బాబుకు మ‌రో షాక్‌.. విశాఖ టీడీపీలో మరో భారీ కుదుపు..!

0
Advertisement

TDP : ఏపీలో తెలుగు దేశం పార్టీ పరిస్థితి రోజు రోజుకు మరింత ఇబ్బందికరంగా మారుతున్నట్లుగా అనిపిస్తుంది. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడుకు షాక్ ల మీద షాక్‌ లు తగులుతున్నాయి. ఇటీవల మున్సిపల్ మరియు కార్పోరేషన్‌ ఎన్నికల్లో ప్రజలు చంద్రబాబు నాయుడు ఇచ్చిన షాక్‌ మామూలుది కాదు. 99 శాతం మున్సిపాలిటీలు మరియు నూరు శాతం కార్పోరేషన్‌ లు వైకాపా అధినేత వైఎస్‌ జగన్ మోహన్‌ రెడ్డి దక్కించుకున్నాడు. వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఎన్నికల ప్రచారంకు కూడా వెళ్లకుండానే ఆయన పార్టీ అభ్యర్థులను గెలిపించుకున్నారు. అది ఏరకంగా అయినా కూడా పార్టీ గెలిచింది అనేది ఇక్కడ వాస్తవం. ఏపీలో తెలుగు దేశం పార్టీ ఉన్న పరిస్థితి ఇప్పటికే చంద్రబాబు నాయుడుకు అర్థం అయ్యింది. అయినా కూడా ఆయన చూస్తూ ఉండి పోయారు. ఇలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడుకు మరో గట్టి షాక్ తగిలినట్లయ్యింది.

TDP : వైఎస్‌ జగన్‌ పై నమ్మకంతో…

వైజాగ్‌ లో టీడీపీ కాస్త మెరుగైన ఫలితాలను దక్కించుకుంది మెజార్టీ వైకాపా కు వచ్చి మేయర్‌ అయినా కూడా బలమైన ప్రతిపక్షంగా మాత్రం నిలిచిందని భావించొచ్చు. మొత్తంగా టీడీపీకి జీవీఎంసీ ఎన్నికల్లో 30 సీట్లు దక్కించుకుంది. ఇది సాధారణమైన నెంబర్‌ ఏమీ కాదు. ఈ మొత్తం మంది టీడీపీలోనే ఉంటే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఖచ్చితంగా మంచి ప్రభావం చూపించవచ్చు. చంద్రబాబు నాయుడు ఆ ఆశతో ఉండగా వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అనూహ్యంగా అక్కడ తన తెలివిని చూపించారంటూ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. గాజు వాక నియోజక వర్గంలో తెలుగు దేశం పార్టీ నుండి గెలుపొందిన మొత్తం ఏడుగురు కార్పోరేటర్లు కూడా చంద్రబాబు నాయుడుకు గుడ్‌ బై చెప్పి వైఎస్‌ జగన్ మోహన్‌ రెడ్డిపై నమ్మకంతో వైకాపాలో జాయిన్‌ అయ్యారు.

Chandrababu
Chandrababu

జంపింగ్ జిలానీలకు పార్టీ నోటీసులు..

తెలుగు దేశం పార్టీ ఈ సమయంలో పార్టీ నాయకులను మరియు కార్యకర్తలను నిలుపుకునేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తూనే ఉంది. కాని చంద్రబాబు నాయుడుకు దెబ్బ మీద దెబ్బ పడుతూనే ఉంది. ఈ పరిణామాలు అన్ని చూస్తుంటే రాబోయే అసెంబ్లీ మరియు పార్లమెంట్‌ ఎన్నికల వరకు పార్టీ మరింతగా క్షీణించి పోయే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. చంద్రబాబు నాయుడు తన రాజకీయ పరిజ్ఞానం మరియు అనుభవంతో ఏదైనా చేస్తాడని ఆ పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు ఇంకా ఎదురు చూస్తున్నారు. విశాఖ సంఘటన నేపథ్యంలో జంపింగ్ జిలానీలకు పార్టీ నోటీసులు ఇచ్చింది. వారు పార్టీ వీడటం ఖాయం అయిన నేపథ్యంలో వారికి నోటీసులు ఇచ్చినా మరేం ఇచ్చినా కూడా ఆగేది ఏమీ ఉండదు.

Advertisement