TDP : పవన్ వ్యూహం.. లోకేశ్ డిప్యూటీ సీఎం ప్రచారంపై టీడీపీ సైలెంట్ !
Pawan Kalyan : ఐటీ, విద్యాశాఖల మంత్రి నారా లోకేశ్‌ను డిప్యూటీ సీఎం చేయాలంటూ టీడీపీ TDP పార్టీ నేత రాజేష్ మహాసేన మొదలుపెట్టిన డిమాండ్ ను ఆ తర్వాత ఇతర నేతలు రెడ్డప్పగారి శ్రీనివాసులురెడ్డి, బుద్దా వెంకన్న, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, ఎస్వీఎస్ఎన్ వర్మ అందుకున్నారు. అయితే ఈ డిమాండ్, ప్రచారం ఊపందుకుంటున్న నేపథ్యంలో సోమవారం టీడీపీ TDP అధిష్టానం దీనిపై స్పందించి ఈ ప్రచారానికి బ్రేక్ వేసింది. రాష్ట్రంలో టీడీపీ, జనసేన Janasena , బీజేపీ BJP గతంలోనే ఓ ఒప్పందం చేసుకున్నాయి. అధికారంలోకి వస్తే Chandrababu చంద్రబాబు సీఎం, పవన్ Pawan Kalyan డిప్యూటీ సీఎం, మిగతా నేతలకు ఇతర పదవులు అని నిర్ణయించారు.
TDP : పవన్ వ్యూహం.. లోకేశ్ డిప్యూటీ సీఎం ప్రచారంపై టీడీపీ సైలెంట్ !
దానికి భిన్నంగా అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే లోకేశ్‌ను డిప్యూటీ సీఎం చేయాలన్న ప్రచారం తెరపైకి వచ్చింది. టీడీపీలో ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు తమకు అనుకూలమైన మీడియా, నేతల ద్వారా లీకులు ఇవ్వడం, దానిపై జనాల స్పందన సానుకూలత వస్తే ముందుకు వెళ్లడం, లేదంటే వేచి చూడడం, వెనక్కి తగ్గడం చేస్తుంటుంది. అదేతీరున ఇప్పుడు కూడా లోకేశ్‌ను డిప్యూటీ సీఎం చేసే విషయంలోనూ అదే జరిగిందని సర్వత్రా చర్చించుకుంటున్నారు.
ప్రస్తుతం రాష్ట్రంలో డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ ఉన్నారు. కానీ ఇప్పుడు లోకేశ్ రూపంలో మరో డిప్యూటీ సీఎం వస్తే మజ్జిగ పలుచన కావడం ఖాయమని అనుకుంటున్నారు. అందుకే గత కొన్నిరోజులుగా టీడీపీ నేతలు లోకేశ్‌ను డిప్యూటీ సీఎం చేయాలంటూ ప్రచారం హోరెత్తించినా పవన్ మాత్రం సైలెంట్‌గానే ఉన్నాడు.
అయితే తిరుపతి జనసేన ఇన్ ఛార్జ్ కిరణ్ రాయల్ స్పందిస్తూ.. లోకేశ్ డిప్యూటీ సీఎం కావాలని టీడీపీ నాయకులు ఎలా కోరుకుంటున్నారో, అలాగే జనసేన నాయకులు కూడా పవన్ కళ్యాణ్ సీఎం కావాలని కోరుకుంటున్నట్లు తెలిపాడు. ఈ వ్యాఖ్యల ప్రభావంతోనే టీడీపీ వెంటనే అప్రమత్తమై లోకేశ్ డిప్యూటీ సీఎం ప్రచారం ఆపాలంటూ నేతలకు ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం. అయితే మిగతా నేతలు సైలెంట్ అయినా విషయం తెలియని మంత్రి టీజీ భరత్ ఏకంగా దావోస్ లోనే సీఎం చంద్రబాబు ముందే ఎవరు ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా లోకేష్ కాబోయే సీఎం అన్నారు. ఈ వ్యాఖ్యలపై చంద్రబాబు ఆగ్రహిస్తూ ఎక్కడికి వచ్చి ఏం మాట్లాడుతున్నాం అంటూ భరత్‌ను క్లాస్ తీసుకున్న సంగతి తెలిసిందే.
Pakiza : హాస్య నటిగా పాకీజా అలియాస్ వాసుకీ ఎన్నో చిత్రాలతో ప్రేక్షకల్ని మెప్పించారు. కొంతకాలంగా అవకాశాలు లేక తీవ్ర…
Rain Water : వర్షాకాలం సీజన్ వచ్చేసింది. వర్షంలో తడవడానికి ఇష్టపడని వారంటూ ఉండరు. అయితే వర్షంలో తడుస్తూ సంతోషంగా…
Gk Fact Osk : ప్రతి ఒక్కరు కూడా చికెన్ అంటే చాలా సంతోషంగా ఆరోజు భోజనాన్ని తినేస్తుంటారు. కోడి…
Sugar Patients : మధుమేహం వ్యాధి దీర్ఘకాలిక వ్యాధి. అదే ఒకసారి వచ్చినట్లయితే జీవితాంతం వరకు ఉంటుంది. జీవితాంతం చాలా…
Business : ప్రస్తుత కాలంలో బిజినెస్ అనేది బెస్ట్ ఆప్షన్ గా చాలామంది భావిస్తున్నారు. చేతిలో కొంత డబ్బు ఉంటె…
Beetroot Leaves : ఆకు కూరలు ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఈ ఆకు కూరల్లో కొవ్వు తక్కువగా ఉంటుంది. ప్రోటీన్లు,విటమిన్లు,…
Vijayasai Reddy : వైసీపీలో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవలే పార్టీకి, రాజకీయాలకు గుడ్‌బై చెబుతూ రాజీనామా చేసిన…
Black Coffee : ప్రతి ఒక్కరికి ఉదయాన్నే ఒక కప్పు కాఫీ తాగందే ఆ రోజు గడవదు. కాఫీ లో…
This website uses cookies.