YSRCP : పైకి ఒప్పుకున్న ఒప్పుకోకపోయినా వైయస్సార్ సీపీ పార్టీకి 2024 ఎన్నికల్లో కాస్త భయంగానే ఉంది. తెలుగుదేశం, జనసేన పొత్తు పెట్టుకోవడంతో వైసీపీకి కాస్త భయంగా ఉంది అని చెప్పాలి. అయితే రీసెంట్ గా వచ్చిన కొన్ని సర్వేలలో వై.యస్.జగన్మోహన్ రెడ్డి గెలుపు ఖాయం అని అంటున్నారు. వై.యస్.జగన్మోహన్ రెడ్డిని గద్దె దింపడానికి టీడీపీ, జనసేన ఏకమయ్యాయి. ఒకవైపు నారా లోకేష్ పాదయాత్ర సక్సెస్ అయింది. మరోవైపు జనసేన వారాహి యాత్ర కూడా సక్సెస్ అయింది. దీంతో రాజకీయ సమీకరణాలు మారిపోతున్నాయి. అయితే ప్రముఖ జాతీయ మీడియా టైమ్స్ సర్వేలో ఏపీలో మరోసారి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారం సాధిస్తుందని సర్వేలో వెల్లడించింది. అంతేకాకుండా ఈ ఐదేళ్లలో వైసీపీ ఓట్ల షేర్ పెరిగిందని ఈ సర్వే చెబుతుంది.
ఏపీలో రాజకీయాలు భిన్నంగా ఉన్నాయి. వై.యస్.జగన్మోహన్ రెడ్డి పెట్టిన సంక్షేమాలు ప్రజలు ఆకట్టుకున్నాయని సర్వే చెబుతుంది. టీడీపీ, జనసేన కలిసి పోటీ చేసిన అధికారం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ దే అని సర్వే చెబుతోంది. పోల్స్ స్ట్రాటజీ అనే సర్వే సంస్థ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి 40-48% ఓటు శాతం ఉంటుందని, టీడీపీ-జనసేనకి 41 శాతం ఓటమి ఉంటుందని సర్వే చెబుతుంది. ఈ సర్వే నిజమో కాదో తెలియదు కానీ రెండు పార్టీలు కలిసిన కేవలం వైసీపీకే 48% వచ్చినప్పుడు, ఈ సర్వే నిజమైతే పరిస్థితి ఏంటనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇంకా ఈ సర్వేలో ముఖ్యమంత్రి అభ్యర్థులు ఎవరు అనే దాని పైన ఆసక్తికర సమాధానం వచ్చింది.
56% ప్రజలు వై.యస్.జగన్మోహన్ రెడ్డి మాకు సీఎం కావాలని ప్రజలు కోరుకోగా, కేవలం 34% మంది మాత్రమే చంద్రబాబుకు ఓకే చెప్పారు. పవన్ కళ్యాణ్ సీఎం కావాలని 7 శాతం మంది మాత్రమే చెప్పారు. అలాగే వై.యస్.జగన్మోహన్ రెడ్డి పాలన బాగుందా అని సర్వే చేయగా అందులో 56% బాగుంది అని చెప్పగా, 22 శాతం మంది బాగోలేదని, 9 శాతం మంది చాలా బాగుంది అని తెలిపారు. 8 శాతం మంది అస్సలు బాగోలేదని 3% శాతం మంది చెప్పలేమని సమాధానం ఇచ్చారు> అయితే 2018 కంటే వైసీపీ ఓటు షేర్ పెరుగుతుందని, పోల్స్ స్ట్ట్రాటజీ సర్వే చెబుతుంది. కేవలం సంక్షేమ పథకాల అమలతో జగన్ ప్రభుత్వం మొగ్గు చూపించినట్లుగా ఈ సర్వే వెల్లడిస్తుంది. ప్రజలు అభివృద్ధి కంటే సంక్షేమానికి పెద్ద పీట వేసినట్లు అర్థమవుతుంది. చంద్రబాబు ప్రకటించిన మెనిఫెస్టో ప్రజలు అంతగా ఆకర్షితులు అయినట్లుగా లేదని సరే తెలియజేస్తుంది.
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప 2 Pushpa 2 The Rule ప్రమోషన్స్ జోరందుకున్నాయి. సినిమాను పాన్…
Wheat Flour : ప్రస్తుతం మార్కెట్లో దొరికే ప్రతి వస్తువు కూడా కల్తీ గా మారింది. అలాగే ఎక్కడ చూసినా కూడా…
IPL 2025 Schedule : క్రికెట్ ప్రేమికులకి మంచి మజా అందించే గేమ్ ఐపీఎల్. ధనాధన్ ఆటతో ప్రేక్షకులకి మంచి…
PM YASASVi : పీఎం యంగ్ అచీవర్స్ స్కాలర్ షిప్ అవార్డ్ స్కీం అనేది భారత ప్రభుత్వం నుంచి ఒక…
This website uses cookies.