Atchannaidu : రోజాపై అచ్చెన్నాయుడు సెన్సేషనల్ కామెంట్స్ .. పక్కనే ఉన్న పవన్ కళ్యాణ్ నవ్వుకున్నాడు..!
Atchannaidu : టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర ముగింపుకు చేరిన సందర్భంగా నవశకం పేరిట భారీ బహిరంగ సభ విజయనగరం జిల్లాలో పోలిపల్లి లో జరిగింది. ఈ బహిరంగ సభలో అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. టీడీపీ, జనసేన పార్టీలు కలిసాయని, ఇక వైసీపీకి దబిడి దిబిడే అని అన్నారు. 2024 ఎన్నికల్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలుస్తారని వైసీపీ సైకోలు ఊహించలేదని తెలిపారు. కానీ మూర్ఖుడు వై.యస్.జగన్మోహన్ రెడ్డిని గద్దె దించడానికి టీడీపీ, […]
ప్రధానాంశాలు:
Atchannaidu : రోజాపై అచ్చెన్నాయుడు సెన్సేషనల్ కామెంట్స్ .. పక్కనే ఉన్న పవన్ కళ్యాణ్ నవ్వుకున్నాడు..!
Atchannaidu : టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర ముగింపుకు చేరిన సందర్భంగా నవశకం పేరిట భారీ బహిరంగ సభ విజయనగరం జిల్లాలో పోలిపల్లి లో జరిగింది. ఈ బహిరంగ సభలో అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. టీడీపీ, జనసేన పార్టీలు కలిసాయని, ఇక వైసీపీకి దబిడి దిబిడే అని అన్నారు. 2024 ఎన్నికల్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలుస్తారని వైసీపీ సైకోలు ఊహించలేదని తెలిపారు. కానీ మూర్ఖుడు వై.యస్.జగన్మోహన్ రెడ్డిని గద్దె దించడానికి టీడీపీ, జనసేన ఏకం కావాల్సిన చారిత్రాత్మక అవసరం ఏర్పడిందని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. చంద్రబాబుపై పైసా అవినీతి లేకపోయినా వై.యస్.జగన్మోహన్ రెడ్డి అవినీతి కేసు పెట్టి 53 రోజులు జైల్లో ఉంచాడు. ప్రజలకు మంచి పరిపాలన దక్కనివ్వకూడదని సైకో జగన్ అనేక డ్రామాలాడుతున్నాడు.
రాష్ట్ర ప్రజలకు సుపరిపాలన అందనివ్వకుండా చేయడం జగన్మోహన్ రెడ్డి తరం కాదు. టిడిపి, జనసేన లో బలహీనవర్గాల వారు నాయకులుగా పనిచేస్తున్నారు. వైసీపీలో బానిసలుగా పనిచేస్తున్నారు. రానున్న ఎన్నికల్లో వైసీపీకి డిపాజిట్లు కూడా రావు. వచ్చే ఎన్నికల్లో గ్రామస్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు టీడీపీ, జనసేన కార్యకర్తలు నాయకులు కలిసి పని చేయాలి. కులాలు, మతాలు, ప్రాంతాలు పార్టీ మధ్య చిచ్చు పెట్టడానికి జగన్ ప్రయత్నిస్తాడు. మనం అప్రమత్తంగా ఉండాలి. 2024లో ఏపీకి పట్టిన దరిద్రాన్ని రాష్ట్ర ప్రజలు బంగాళాఖాతంలో కలిపేయాలని కోరుతున్నా. 5 కోట్ల ఆంధ్రులంతా గుర్తుపెట్టుకోవాలి. రానున్న ఎన్నికలు టీడీపీ, జనసేనకు, వైసీపీకి మధ్య ఎన్నికలు కాదు.
రాష్ట్ర ప్రజలకు, దోపిడీదారుడికి మధ్య జరిగే యుద్ధం. ప్రజల కోసం ఒక్కటై టీడీపీ-జనసేన నాయకత్వాన్ని ఆదరించాలి, ఆశీర్వదించాలి అని అన్నారు. నారా లోకేష్ చంద్రబాబు వారసుడు కాదు. రాజకీయ పరిమితి కలిగిన నాయకుడని కుప్పం సభలోని చెప్పాను. పాదయాత్రలో నారా లోకేష్ బలమైన సైనికుడు అని ప్రూవ్ చేశాడు. జగన్మోహన్ రెడ్డి పాదయాత్రకు మేం ఏ అడ్డంకులు సృష్టించలేదు కానీ జగన్ యువగళంపై ఎన్ని అడ్డంకులు సృష్టించారో రాష్ట్రమంతా చూశారు. లోకేష్ వాటన్నింటిని అధిగమించి ప్రజల్లో చైతన్యం నింపారు . అవినీతి నాయకుల బాగోతాన్ని ప్రజలకు తెలియజేశారు. యువతకు భరోసానిచ్చారు అని అచ్చెన్నాయుడు తెలిపారు.