TDP Janasena : పొత్తులో కత్తులు .. జనసేన, టీడీపీ పరిస్థితి అలానే ఉంది..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

TDP Janasena : పొత్తులో కత్తులు .. జనసేన, టీడీపీ పరిస్థితి అలానే ఉంది..!

TDP Janasena : వెంకి పెళ్లి సుబ్బి చావుకి వచ్చినట్లుగా టీడీపీ జనసేన తో పొత్తు వ్యవహారం ఉంది. రెండు పార్టీలకి పొత్తు వలన ఎవరికి ఎంత లాభమో తెలియదు కానీ ఇప్పుడు మాత్రం టీడీపీకి తలనొప్పులు తప్పడం లేదు. భీమవరం నియోజకవర్గంలో టీడీపీ, జనసేన సమన్వయ కమిటీకి టీడీపీ నేతలు డుమ్మా కొట్టడంతో జనసేనకులు బగ్గుమంటున్నారు. అటు టీడీపీలోను కొందరు నేతలు ఏక పక్షంగా వ్యవహరిస్తున్నారని, మిగతా నేతలు ఆగ్రహం చెందుతున్నారు. పశ్చిమగోదావరిలో జనసేన, టిడిపిలో […]

 Authored By anusha | The Telugu News | Updated on :11 December 2023,1:00 pm

ప్రధానాంశాలు:

  •  TDP Janasena : పొత్తులో కత్తులు .. జనసేన, టీడీపీ పరిస్థితి అలానే ఉంది..!

TDP Janasena : వెంకి పెళ్లి సుబ్బి చావుకి వచ్చినట్లుగా టీడీపీ జనసేన తో పొత్తు వ్యవహారం ఉంది. రెండు పార్టీలకి పొత్తు వలన ఎవరికి ఎంత లాభమో తెలియదు కానీ ఇప్పుడు మాత్రం టీడీపీకి తలనొప్పులు తప్పడం లేదు. భీమవరం నియోజకవర్గంలో టీడీపీ, జనసేన సమన్వయ కమిటీకి టీడీపీ నేతలు డుమ్మా కొట్టడంతో జనసేనకులు బగ్గుమంటున్నారు. అటు టీడీపీలోను కొందరు నేతలు ఏక పక్షంగా వ్యవహరిస్తున్నారని, మిగతా నేతలు ఆగ్రహం చెందుతున్నారు. పశ్చిమగోదావరిలో జనసేన, టిడిపిలో మధ్య పరిస్థితి కాస్త అయోమయంగానే ఉంది. గత ఎన్నికల్లో జిల్లాలో రెండు నియోజకవర్గాలకు పరిమితమైన తెలుగుదేశం పార్టీ నాలుగున్నర ఏళ్లలో జిల్లాలో బలపడింది లేదు.

రెండు మూడు నెలల్లో ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో ఈ మధ్యన టిడిపి జనసేన తో పొత్తు పెట్టుకుంది. జనసేన కు ఉన్న కొద్దిపాటి ఓటు బ్యాంకుతో కొంతైనా పరువు తగ్గించుకోవచ్చు అన్నది చంద్రబాబు ఆలోచన గా ఉంది. భీమవరంలో ఏర్పాటు చేసిన సమావేశానికి టిడిపి కి చెందిన మాజీ ఎమ్మెల్యే పులపర్తి ఆంజనేయులు హాజరు కాలేదు దీనిని జనసేన నేతలు ప్రశ్నించారు. నిజానికి 2019లో ఓటమి అనంతరం ఆయన రాజకీయంగా లేనే లేరు. అప్పుడు జనసేన అభ్యర్థిగా పోటీ చేసిన పవన్ కళ్యాణ్ పై వైయస్సార్ కాంగ్రెస్ అభ్యర్థి గ్రంధి శ్రీనివాస్ గెలిచారు. గత ఎన్నికల్లో అంజి బాబు పరాజయం పాలయ్యారు. టిడిపి జనసేన పొత్తు తర్వాత కొద్దిగా యాక్టివ్ అయ్యారు . సమన్వయ కమిటీకి మాత్రం రాలేదు.

పొత్తులో భాగంగా భీమవరం సీటును జనసేన కూ కేటాయించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. అదే జరిగితే తనకు ఒక నియోజకవర్గం లేకుండా పోతుందని, దీంతో ఆయన ఆందోళనగా ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో జనసేన ఏమాత్రం సహకరించేది లేదని ఆయన వర్గీయులు తమ ప్రైవేట్ సంభాషణలో చెప్పుకుంటున్నారు. ఒకపక్క జనసేనతో తన సీటుకు ఎసరు తప్పదనే బాధ, మరోపక్క పార్టీ అధ్యక్షురాలు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారనే కోపం జిల్లా టిడిపి నేతలను కుదురుగా ఉండనీయడం లేదు. అలాగే ఇద్దరు పార్టీల సమన్వయ మీటింగ్ కి టిడిపి నేతలకు సమాచారం ఇవ్వలేదని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇలా రెండు పార్టీల మధ్య గొడవలు జరుగుతున్నాయి.

anusha

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది