Janasena Party : జనసేన పార్టీపై టిడిపి మీడియా కుట్రలు…? ఇలా చేస్తే నష్టం ఎవరికి …? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Janasena Party : జనసేన పార్టీపై టిడిపి మీడియా కుట్రలు…? ఇలా చేస్తే నష్టం ఎవరికి …?

Janasena Party : ఆంధ్ర ప్రదేశ్ లో ఉన్న పార్టీలలో అధికార పక్షానికి ప్రతిపక్షానికి ఎవరికి వాళ్లకి కావాల్సిన మీడియా సంస్థలు ఉన్నాయి. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి సాక్షి పత్రిక అలాగే చంద్రబాబు నాయుడుకి ఆంధ్రజ్యోతి , టీవీ 5 ఈ రకమైన చానల్స్ ఉన్నాయి. ఇక టీవీ9 ఎన్టీవీ విషయానికొస్తే ఎవరు అధికారంలో ఉంటే వారికి సపోర్ట్ చేస్తూ ఉంటారు. ఇక ఈ మీడియా సంస్థలు ఎవరికి వారు తోచిన విధంగా వారి పార్టీ […]

 Authored By aruna | The Telugu News | Updated on :11 February 2024,11:00 am

ప్రధానాంశాలు:

  •  Janasena Party : జనసేన పార్టీపై టిడిపి మీడియా కుట్రలు...? ఇలా చేస్తే నష్టం ఎవరికి ...?

Janasena Party : ఆంధ్ర ప్రదేశ్ లో ఉన్న పార్టీలలో అధికార పక్షానికి ప్రతిపక్షానికి ఎవరికి వాళ్లకి కావాల్సిన మీడియా సంస్థలు ఉన్నాయి. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి సాక్షి పత్రిక అలాగే చంద్రబాబు నాయుడుకి ఆంధ్రజ్యోతి , టీవీ 5 ఈ రకమైన చానల్స్ ఉన్నాయి. ఇక టీవీ9 ఎన్టీవీ విషయానికొస్తే ఎవరు అధికారంలో ఉంటే వారికి సపోర్ట్ చేస్తూ ఉంటారు. ఇక ఈ మీడియా సంస్థలు ఎవరికి వారు తోచిన విధంగా వారి పార్టీ నాయకులు కనుగుణంగా న్యూస్లు రాస్తూ వారిని నడిపిస్తూ ఉంటారు. ఇది దేశ ప్రజాస్వామ్యానికి జర్నలిజనికి అత్యంత తీరని మచ్చ. అత్యంత నీచమైన విషయం అని చెప్పాలి. ఇక విషయంలోకి వెళ్తే ఇక ఇప్పుడు ఉన్న రాజకీయ నాయకులలో ఎటువంటి మీడియా సపోర్ట్ లేని వ్యక్తి పవన్ కళ్యాణ్. ఆయన విడిగా ఉంటే ఎటువంటి సపోర్ట్ ఉండదు కానీ ప్రస్తుతం పొత్తులో ఉన్నారు కాబట్టి టిడిపికి సంబంధించిన మీడియా జనసేన కు కబోర్డ్ గా ఉంటున్నాయి. అయితే అసలు సపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు. మీడియా ఏం చేయాలి అంటే జగన్ తప్పు చేస్తే ప్రశ్నించాలి. అలాగే చంద్రబాబు తప్పు చేస్తే ప్రశ్నించాలి. పవన్ కళ్యాణ్ తప్పు చేసిన ప్రశ్నించాలి కానీ మీడియా అలా కాకుండా వారు ఎటువైపు ఒదిగి ఉన్నారో వారిని తప్ప అవతల వాళ్ళు తప్పు చేస్తే ప్రశ్నిస్తారు. వీళ్ళ తాలూకా వాళ్ళు తప్పు చేస్తే ఆ విషయం ప్రశ్నించకుండా అలాగే ఆ విషయాన్ని ప్రజలకు తెలియకుండా వేరే రకంగా డైవర్ట్ చేస్తూ అత్యంత నీచమైన జర్నలిజని నడుపుతున్నారు అని పలువురు అభిప్రాయ వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రస్తుతం దేశం మొత్తం కూడా అలాగే ఉంది.

ఆంధ్రప్రదేశ్ లో నడుస్తున్నటువంటి ఈ ఇబ్బందికర పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ మీద తెలుగుదేశం కి సపోర్ట్ గా ఉండే మీడియా సంస్థలు ఏదైనా కుట్ట చేస్తున్నాయా అనే డిస్కషన్ చేస్తున్నాయని జనసేన పార్టీ వాళ్లు భావిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ అలాంటిది ఏమీ లేదు అని వారు తెలియజేస్తున్నారు. అయితే జనసేన మీద టిడిపికి సంబంధించిన మీడియా ఒక కొత్త ప్రచారాన్ని మొదలుపెట్టింది. త్వరలోనే బిజెపి లో చేరే అవకాశం ఉంది అని. ఇక బిజెపి జనసేన తెలుగుదేశం ఉన్న 175 సీట్లు ను 25 ఎంపీ సీట్లను ముగ్గురు పంచుకోవాలి. నిజానికి ఓట్ల షేరింగ్ విషయానికి వస్తే మొదట తెలుగుదేశం పార్టీకి ఎక్కువ ఇవ్వాలి. ఆ తర్వాత జనసేన పార్టీకి ఇవ్వాలి. కానీ బిజెపి కూడా జనసేనతో సమానంగా ఉండడంతో జనసేన పార్టీని లిమిట్ చేయాలి అనే ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ మీడియా సంస్థలు తెలుగుదేశం పార్టీకి మేలు చేయాలనే ఉద్దేశంతో జనసేనకు 20 సీట్లు అని ఒకసారి 25 సీట్లు అని మరోసారి ఇలా రోజుకి ఒక ప్రచారాన్ని తెరమీదకు మరొకటి అని వార్తలు తెరమీదకు తీసుకొస్తున్నాయి. నిజానికి ఈ మీడియా సంస్థలు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉండాలి.అంటే సొంత తెలివితేటలు పక్కనపెట్టి ఆ పార్టీ చెప్పి నట్లు నడుచుకోవాలి.ఇప్పుడు జగన్ విషయానికి వస్తే జగన్ ఏం చెప్తే ఆ మీడియా అది పాటిస్తుంది. తప్ప వారి సొంత ఆలోచన పెట్టి అక్కడ పనిచేయదు అలా చేయాలి. కానీ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ అలా కాదు మాత్రం అలా కాదు అని అంటున్నారు విశ్లేషకులు. అన్ని విషయాలలో తాను మేధావి అనే భావనతో కొన్ని పనులు చేసి తర్వాత ఆ పనుల వల్ల తెలుగుదేశం పార్టీకి ఇబ్బంది కలిగిస్తున్నారని చెబుతున్నారు. జనసేన ను ఇన్ని సీట్లకే పరిమితం చేయాలి అని తెలుగుదేశం పార్టీ అనుకోవడంలో తప్పులేదు. ఎందుకంటే అది పెద్ద పార్టీ కాబట్టి అయితే అలాంటి ప్రాసెస్ ఉండాలి.

అంటే ఆ విషయాన్ని జనసేన తో మాట్లాడి పార్టీ శ్రేణులతో పవన్ కళ్యాణ్ మాట్లాడి ఒప్పించుకునేలా చేయడం. అది ఒక పద్ధతి. కాని ముందుగానే టిడిపికి సంబంధించిన మీడియాలు ప్రచారం చేసి ఇన్ని సీట్లు ఇస్తున్నారు అని చేయడం వలన తెలుగుదేశం పార్టీకి తలకాయ నొప్పి తీసుకొస్తున్నారు. అయితే తెలుగుదేశం పార్టీ తరఫున పనిచేసే మీడియా ఆంధ్రజ్యోతి ముందుగానే ప్రచారం చేయడంతో జనసేన అగ్రనేత నాగబాబు దీనిని వ్యతిరేకించారు. ఇటువంటి ప్రచారాలు నమ్మవద్దు ఎన్ని సీట్లు అనేది అధినేత చంద్రబాబు నాయుడు మరియు పవన్ కళ్యాణ్ మాట్లాడుకున్నప్పుడు వాళ్లు తెలుపుతారు. మీరు ఎటువంటి కంగారు పడవద్దని వారు తెలియజేశారు. తెలుగుదేశం పార్టీకి రానున్న ఎన్నికలు జీవనమరణ వంటిది. ఇప్పుడు ఆ పార్టీకి పొత్తులు కీలకంగా మారాయి. పొత్తుల సింహ భావన పొందాలి అని తెలుగుదేశం పార్టీ భావిస్తుంది. ఆ విషయంలో ఎలాంటి తప్పులేదు. వీలైనంత తక్కువ సీట్లు జనసేనకు పెట్టి బిజెపికి జనసేనకు 40 సీట్లు ఇచ్చి ఎంపీ సీట్లు ఒక 6 ఇచ్చే ఆలోచనల చంద్రబాబు నాయుడు ఉన్నట్లుగా సమాచారం. అయితే ఈ విషయాలను చంద్రబాబు నాయుడు మరియు పవన్ కళ్యాణ్ చర్చించుకుని తెలియజేసే దాకా వాస్తవం కాదని తెలుసుకోవాలి.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది