Ys Jagan : “వాలంటీర్లకు వందనం” కార్యక్రమంలో మహిళా వాలంటీర్ ఎమోషనల్ స్పీచ్ జగన్ ఫిదా వీడియో వైరల్..!!

Authored By Breaking News | The Telugu News | Published on: May 19, 2023, 9:00 pm

Ys Jagan : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విజయవాడలో “వాలంటీర్లకు వందనం” అనే కార్యక్రమాన్ని ఏపీ సీఎం జగన్ ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా అద్భుతమైన సేవలు అందించిన వాలంటీర్లను గుర్తించి వారికి పలు పథకాలు… నగదు బహుమతులు అందజేయడం జరిగింది. దీనిలో భాగంగా కార్యక్రమంలో ఓ మహిళా వాలంటీర్ స్పీచ్ కార్యక్రమం మొత్తానికి చాలా హైలెట్ అయింది. ఆ మహిళా వాలంటీర్ మాట్లాడుతూ… ఇవాళ ఎన్టీఆర్ వ్యవస్థ ప్రారంభించి నాలుగు సంవత్సరాలు గడుస్తున్న క్రమంలో…

తనకు కేటాయించిన కుటుంబాలకు నవరత్నాల ద్వారా 60కి పైగా పథకాలు అందించినట్లు స్పష్టం చేశారు. కేవలం మీ స్ఫూర్తితోనే అది సాధ్యమైనట్లు తెలియజేయడం జరిగింది. వైయస్సార్ పెన్షన్ కానుక ద్వారా వృద్ధులకు చేసిన కార్యక్రమం తన జీవితంలో మర్చిపోలేనిదని స్పష్టం చేసింది. రెండోదిగా తన క్లస్టర్ లో పేదలందరికీ ఇల్లు పథకంలో భాగంగా 18 కుటుంబాలకు లబ్ధి చేకూరిందని లేడీ వాలంటీర్ స్పష్టం చేయడం జరిగింది.

see-how-ys-jagan-reacts-over-lady-volunteer

see-how-ys-jagan-reacts-over-lady-volunteer

మైనార్టీ మహిళలకు రేషన్ కార్డు వెంటనే మంజూరు చేయటం వల్ల ఆమెకు అర్హత లభించిన పలు ప్రభుత్వ పథకాల ద్వారా ఆమె ఆనందం వ్యక్తం చేసింది. ఆ సమయంలో వాళ్లు నా చెయ్యి పట్టుకుని… కన్నీరు పెట్టుకొని.. ఎంతో సంతోషం వ్యక్తం చేశారు వాలంటీర్ గా చేసిన సేవలు.. ప్రజలు ఇచ్చిన దీవెనలు సీఎం జగన్ కే చెందుతాయని మహిళా వాలంటీర్ చాలా భావోద్వేగాకరంగా స్పీచ్ ఇవ్వటం జరిగింది.

Breaking News

No bio available for this author.

Tags :
Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp