Ys jagan : జగనన్న పై రాయి దాడి వెనుక చంద్రబాబు హస్తం..!

Authored By Ramu Tandu Ramalingaiah | The Telugu News | Updated on : 14 April 2024, 6:00 pm

Ys jagan : ఇటీవల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పై జరిగిన రాయి దాడి ఆంధ్ర రాజకీయాలలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అయితే ఇటీవల ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి విజయవాడలోని సెంట్రల్ నియోజకవర్గంలోని సింగ్ నగర్ లో ఎన్నికల రోడ్ షో నిర్వహిస్తుండగా గుర్తు తెలియని వ్యక్తి రాయి దాడి చేశారు. జగన్ వాహనం చుట్టూ ఉన్న జనంలో నుండి ఓ వ్యక్తి ముఖ్యమంత్రి ని గురి చూసి రాయితో కొట్టాడు. దీంతో సీఎం వైయస్ జగన్ ఎడమ కంటి పై భాగంలో గాయం కాగా పక్కనే ఉన్న వైసీపీ సెంట్రల్ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్ కుడా స్వల్పంగా గాయపడినట్లు తెలుస్తోంది. అయితే ఈ దాడికి ఉపయోగించిన వస్తువు క్యాట్ బాల్ అయి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. ఇక ఈ రోడ్ షో లో ముఖ్యమంత్రి కోసం భద్రత కట్టుదిద్ధంగా ఉన్నప్పటికీ రాయి దాడి జరగడంపై పలు రకాల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అంతేకాక అదే సమయంలో ఆ ప్రాంతంలో విద్యుత్ కూడా లేకుండా పోవడం మరిన్ని అనుమానాలకు దారితీస్తుంది. అయితే ఈ ప్రాంతం గుండా ముఖ్యమంత్రి పర్యటన అనేది ఎప్పుడో నిర్ణయించబడింది . అలాంటప్పుడు ఇక్కడ పవర్ కట్ ఎలా జరిగిందనేది ప్రశ్నగా మారింది.

Ys jagan ప్రతిపక్షాల పనే…

ఈ నేపథ్యంలోనే విజయవాడలో జరిగిన అంశంపై వైసీపీ శ్రేణులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ పై జరిగిన దాడిని ప్రజాస్వామ్య వాదులు అందరూ కూడా ఖండించాల్సిందిగా వారు తెలియజేస్తున్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి ముఖ్యమంత్రిని ఎన్నికల్లో ఎదుర్కోవటం చేతకాక దాడులు చేయించేటువంటి పరిస్థితికి ఈనాటి ప్రతిపక్ష పార్టీలు దిగజారాయని తెలియజేస్తున్నారు.

Ys jagan : జగనన్న పై రాయి దాడి వెనుక చంద్రబాబు హస్తం..!

Ys jagan : జగనన్న పై రాయి దాడి వెనుక చంద్రబాబు హస్తం..!

ముఖ్యమంత్రి గారు పర్యటనకు వెళ్తున్నారు అంటే కట్టుదిట్టమైన భద్రత ఉంటుందని రోడ్లపై ఉన్న షాపులను కూడా మూసేస్తున్నారు అంటూ మొన్నటి వరకు ఆరోపించిన ప్రతిపక్ష పార్టీలు ఈరోజు జగన్ పై జరిగిన దాడిని ఎందుకు ఖండించడం లేదంటూ పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కచ్చితంగా ఇది ప్రతిపక్ష పార్టీల పన్నాగమే అయి ఉంటుందని , ఎట్టి పరిస్థితుల్లో వారిని వదిలిపెట్టేది లేదంటూ సవాల్ చేస్తున్నారు. దీంతో ప్రస్తుతం ముఖ్యమంత్రి జగన్ పై రాయి దాడి ఘటన ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను మరింత వేడెక్కిస్తోంది. మరి దీనిపై ప్రతిపక్ష పార్టీలు ఏ విధంగా స్పందిస్తాయో వేచి చూడాలి.

Advertisement

Ramu Tandu Ramalingaiah

Author Bio Info : Ramu Tandu Ramalingaiah is experienced in Media field. He worked in various Telugu media houses for about 15+ years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Editor of thetelugunews.com | Contact Details : ramu@thetelugunews.com

Tags :
Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి