TDP Janasena : జనసేన, టీడీపీ మధ్య పొత్తు ఉంటుందా లేదా అనేది ఆ రెండు పార్టీ నాయకులు, కార్యకర్తలు మధ్య జరుగుతున్న చర్చ. సీట్ల విషయానికి వచ్చేసరికి చంద్రబాబు నాయుడు అసంతృప్తి చూపిస్తున్నారని పవన్ గ్రహించినట్లు జనసేన వర్గాలు చెబుతున్నాయి. మొదటి నుంచి గౌరవప్రదమైన సీట్లు ఇస్తేనే పొత్తు ఉంటుందని తమ నాయకులు చెబుతున్నారని విషయాన్ని జనసేన శ్రేణులు చెబుతున్నాయి. ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో టీడీపీ, జనసేన ఒప్పందాలను పక్కనపెట్టి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ జనంలోకి వేరువేరుగా వెళ్లాలని అనుకోవడమే. ఆ రెండు పార్టీల మధ్య పొత్తు క్యాన్సిల్ అవుతుందేమో అని అనుమానాలకు తావు ఇస్తుంది. జనసేనాని పవన్ కళ్యాణ్ నిబద్ధత, స్థిరత్వం గురించి ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచిది.
వైసీపీ నేతలు ఆరోపిస్తున్నట్లుగా అగ్నిసాక్షిగా పెళ్లాడిన వారితోనే ఆయన ఎక్కువ కాలం కలిసి ఉండరు. అలాంటిది ఇతర రాజకీయ పార్టీలతో కొనసాగుతారు అనుకోవడం అవివేకమే. పవన్ కళ్యాణ్ వచ్చే నెల నుంచి జనంలోకి వెళతారని, ఒక్కో రోజు మూడు బహిరంగ సభలో పాల్గొంటారని, ఇటీవల ఆ పార్టీ కీలక నేత నాదెండ్ల మనోహర్ వెల్లడించిన సంగతి తెలిసిందే. ఇక చంద్రబాబు నాయుడు ఈనెల 27 నుంచి తిరిగి ‘ రా కదలిరా ‘ సభల్లో పాల్గొనడానికి షెడ్యూల్ రూపొందించారు. మూడు రోజులపాటు ఆయన పర్యటన ఉంటుంది. ఒక్కో రోజు రెండు సభల్లో ఆయన పాల్గొననున్నారు. 27న అన్నమయ్య జిల్లా పీలేరు, అనంతపురం జిల్లా ఉరవకొండ, 28న నెల్లూరు రూరల్, పత్తికొండ, 29న రాజమహేంద్రవరం జిల్లాలోని రాజమండ్రి రూరల్, గుంటూరు జిల్లాలోని పొన్నూరు సభల్లో చంద్రబాబు పాల్గొంటారని టీడీపీ వెల్లడించింది.
చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తో కలిసి కొన్ని సభల్లో పాల్గొంటారని, ఆ రెండు పార్టీలు ముందుగా ప్రకటించిన సంగతి తెలిసిందే. అలాగే నియోజకవర్గాల్లో టీడీపీ, జనసేన సమన్వయ సమావేశాలు జరుగుతాయని కూడా వెల్లడించారు. సమన్వయ సమేశాలు కాస్త రభస సమావేశాలుగా మారడంతో వాటిని నిర్వహించడం మానుకున్నారు. మరోవైపు సీట్లకు సంబంధించి ఓ కొలిక్కి రాకపోవడం, సయోధ్య కుదరడం లేదని, ఎవరికి వారు ఒంటరిగా వెళ్లేందుకు వ్యూహరచనలో ఉన్నారని చర్చకు తెరతీసింది. ఈ ప్రచారానికి బలం కలిగేలా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వేరువేరుగా సభల్లో పాల్గొననున్నారు.
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప 2 Pushpa 2 The Rule ప్రమోషన్స్ జోరందుకున్నాయి. సినిమాను పాన్…
Wheat Flour : ప్రస్తుతం మార్కెట్లో దొరికే ప్రతి వస్తువు కూడా కల్తీ గా మారింది. అలాగే ఎక్కడ చూసినా కూడా…
IPL 2025 Schedule : క్రికెట్ ప్రేమికులకి మంచి మజా అందించే గేమ్ ఐపీఎల్. ధనాధన్ ఆటతో ప్రేక్షకులకి మంచి…
PM YASASVi : పీఎం యంగ్ అచీవర్స్ స్కాలర్ షిప్ అవార్డ్ స్కీం అనేది భారత ప్రభుత్వం నుంచి ఒక…
Cough And Cold : సీజన్ మారుతున్న టైమ్ లో హఠాత్తుగా జలుబు చేయడం సర్వసాధారణమైన విషయం. ముఖ్యంగా చెప్పాలంటే ఈ…
Zodiac Signs : నవగ్రహాలకు రాజుగా పిలవబడే సూర్యుడి సంచారం కారణంగా కొన్ని రాశుల వారి జీవితం ప్రభావితం అవుతూ…
This website uses cookies.