TDP : కూటమి గెలిస్తే స్పీకర్ పదవి ఆ సెన్సేషనల్ లీడర్ కే నట..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

TDP : కూటమి గెలిస్తే స్పీకర్ పదవి ఆ సెన్సేషనల్ లీడర్ కే నట..!

TDP : ఇప్పుడు ఏపీలో పోలింగ్ ముగిసింది. ఎన్నో ఆరోపణలు, ప్రత్యారోపణల నడుమ ప్రచారం ముగిసింది. విధ్వంసాల నడుమ పోలింగ్ పూర్తి అయింది. ఇప్పుడు పార్టీల భవితవ్యం కాస్త బ్యాలెట్ బాక్సుల రూపంలో ఉంది. అయితే రాజకీయ నేతల్లో ఆశలు ఒక్కోసారి ఒక్కోలా ఉంటాయి. మొదటగా నోటిఫికేషన్ వచ్చినప్పుడు టికెట్ ఎవరికి వస్తుందో అనే టెన్షన్ ఉంటుంది. తమకే రావాలని చాలా మంది కోరుకుంటారు. కానీ ఎవరికి టికెట్ వస్తుందో.. ఎవరికి దెబ్బ పడుతుందో చెప్పలేం. ఇక […]

 Authored By ramu | The Telugu News | Updated on :20 May 2024,3:30 pm

ప్రధానాంశాలు:

  •  TDP : కూటమి గెలిస్తే స్పీకర్ పదవి ఆ సెన్సేషనల్ లీడర్ కే నట..!

TDP : ఇప్పుడు ఏపీలో పోలింగ్ ముగిసింది. ఎన్నో ఆరోపణలు, ప్రత్యారోపణల నడుమ ప్రచారం ముగిసింది. విధ్వంసాల నడుమ పోలింగ్ పూర్తి అయింది. ఇప్పుడు పార్టీల భవితవ్యం కాస్త బ్యాలెట్ బాక్సుల రూపంలో ఉంది. అయితే రాజకీయ నేతల్లో ఆశలు ఒక్కోసారి ఒక్కోలా ఉంటాయి. మొదటగా నోటిఫికేషన్ వచ్చినప్పుడు టికెట్ ఎవరికి వస్తుందో అనే టెన్షన్ ఉంటుంది. తమకే రావాలని చాలా మంది కోరుకుంటారు. కానీ ఎవరికి టికెట్ వస్తుందో.. ఎవరికి దెబ్బ పడుతుందో చెప్పలేం. ఇక టికెట్ వచ్చిన తర్వాత గెలవడం ఓ పెద్ద యుద్ధమే అనుకోవాలి.

ఎందుకంటే ప్రచారం దగ్గరి నుంచి పోలింగ్ మేనేజ్ మెంట్ వరకు అన్నీ అనుకూలించాలి. చివరకు గెలిచిన తర్వాత పార్టీ గెలవాలని కోరుకోవాలి. ఒకవేళ పార్టీ కూడా గెలిస్తే అప్పుడు ఏ పదవులు దక్కుతాయా అని ఎదురు చూడాలి. చాలా మంది ఎమ్మెల్యేలు తమ పార్టీ అధికారంలోకి వస్తే కచ్చితంగా మంత్రి పదవులే కోరుకుంటారు. అయితే ఇప్పుడు ఏపీలో కూటమి అధికారంలోకి వస్తే తమకు ఏ పదవి దక్కుతుందా అని అంతా వెయిట్ చేస్తున్నారు. వైసీపీలాగా తామే అధికారంలోకి వస్తామని కూటమి నేతలు ధైర్యంగా చెప్పలేకపోతున్నారు. కానీ పదవులపై ఆశలు పెంచుకుంటున్నారు.

రేవ్ పార్టీలో తాను ఉన్నట్లు వస్తున్న వార్తలను ఖండించిన నటి హేమ బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీలో నేను లేను నేను హైదరాబాద్‌లోనే ఫామ్ హౌస్‌లో ఎంజాయ్ చేస్తున్నా బెంగళూరు రేవ్ పార్టీతో నాకు సంబంధం లేదు నటి హేమ

రేవ్ పార్టీలో తాను ఉన్నట్లు వస్తున్న వార్తలను ఖండించిన నటి హేమ
బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీలో నేను లేను.. నేను హైదరాబాద్‌లోనే ఫామ్ హౌస్‌లో ఎంజాయ్ చేస్తున్నా. బెంగళూరు రేవ్ పార్టీతో నాకు సంబంధం లేదు – నటి హేమ

TDP అసెంబ్లీలో రచ్చనే..

ఇక కూటమి టీడీపీ అధికారంలోకి వస్తే మాత్రం కచ్చితంగా ఓ వ్యక్తికి స్పీకర్ పదవి దక్కుతుందని చర్చ జరుగుతోంది. ఆయన ఎవరో కాదు చివరి నిముషంలో ఉండి నియోజకవర్గం నుంచి పోటీ చేసిన రఘురామకృష్ణం రాజు. ఆయన వైసీపీకి మొన్నటి వరకు రెబల్ గాఉన్నారు. జగన్ ను వ్యక్తిగతంటా టార్గెట్ చేసిన వారిలో రఘురామ ముందు వరుసలో ఉంటారు. అలాంటి వ్యక్తికి స్పీకర్ పదవి ఇస్తే అసెంబ్లీలో రచ్చ వేరేలా ఉంటుందని భావిస్తున్నారంట కూటమి నేతలు. అందుకే ఏరికోరి మరీ ఆయనకే స్పీకర్ పదవి ఇవ్వాలని అందరూ డిసైడ్ అయినట్టు తెలుస్తోంది.

రఘురామ ఎప్పటికప్పుడు సెన్సేషనల్ గానే ఉంటున్నారు. చాలా విషయాల్లో ఆయన జగన్ ను టార్గెట్ చేస్తున్నారు. చూడాలి మరి ఆయన స్పీకర్ అవుతారా లేదా అనేది.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది