Perni Nani – Rajini : పేర్ని నాని , ఇల్లు, రజిని ఆఫీసు పై రాళ్ల దాడి..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Perni Nani – Rajini : పేర్ని నాని , ఇల్లు, రజిని ఆఫీసు పై రాళ్ల దాడి..!

 Authored By ramu | The Telugu News | Updated on :5 June 2024,12:30 pm

Perni Nani – Rajini : ఎన్నికల ఫలితాల అనంతరం ఏపీలో ఘర్షణ వాతావరణం నెలకొంది. గెలిచిన, ఓడిన పార్టీ నాయకుల మధ్య గొడవలు తలెత్తుతున్నాయి. రాష్ట్రంలో అక్కడక్కడా దాడులతో ఉద్రిక్తత పరిస్థితులు చోటుచేసుకున్నాయి.

Perni Nani – Rajini విడదల రజిని కార్యాలయంపై..

ఏపీలో కూటమి భారీ విజయం సాధించడంతో గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో టీడీపీ, జనసేన శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి. బృందావన్‌ గార్డెన్‌, చంద్రమౌళి నగర్‌, విద్యానగర్‌ ప్రాంతాల్లో ర్యాలీ చేపట్టిన టీడీపీ, జనసేన కార్యకర్తలు చంద్రమౌళి నగర్‌ వద్దకు రాగానే అక్కడ విడదల రజిని కార్యాలయంపై రాళ్లు రువ్వారు. దీంతో కార్యాలయం ఉన్న మౌర్య ఫంక్షన్‌ హాల్‌ భవనం అద్దాలు పగిలాయి. పోలీసులు వారిని చెల్లా చెదురు చేయడానికి తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది.

వందలాది మంది దాదాపు రెండు, మూడు గంటలపాటు అక్కడే మోహరించడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠి స్వయంగా రంగంలోకి దిగి వారిని అక్కడి నుంచి బలవంతంగా పంపించి, కార్యాలయానికి ఉన్న అన్ని దారుల్లో బారికేడ్లు, ముళ్లకంచెలు ఏర్పాటు చేశారు. సీఆర్‌పీఎఫ్‌ బలగాలతో భద్రత ఏర్పాటు చేశారు. కాగా, వైఎస్సార్ సీపీ నాయకుల ఇళ్లపై, కార్యాలయాలపై జరుగుతున్న దాడులను ఆ పార్టీ శ్రేణులు ఖండించారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటివి సరికాదని అన్నారు. గెలిస్తే సంబురాలు చేసుకోవాలి కానీ ప్రతిపక్షాల పైన దాడులకు పాల్పడడం ఏంటని మండిపడ్డారు.

Perni Nani Rajini పేర్ని నాని ఇల్లు రజిని ఆఫీసు పై రాళ్ల దాడి

Perni Nani – Rajini : పేర్ని నాని , ఇల్లు, రజిని ఆఫీసు పై రాళ్ల దాడి..!

Perni Nani – Rajini పేర్ని నాని ఇంటిపై రాళ్లు ..

కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని మాజీ మంత్రి పేర్ని నాని ఇంటి వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. రామానాయుడు సెంటర్‌ వద్ద ఉన్న పేర్ని నాని ఇంటిపై కొందరు టీడీపీ, జనసేన కార్యకర్తలు రాళ్లు విసిరారు. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే నాని ఇంటి వద్దకు చేరుకుని పోలీస్‌ బందోబస్తు ఏర్పాటు చేశారు.

ramu

Tandu Ramalingaiah ( Ramu ) is experienced in Media field. He worked in various Telugu media houses for about 15 years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Chief Editor of thetelugunews.com website. Contact Details : thetelugunews1@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి