AP Politics : ఏపీలో కొందరు రాజకీయ నేతల పరిస్థితి చాలా లక్కీగా కనిపిస్తోంది. ఎందుకంటే వారి హవా అలా ఉంటుంది మరి. ఏపీ రాజకీయాలను శాసించే స్థాయిలో వారు ఉంటారు. అందుకే వారికి కచ్చితంగా మంత్రి పదవులు రెడీగా ఉంటాయి. అందులో చూసుకుంటే మొదటగా వంగా గీతా గురించి చెప్పుకోవాలి. ఆమె పిఠాపురం నుంచి బరిలో ఉన్నారు. గెలిస్తే జగన్ చెప్పినట్టు డిప్యూటీసీఎం అవుతారు. ఒకవేళ ఓడినా సరే ఆమెను ఎమ్మెల్సీ చేసి మంత్రి పదవి ఇస్తారని అంటున్నారు. ఎందుకంటే ఆమె విషయంలో మాట నిలబెట్టుకున్నానని జగన్ చెప్పుకోవడం కోసం.. అంతే కాకుండా కాపుల నమ్మకాన్ని గెలవడం కోసం ఆమెకు మంత్రి పదవి ఖాయం అంటున్నారు.
ఇక గుడివాడ మాస్ లీడర్ కొడాలి నానికి కూడా మంత్రి పదవి ఖాయం అంటున్నారు. ఆయన ఈ సారి ఎలాగూ గెలుస్తున్నారు. కాబట్టి గెలిచిన వెంటనే మంత్రి పదవి ఇవ్వబోతున్నారు. ఎందుకంటే ఆయన కమ్మ సామాజిక వర్గం నుంచి బలమైన నేతగా ఉన్నారు. జగన్ కు అండగా ఉంటున్నారు. కాబట్టి ఆయన ఓడినా సరే ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రిని చేస్తారంట. కృష్నా జిల్లా నుంచే పేర్ని నానికి కూడా మంత్రి పదవి ఖాయం. ఈ సారి ఆయన కొడుకు పోటీ చేస్తున్నారు. అయితే జగన్ అధికారంలోకి వస్తే పేర్నికి ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రిని చేయబోతున్నారని తెలుస్తోంది.
ఇక గుంటూరు నుంచి విడుదల రజినికీ మంత్రి పదవి రెడీగా ఉందంట. ఎందుకంటే ఆమె బలమైన బీసీ సామాజిక వర్గం నుంచి ఉన్నారు. ఒకవేళ టీడీపీ కూటమి అధికారంలోకి వస్తే మాత్రం టీడీపీ సీనియర్ నేత అయిన యనమల రామకృష్ణుడికి ఆర్థిక మంత్రి పదవి రెడీగా ఉంచారంట. దాంతో పాటు అటు లోకేష్ కు కూడా మంత్రి పదవి ఖాయం అంటున్నారు. టీడీపీ అధికారంలోకి వస్తే లోకేష్ గెలిచినా లేదంటే ఓడినా సరే మంత్రి పదవి మాత్రం కన్ఫర్మ్ గా ఉంటుందంట. ఎలాగూ పార్టీ నారా వారిదే కాబట్టి లోకేష్ ఓడిపోయినా సరే ఎమ్మెల్సీని చేసి మంత్రి పదవి ఇస్తారని తెలుస్తోంది.
గతంలో లోకేష్ పోటీ చేయనప్పుడే ఎమ్మెల్సీని చేసి మంత్రి పదవి ఇచ్చారు. ఇక పవన్ కోసం పని చేసిన ఎస్వీఎస్ ఎన్ వర్మకు కూడా ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రిని చేయబోతున్నారంట. అటు అచ్చెన్నాయుడుకి కూడా గెలిచినా ఓడినా సరే పార్టీ అధికారంలోకి వస్తే మంత్రి పదవి ఖాయంగా ఉంటుందని చెబుతున్నారు.
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప 2 Pushpa 2 The Rule ప్రమోషన్స్ జోరందుకున్నాయి. సినిమాను పాన్…
Wheat Flour : ప్రస్తుతం మార్కెట్లో దొరికే ప్రతి వస్తువు కూడా కల్తీ గా మారింది. అలాగే ఎక్కడ చూసినా కూడా…
IPL 2025 Schedule : క్రికెట్ ప్రేమికులకి మంచి మజా అందించే గేమ్ ఐపీఎల్. ధనాధన్ ఆటతో ప్రేక్షకులకి మంచి…
This website uses cookies.