AP Politics : ఏపీలో రాళ్ల రాజకీయాలు.. ప్రజాస్వామ్యంలో ఎందుకీ దాడులు..!

Authored By Ramu Tandu Ramalingaiah | The Telugu News | Published on: April 15, 2024, 3:57 pm
  •  AP Politics : ఏపీలో రాళ్ల రాజకీయాలు.. ప్రజాస్వామ్యంలో ఎందుకీ దాడులు..!

AP Politics : మిగతా రాష్ట్రాల్లో రాజకీయాలు ఎలా ఉన్నాయో తెలియదు గానీ.. ఏపీలో మాత్రం దారుణంగా ఉన్నాయి. మొన్నటి వరకు మాటల వరకే పరిమితం అయిన రాజకీయాలు కాస్తా ఇప్పుడు దాడుల వరకు వచ్చాయి. మొన్న విజయవాడలో రాత్రి బస్సు యాత్ర చేస్తున్న సందర్భంలో జగన్ మీద అగంతకులు రాళ్లతో దాడి చేశారు. ఆ ఘటనలో జగన్ ఎడమ కనుబొమ్మ మీద గాయం అయింది. అయితే ఇదంతా వైసీపీ స్క్రిప్టు ప్రకారమే జరిగిందని టీడీపీ, జనసేన ఆరోపించాయి. ప్రజాస్వామ్యంలో ఇలాంటి దాడులను అందరూ ఖండించాల్సిందే.అందుకే ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఈ దాడిని ఖండించారు. కానీ చంద్రబాబు, పవన్ మాత్రం వైసీపీ ఆడుతున్న డ్రామా అని అంటున్నాయి. కానీ జగన్ కు వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక ప్రతిపక్షమే దాడి చేయించిందని వైసీపీ ఆరోపిస్తోంది. ఈ క్రమంలోనే ఒక్క రోజు తేడాలో నిన్న ఆదివారం నాడు అటు పవన్ కల్యాణ్‌, ఇటు చంద్రబాబు మీద కూడా రాళ్లు విసిరారని వార్తలు వచ్చాయి.

AP Politics : శత్రువులుగా చూస్తూ..

కానీ వారికి ఎలాంటి గాయాలు కాలేదు. మరి ఇలా అగ్ర నేతలపై రాళ్ల దాడులు ఎందుకు జరుగుతున్నాయనే అనుమానాలు అందరికీ వస్తున్నాయి. ఎందుకంటే ఏపీలో ఇప్పుడు ఎవరూ కూడా ప్రత్యర్థులను ప్రతిపక్ష నేతలుగా చూడట్లేదు. శత్రువులుగానే చూస్తున్నారు.ఒకరిపై ఒకరు చేసుకునే విమర్శలు హద్దులు మీరిపోతున్నాయి. దారుణాతి దారుణంగా ఒకరిపై ఒకరు వ్యాఖ్యలు చేసుకుంటున్నారు. మేం అధికారంలోకి రాగానే మిమ్మల్ని గుడ్డలూడదీసి కొడుతాం అని ఒకరు అంటారు. మేం గెలిస్తే మీరు జైలుకే అని ఇంకొకరు అంటారు. ఇంట్లోకొచ్చి కొడుతాం అని ఒకరంటారు. ఇలా తమ స్థాయిని మర్చి మపోయి మరీ హింసాత్మక మాటలు మాట్లాడుతున్నారు. దాంతో వారి పార్టీలో ఉన్న కేడర్ కూడా మైండ్ లోకి అదే ఎక్కించుకుంటున్నారు. తమ నాయకులు మాట్లాడిన మాటలకు వారు రెచ్చిపోయి దాడులకు తెగ బడుతున్నారు.

AP Politics : ఏపీలో రాళ్ల రాజకీయాలు.. ప్రజాస్వామ్యంలో ఎందుకీ దాడులు..!

AP Politics : ఏపీలో రాళ్ల రాజకీయాలు.. ప్రజాస్వామ్యంలో ఎందుకీ దాడులు..!

అందుకే ఇప్పుడు ఈ రాళ్ల దాడులు అని చెప్పుకోవాలి. అయితే ఇలాంటి సమయాలనే సంఘ విద్రోహ శక్తులు అలవుగు మార్చుకునే ప్రమాదం కూడా ఉంటుంది. వాళ్లు వాటిని మరింత హింసాత్మకంగా మార్చే అవకాశాలు ఉంటాయి. కానీ ఈ విషయాలను పార్టీల అధ్యక్షులు పట్టించుకోవట్లేదు. ఎంత సేపు వారి స్వార్థం, వారి అధికారం కోసమే మాట్లాడుతున్నారు. కనీసం ప్రజలకు తాము అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పే రోజుల నుంచి.. మేం గెలిస్తే మిమ్మల్ని బొంద పెడుతాం, జైలుకు పంపుతాం అని చెప్పుకునే స్థాయికి ఏపీ రాజకీయాలు దిగజారిపోయాయి. కాబట్టి ఇప్పటికైనా అగ్ర నేతలు ఆచితూచి మాట్లాడాలని, తమ కేడర్ ను కంట్రోల్ లో ఉంచుకోవాలని ప్రజాస్వామ్య వాదులు చెబుతున్నారు.

Ramu Tandu Ramalingaiah

Author Bio Info : Ramu Tandu Ramalingaiah is experienced in Media field. He worked in various Telugu media houses for about 15+ years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Editor of thetelugunews.com | Contact Details : ramu@thetelugunews.com

  1. "Grand Electronics Sale : టీవీ, ఫ్రిజ్, వాషింగ్ మెషీన్ల కొనాలనుకునేవారికి గుడ్‌న్యూస్.. రూ.20 వేలపైగా భారీ డిస్కౌంట్లు..!"

  2. "Ysrcp Plan : పోరులో వైసీపీ అసలైన బలం అదేనా? గ్రౌండ్ లెవెల్ కేడర్‌పై జగన్ భారీ నమ్మకం..!"

  3. "Messi vs Ronaldo : మెస్సీయా.. రొనాల్డోనా? ఫుట్‌బాల్ ఆల్‌టైమ్ ‘గోట్’ ఎవరో తేల్చేసిన ఆ లెక్కలు..!"

  4. "Jailer 2 : తలైవా రజినీకాంత్.. ‘జైలర్ 2’ ప్రమోషన్లతో బాక్సాఫీస్ వద్ద రచ్చ లేపనున్నారా..?"

  5. "Ys Jagan : స్థానిక ఎన్నికల్లో గెలుపే టార్గెట్.. అభ్యర్థుల ఎంపికపై రీజనల్ ఇన్‌ఛార్జ్‌లతో వైఎస్ జగన్ మైండ్ గేమ్!"

  6. "Pawan kalyan : అరెస్ట్‌పై పవన్ కల్యాణ్ కామెంట్స్.. తమ్ముళ్ల ఆగ్రహంతో కూటమిలో సరికొత్త దుమారం?"

  7. "Nandamuri Tejaswini : మేయర్ రేసులో నందమూరి బాలకృష్ణ కుమార్తె? తెరపైకి తేజస్విని పేరుతో పొలిటికల్ హీట్!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp