రేవ్ పార్టీలో తాను ఉన్నట్లు వస్తున్న వార్తలను ఖండించిన నటి హేమ బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీలో నేను లేను.. నేను హైదరాబాద్‌లోనే ఫామ్ హౌస్‌లో ఎంజాయ్ చేస్తున్నా. బెంగళూరు రేవ్ పార్టీతో నాకు సంబంధం లేదు - నటి హేమ
TDP : ఇప్పుడు ఏపీలో పోలింగ్ ముగిసింది. ఎన్నో ఆరోపణలు, ప్రత్యారోపణల నడుమ ప్రచారం ముగిసింది. విధ్వంసాల నడుమ పోలింగ్ పూర్తి అయింది. ఇప్పుడు పార్టీల భవితవ్యం కాస్త బ్యాలెట్ బాక్సుల రూపంలో ఉంది. అయితే రాజకీయ నేతల్లో ఆశలు ఒక్కోసారి ఒక్కోలా ఉంటాయి. మొదటగా నోటిఫికేషన్ వచ్చినప్పుడు టికెట్ ఎవరికి వస్తుందో అనే టెన్షన్ ఉంటుంది. తమకే రావాలని చాలా మంది కోరుకుంటారు. కానీ ఎవరికి టికెట్ వస్తుందో.. ఎవరికి దెబ్బ పడుతుందో చెప్పలేం. ఇక టికెట్ వచ్చిన తర్వాత గెలవడం ఓ పెద్ద యుద్ధమే అనుకోవాలి.
ఎందుకంటే ప్రచారం దగ్గరి నుంచి పోలింగ్ మేనేజ్ మెంట్ వరకు అన్నీ అనుకూలించాలి. చివరకు గెలిచిన తర్వాత పార్టీ గెలవాలని కోరుకోవాలి. ఒకవేళ పార్టీ కూడా గెలిస్తే అప్పుడు ఏ పదవులు దక్కుతాయా అని ఎదురు చూడాలి. చాలా మంది ఎమ్మెల్యేలు తమ పార్టీ అధికారంలోకి వస్తే కచ్చితంగా మంత్రి పదవులే కోరుకుంటారు. అయితే ఇప్పుడు ఏపీలో కూటమి అధికారంలోకి వస్తే తమకు ఏ పదవి దక్కుతుందా అని అంతా వెయిట్ చేస్తున్నారు. వైసీపీలాగా తామే అధికారంలోకి వస్తామని కూటమి నేతలు ధైర్యంగా చెప్పలేకపోతున్నారు. కానీ పదవులపై ఆశలు పెంచుకుంటున్నారు.
రేవ్ పార్టీలో తాను ఉన్నట్లు వస్తున్న వార్తలను ఖండించిన నటి హేమ
బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీలో నేను లేను.. నేను హైదరాబాద్‌లోనే ఫామ్ హౌస్‌లో ఎంజాయ్ చేస్తున్నా. బెంగళూరు రేవ్ పార్టీతో నాకు సంబంధం లేదు – నటి హేమ
ఇక కూటమి టీడీపీ అధికారంలోకి వస్తే మాత్రం కచ్చితంగా ఓ వ్యక్తికి స్పీకర్ పదవి దక్కుతుందని చర్చ జరుగుతోంది. ఆయన ఎవరో కాదు చివరి నిముషంలో ఉండి నియోజకవర్గం నుంచి పోటీ చేసిన రఘురామకృష్ణం రాజు. ఆయన వైసీపీకి మొన్నటి వరకు రెబల్ గాఉన్నారు. జగన్ ను వ్యక్తిగతంటా టార్గెట్ చేసిన వారిలో రఘురామ ముందు వరుసలో ఉంటారు. అలాంటి వ్యక్తికి స్పీకర్ పదవి ఇస్తే అసెంబ్లీలో రచ్చ వేరేలా ఉంటుందని భావిస్తున్నారంట కూటమి నేతలు. అందుకే ఏరికోరి మరీ ఆయనకే స్పీకర్ పదవి ఇవ్వాలని అందరూ డిసైడ్ అయినట్టు తెలుస్తోంది.
రఘురామ ఎప్పటికప్పుడు సెన్సేషనల్ గానే ఉంటున్నారు. చాలా విషయాల్లో ఆయన జగన్ ను టార్గెట్ చేస్తున్నారు. చూడాలి మరి ఆయన స్పీకర్ అవుతారా లేదా అనేది.
OG Collections | సుజీత్ దర్శకత్వంలో పవర్స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన ఓజీ బారీ అంచనాల మధ్య సెప్టెంబర్…
OG | పవన్ కళ్యాణ్ తాజా చిత్రం ‘ఓజీ’ (ఒరిజినల్ గ్యాంగ్స్టర్) టికెట్ ధరల పెంపుపై తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ…
Coconut | కొబ్బరి అంటేనే మనం వెంటనే ఆరోగ్యానికి మంచిదని భావిస్తాం. పచ్చి కొబ్బరి, కొబ్బరి నీళ్లు, కొబ్బరి నూనె…
Jackfruit seeds | రోజురోజుకూ మారుతున్న వాతావరణం, పుట్టుకొస్తున్న కొత్త వైరస్లు ప్రజల ఆరోగ్యాన్ని ముప్పుతిప్పులు పెడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో…
Tulsi Leaves | హిందూ మతంలో పవిత్రంగా పరిగణించే తులసి చెట్టు కేవలం ఆధ్యాత్మిక కోణంలోనే కాకుండా, ఆరోగ్య పరంగా…
Garlic Peel Benefits | మన వంటగదిలో ప్రతిరోజూ వాడే వెల్లుల్లి యొక్క పేస్ట్, గుళికలే కాదు.. వెల్లుల్లి తొక్కలు…
Health Tips | వేగంగా బరువు తగ్గాలనుకునే వారు రోజులో ఎన్నో మార్గాలను ప్రయత్నిస్తుంటారు. వాటిలో టీ (చాయ్) ద్వారా బరువు…
Diwali | హర్షాతిరేకాలతో, వెలుగుల మధ్య జరుపుకునే హిందూ ధర్మంలోని మహా పర్వదినం దీపావళి మళ్లీ ముంచుకొస్తోంది. పిల్లలు, పెద్దలు అనే…
This website uses cookies.