Home » Entertainment » Director Trivikram Facts About Jr Ntr Rejected Guntur Karam
Entertainment

Director Trivikram : గుంటూరు కారం సినిమా ఎన్టీఆర్ కోసం రాసుకున్నా.. కానీ మహేష్ తో చేశాను.. డైరెక్టర్ త్రివిక్రమ్..!

Authored By
aruna
The Telugu News | Published on: January 6, 2024, 7:00 pm
Advertisement

Director Trivikram : మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్లో తెరకెక్కిన ‘ గుంటూరు కారం ‘ సినిమా జనవరి 12న సంక్రాంతి కానుకగా విడుదల కాబోతుంది. అయితే గుంటూరు కారం సినిమా కథను ముందుగా త్రివిక్రమ్ జూనియర్ ఎన్టీఆర్ కు వినిపించారని ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. జూనియర్ ఎన్టీఆర్ బిజీగా ఉండడంతో ఈ సినిమాకు ఓకే చెప్పలేదని తెలుస్తోంది. ఇక మహేష్ బాబు గుంటూరు కారం కథ నచ్చడంతో ఓకే చెప్పారట. అయితే త్రిబుల్ ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్ అయిన జూనియర్ ఎన్టీఆర్ పాన్ వరల్డ్ వైడ్ గా గుంటూరు కారం కనెక్ట్ అవ్వదని, అందుకే రిజెక్ట్ చేశారని వార్త వైరల్ గా మారింది. ఇక మహేష్ బాబు త్రివిక్రమ్ మీద గౌరవంతో అందుకు ఓకే చెప్పారట. అలాగే గతంలో కూడా త్రివిక్రమ్ తో చేసిన సినిమాలు సూపర్ హిట్ గా నిలిచాయి.

Advertisement

అందుకే మరోసారి త్రివిక్రమ్ తో సినిమా చేసి సూపర్ హిట్ అందుకోవాలని మహేష్ బాబు భావించారట. ఇక గుంటూరు కారం సినిమాని నార్త్ లో కూడా విడుదల చేయాలని సినిమా యూనిట్ భావిస్తున్నారట. ఈ సినిమా తర్వాత మహేష్ బాబు దర్శక ధీరుడు రాజమౌళి సినిమా చేయనున్నారు. ఆ సినిమాతో గ్లోబల్ వైడ్ గా మహేష్ బాబు గుర్తింపు తెచ్చుకుంటారు అని ఫ్యాన్స్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ గుంటూరు కారం సినిమాని ఎందుకు రిజెక్ట్ చేశారని వార్తలు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే జూనియర్ ఎన్టీఆర్ బిజీగా ఉండటం వలన గుంటూరు కారం సినిమా రిజెక్ట్ చేశారని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ దేవర సినిమా చేస్తున్నారు. ఆ తర్వాత వార్ 2 సినిమా చేయబోతున్నారు.

దీంతో బిజీగా ఉండటం వల్లనే జూనియర్ ఎన్టీఆర్ గుంటూరు కారం సినిమా రిజెక్ట్ చేశారని తెలుస్తుంది. అయితే సోషల్ మీడియాలో గుంటూరు కారు వరల్డ్ వైడ్ గా కనెక్ట్ అవ్వదని అందుకే జూనియర్ ఎన్టీఆర్ రిజెక్ట్ చేశాడని వార్తలు వస్తున్నాయి. ఇక గుంటూరు కారం సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కాబోతుంది. ఈ సినిమాల్లో హీరోయిన్ శ్రీ లీల నటించారు. అలాగే మీనాక్షి చౌదరి సెకండ్ హీరోయిన్ గా నటించారు. ఎస్. ఎస్. తమన్ సంగీతం అందించారు. ఇటీవల విడుదలైన పాట సినిమాపై భారీ అంచనాలను పెంచేసింది. దీంతో సినిమా ఎప్పుడు ఎప్పుడు వస్తుందని మహేష్ బాబు ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

aruna

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి