కేశినేని నాని సంచలన నిర్ణయం తీసుకున్నారు. టీడీపీ మంత్రిగా ఉన్న ఆయన పార్టీకి, ఎంపీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తన అవసరం లేదని చంద్రబాబు భావించారని, ఇక తాను ఆ పార్టీలో కొనసాగటం కరెక్ట్ కాదని కేశినేని నాని పేర్కొన్నారు. వంద రోజుల్లో ఎన్నికలు ఉన్న నేపథ్యంలో టీడీపీ మంత్రి ఇలా రాజీనామా చేయడం ఆసక్తికరంగా మారింది. టీడీపీ సిట్టింగ్ ఎంపీ కేశినేని నాని తన పదవికి రాజీనామా చేయడం ఆసక్తికరంగా మారింది. విజయవాడ టీడీపీలో నెలకొన్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉండాలంటూ చంద్రబాబు తన సందేశంగా పార్టీ నేతల ద్వారా నానికి సమాచారం ఇచ్చారు. ఈ విషయాన్ని కేశినేని నాని స్వయంగా తెలిపారు. పార్టీ కార్యక్రమాల్లో ఎక్కువగా జోక్యం చేసుకోవద్దని విజయవాడ సీటు వచ్చే ఎన్నికల్లో మరొకరికి ఇవ్వనున్నట్లు తెలిపారు.
దీంతో కేశినేని చంద్రబాబు చెప్పినట్లుగానే పార్టీకి దూరంగా ఉంటానని తెలిపారు. తాను ఎంపీ పదవికి, పార్టీకి రాజీనామా చేస్తానని స్పష్టం చేశారు. అయితే టీడీపీని కేశినేని వీడటం ఖాయమైంది. దీంతో రాజకీయంగా ఆయన తర్వాత అడుగులు ఏంటనేది ఇప్పుడు చర్చనియాంశంగా మారింది. నానికి బీజేపీ ముఖ్య నేతలతో సంబంధాలు ఉన్నాయి. కానీ ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి కూటమిగా ఎన్నికలలో పోటీ చేస్తాయని ప్రచారంతో ఆ పార్టీలో చేరే అవకాశం లేదని నాని చెబుతున్నారు. వైసీపీ నేతలతో కొంతకాలంగా నాని సన్నిహితంగా ఉంటున్నారు. ప్రజా జీవితంలో మంచి చేసే వారిని ప్రోత్సహించాలని ఎన్నికల సమయంలో రాజకీయాలను చెప్పుకొచ్చారు. నాని వైసీపీలోకి వస్తామంటే ఆహ్వానిస్తామని అప్పట్లోనే వైసీపీ ముఖ్య నేతలు స్పష్టం చేశారు. ఇప్పుడు నాని టీడీపీ పార్టీకి రాజీనామా చేయడంతో
ఆయన వైసీపీ లోకి వెళ్లే అవకాశం ఉందని చర్చ జరుగుతుంది. ఇప్పటికే నాని తాను పార్టీ మారుతానని క్లారిటీ ఇచ్చారు. తాజా పరిణామాలపై స్పందించిన ఆయన త్వరలోనే సరైన నిర్ణయం తీసుకుంటాను అన్నారు. తాను పోటీకి దూరంగా ఉండాలన్న విజయవాడ ప్రజలు ఊరుకోరు అన్నారు. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన గెలుస్తానని నమ్మకం ఉందని చెప్పుకొచ్చారు. దీంతో నాని జనసేనలోకి వెళతారా లేక వైసీపీ పార్టీలోకి చేరతారా లేక స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలుస్తారా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. నానితో పాటు విజయవాడ లోక్ సభ పరిధిలో ఆయన మద్దతుదారులు అసెంబ్లీ అభ్యర్థులుగాను పోటీ చేయించేలా ఆలోచన జరుగుతుందని తెలుస్తుంది. ఈ క్రమంలోనే నానితో వైసీపీ నేతలు టచ్లోకి వెళ్లారని సమాచారం. వచ్చే ఎన్నికల్లో కీలకమైన విజయవాడలో టిడిపిలో చోటు చేసుకుంటున్న పరిణామాలు కేశినేని నాని నిర్ణయాలు ఏంటి అనేది ఆసక్తికరంగా మారింది. .
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.