నిమ్మగడ్డ ర‌మేష్ డాన్స్ చేసే తీర్పు ఇచ్చిన సుప్రీం కోర్టు.. ఇప్పుడు వైఎస్ జగన్‌ దారి ఏంటీ?

ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలకు సుప్రీం కోర్టు గ్రీన్ సిగ్నల్‌ ఇచ్చింది. ప్రస్తుతం కరోనా వ్యాక్సినేషన్‌ జరుగుతున్న సమయంలో ఎన్నికల విధుల్లో పాల్గొనలేమని ఉద్యోగ సంఘాలు మరియు ప్రభుత్వం కూడా సుప్రీం కోర్టులో పిటీషన్‌ దాఖలు చేయడం జరిగింది.

ఈ విషయమై సుప్రీం కోర్టులో వాదనలు నడిచాయి. నేడు ఆ విషయమై తుది తీర్పు వచ్చింది. ఉద్యోగ సంఘాల అభ్యంతరంను సుప్రీం కోర్టు తప్పుబట్టింది. ఇలా ఎన్నికలను బహిష్కరించాలనుకోవడం ఏమాత్రం సబబు కాదు. అసలు ఎన్నికల సంఘం నిర్ణయంలో తాము జోక్యం చేసుకోము అంటూ సుప్రీం కోర్టు క్లారిటీ ఇచ్చింది. ఎన్నికల సంఘం ప్రభుత్వం మద్య ప్రభుత్వ ఉద్యోగులు జోక్యం చేసుకోవడం కరెక్ట్‌ కాదంటూ సుప్రీం కోర్టు వ్యాఖ్యలు చేసి ఎన్నికలు జరిపేందుకు ఈసీకి పూర్తి అధికారాలు ఇచ్చింది. దాంతో ఇప్పుడు ఏపీలో మరింత ఉత్కంఠ నెలకొంది.

supreme court green signal to ap local body elections

నిమ్మగడ్డ ర‌మేష్ కుమార్‌దే పైచేయి..

నిమ్మగడ్డ ర‌మేష్ కుమార్‌ మొదటి నుండి వాదిస్తున్నట్లుగా సుప్రీం కోర్టు కూడా ప్రభుత్వం ఎన్నికలకు సహకరించాల్సిందే. ఎన్నికల సంఘం నిర్ణయాన్ని ఎట్టి పరిస్థితుల్లో తప్పుబట్టలేమని క్లారిటీ ఇచ్చారు. ఎన్నికల సంఘం ఈ విషయమై ఫుల్‌ హ్యాపీగా ఉంది. ఎన్నికల సంఘం కమీషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌ ఈ విషయమై పై చేయి సాధించడంతో వైకాపా మరింత అగ్గి మీద గుగ్గిలం మాదిరిగా అవుతుంది. సుప్రీం తీర్పు రావడంతో ఉద్యోగ సంఘాల నాయకులు మరియు ఉద్యోగులు అంతా కూడా ఖచ్చితంగా ఇప్పుడు ఎన్నికలకు ఈసీకి సహకరించాల్సిందే. ఇతర రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతుండగా ఏపీలో ఎందుకు ఎన్నికలను వద్దంటున్నారు. మీకు మరేదైనా రాజకీయ ఉద్దేశ్యం ఉందా అంటూ కోర్టు ప్రశ్నించింది.

వైఎస్‌ జగన్‌ కిం కర్తవ్యం..

సీఎం వైఎస్‌ జగన్‌ ఇప్పుడు ఏం చేస్తారు అనేది ఆసక్తిగా మారింది. ప్రతి చోట కూడా కూడా ప్రభుత్వంకు వ్యతిరేకంగానే తీర్పు వచ్చింది. దాంతో ఎన్నికలకు వెళ్లక తప్పనిపరిస్థితి. నిమ్మగడ్డ రమేష్‌ పై పై చేయి సాధించేందుకు ఉద్యోగ సంఘాలను అడ్డం పెట్టుకున్న వైఎస్‌ జగన్‌ సుప్రీం తీర్పుతో వారు కూడా ఈసీ వైపు తిరగాల్సిన పరిస్థితి వచ్చింది. ఇలాంటి నేపథ్యంలో వైఎస్‌ జగన్ ఏం నిర్ణయం తీసుకుంటాడు. సుప్రీం కోర్టు నిర్ణయాన్నే కాదని ముందుకు వెళ్లే సత్తా సీఎం వైఎస్ జగన్ కు ఉందా అంటూ జనాలు చెవులు కొరుక్కుంటున్నారు.

Recent Posts

Vivo | వివో నుంచి కొత్త బ్లాక్‌బస్టర్ ..Vivo T4R 5G స్మార్ట్‌ఫోన్ ₹17,499కే!

Vivo | స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో గట్టి పోటీ నడుస్తున్న ఈ రోజుల్లో ప్రముఖ మొబైల్ బ్రాండ్ వివో (Vivo) తన…

7 hours ago

Jupitar Price | జీఎస్టీ రేట్లు తగ్గడంతో టీవీఎస్ బైకులు, స్కూటీల ధరలు భారీగా తగ్గింపు .. కొత్త ధరల వివరాలు ఇదే!

Jupitar Price | దేశవ్యాప్తంగా జీఎస్టీ రేట్లలో మార్పులు సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి వచ్చిన నేపథ్యంలో, ప్రముఖ ద్విచక్ర…

8 hours ago

Asia Cup 2025 | ఆసియా క‌ప్‌లో భార‌త్ క‌ప్ కొట్టినా కూడా తీసుకోదా.. సూర్యకి ఏమైంది?

Asia Cup 2025 | పాకిస్తాన్‌తో జరగబోయే ఫైనల్‌లో గెలిచి ఆసియా కప్ 2025 ట్రోఫీని కైవసం చేసుకోవాలని సూర్య…

10 hours ago

Aghori | వర్షిణి – అఘోరీ వివాదం కొత్త మలుపు.. మోసం చేసింది నువ్వురా..మోసపోయింది నేనురా అంటూ సంచలన వ్యాఖ్యలు

Aghori | రాష్ట్రంలో సంచలనం సృష్టించిన అఘోరీ – వర్షిణి వ్యవహారం మళ్లీ వార్తల్లోకెక్కింది. అఘోరీని పోలీసులు అరెస్ట్ చేసి…

12 hours ago

Raja Saab | ఎట్ట‌కేల‌కి రాజా సాబ్ ట్రైల‌ర్‌కి ముహూర్తం ఫిక్స్ చేశారు.. ఇక ఫ్యాన్స్‌కి పండ‌గే..!

Raja Saab | రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఈగర్ వెయిట్ చేస్తున్న చిత్రాల్లో 'రాజాసాబ్' ఒకటి. చాలా…

14 hours ago

Telangana | తెలంగాణలో దంచికొడుతున్న వ‌ర్షాలు.. 11 జిల్లాలకు ఆరెంజ్ వార్నింగ్

Telangana |  తెలంగాణ రాష్ట్రంలో వ‌ర్షాలు దంచికొడుతున్నాయి. రాష్ట్రంలో ఇప్పటికే పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండగా, వచ్చే రెండు…

16 hours ago

Makhana | మఖానా ఆరోగ్యాన్ని కాపాడే సూపర్ ఫుడ్ .. ఇది తింటే ఆ స‌మ‌స్య‌లన్నీ మ‌టాష్‌

Makhana | బరువు తగ్గాలనుకుంటున్నారా? డయాబెటిస్‌ను నియంత్రించాలనుకుంటున్నారా? ఎముకల బలహీనతతో బాధపడుతున్నారా? అయితే మీరు మఖానాను తప్పక మీ రోజువారీ…

17 hours ago

Salt | పింక్‌ సాల్ట్‌ vs సాధారణ ఉప్పు .. మీ ఆరోగ్యానికి ఏది ఉత్తమం?

Salt | ఉప్పు లేకుండా మన రోజువారీ ఆహారం అసంపూర్ణమే. వంటల్లో రుచి కోసం, ఆహారంలో ఫ్లేవర్ కోసం, చివరికి…

18 hours ago