారు. ఇప్పుడు అదే జరుగబోతుంది. ఒక వేళ కేంద్రం కనుక గవర్నర్ ను తప్పించినట్లయితే ఖచ్చితంగా పరిణామాలు సీరియస్ గా ఉంటాయంటున్నారు. ఏపీ లో కొత్త గవర్నర్ రావడం వల్ల జగన్ కు మరింతగా ఇబ్బందులు తప్పవనే గుసగుసలు వినిపిస్తున్నాయి. నిమ్మగడ్డ రమేష్ ఇప్పటికే సీఎం జగన్ కు కొరకరాని కొయ్య మాదిరిగా తయారు అయ్యి ఇబ్బంది పెడుతున్నాడు. ఇప్పుడు గర్నర్ ను కూడా తప్పించేలా ఆయన చేస్తే నిమ్మగడ్డ రమేష్ కుమార్ మరో సారి విజయాన్ని దక్కించుకున్న వారు అవుతారు అంటూ రాజకీయ వర్గాల వారు అంటున్నారు.