Geethanjali : ప్రభుత్వ పథకాలతో తన కుటుంబానికి ఎంతో మేలు జరిగిందని ఇటీవల ఓ యూట్యూబ్ ఛానల్ తో గీతాంజలి మాట్లాడిన వీడియో వైరల్ అయింది. ఆ వీడియో ప్రతిపక్ష పార్టీల కార్యకర్తలు సోషల్ మీడియాలో అనుచితంగా పోస్ట్ పెట్టడంతో ఆమె ఆత్మహత్య చేసుకున్నారని గీతాంజలి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమెపై ట్రోలింగ్ చేసిన కొన్ని సోషల్ మీడియా ఖాతాలను గుర్తించమని మరికొన్ని ఫేక్ ఖాతాలను కూడా గుర్తించామని నిందితులను పట్టుకుంటామని పోలీసులు చెప్పారు. టీడీపీ, జనసేన పార్టీల కార్యకర్తల ట్రోలింగ్ కారణంగానే గీతాంజలి ఆత్మహత్య చేసుకున్నారని వైసీపీ ఆరోపిస్తుంది. అయితే గీతాంజలి మరణ విషయంలో వైసీపీ అసత్య ప్రచారం చేస్తుందని టీడీపీ ఆరోపిస్తుంది.
సోషల్ మీడియాలో మహిళలే లక్ష్యంగా ట్రోలింగ్స్ బెదిరింపులకు సంబంధించిన కేసులు ఎక్కువగా పెరిగిపోతున్నాయి. ఏపీ మంత్రి ఆర్కే రోజా, తెలంగాణ సీనియర్ ఐఏఎస్ అధికారి స్మిత సబర్వాల్, రచయిత్రి కొండెపూడి నిర్మల, ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధికార ప్రతినిధి సాధినేని యామిని శర్మ, సినీ నటి అనసూయ, జర్నలిస్ట్ తులసి చందు ఇలా ఎందరో మహిళలు సోషల్ మీడియా ట్రోలింగ్ కి గురవుతున్నారు. నిత్యం ఏదో ఒక సందర్భంలో సోషల్ మీడియాలో ట్రోల్స్ బారిన పడుతున్న మహిళల్లో కొందరు వీరు. కొందరు నెటిజెన్లు అసభ్య పదజాలంతో మార్ఫింగ్ చేసిన ఫోటోలు వాడుతూ చదవలేని రీతిలో కామెంట్స్ పెడుతూ ట్రోలింగ్ చేస్తున్నారు.
ట్రోల్స్ చేసే వారెవరు అనేది చెప్పడం కష్టమే. వీరిపై కేసులు పెట్టినా పట్టుకోవడం కష్టంగా మారుతుంది. ఎందుకంటే ఫేక్ ఐడీలతో ప్రొఫైల్స్ క్రియేట్ చేసి వాటితోనే ట్రోల్స్ చేస్తుంటారు. వారి ఐడీలను ట్రాక్ చేసిన ఫేక్ కావడంతో పట్టుకోవడం కష్టం అయితే ఎవరైనా ట్రోల్స్ బారిన పడ్డారంటే వారిని ఏ వర్గం వారు ట్రోల్స్ చేస్తున్నారో గుర్తించవచ్చు. ముఖ్యంగా రాజకీయ పార్టీలు, మతపరమైన వ్యక్తులు, పార్టీల సానుభూతిపరులు వారికి వ్యతిరేకంగా ఉండే వ్యక్తులు ట్రోల్స్ చేస్తుంటారు. ఫేస్ బుక్, ట్విట్టర్, ఇంస్టాగ్రామ్, యూట్యూబ్ లలో ట్రోల్స్ చేయడం సర్వసాధారణంగా మారింది. ఇందుకు ప్రత్యేకంగా పేజీలు క్రియేట్ చేయడం లేదా యూట్యూబ్లో ప్రత్యేకంగా ఛానల్స్ పెడుతున్నారు. రాజకీయాలలోకి ఎప్పుడైతే వచ్చాను అప్పటి నుంచి ట్రోల్స్ ఎదుర్కొంటున్నానని పొలిటికల్ వీడియోలు చేయకపోతే ఎవరి మీద ట్రోల్స్ రావని జర్నలిస్టు తులసి చెందు చెబుతున్నారు. ఇదే విషయంపై ఏపీ బీజేపీ అధికార ప్రతినిధి సాధినేని యామిని శర్మ స్పందించారు. పాలిటిక్స్ కి వచ్చేసరికి సోషల్ మీడియాను మంచి కంటే చెడుగా ఎక్కువ ఉపయోగించుకుంటున్నారు. ఒక రాజకీయ పార్టీలో అధికార ప్రతినిధిగా ఉన్నప్పుడు అవతల రాజకీయ పార్టీలను నాయకులను కొన్నిసార్లు విమర్శలు చేస్తాం. అది రాజకీయంగా చూడకుండా కార్యకర్తలు, అభిమానులు, సానుభూతిపరులు వ్యక్తిగతంగా తీసుకొని అవతల ఉన్నది మహిళలని, ఆమె ఎందుకు అనాల్సి వచ్చిందో కనీస ఆలోచన లేకుండా విపరీతంగా ట్రోల్స్ చేస్తారని ఆమె చెప్పారు.
ఒక వ్యక్తి తన అభిప్రాయాలను వ్యక్తం చేసినప్పుడు అవి ఎదుటి వ్యక్తికి లేదా వర్గానికి నచ్చకపోతే ట్రోలింగ్ కి దిగుతున్నారు. ప్రతి వ్యక్తి స్వేచ్ఛగా మాట్లాడే ఆలోచనలను వ్యక్తం చేసే హక్కు రాజ్యాంగంలో ఆర్టికల్ 19(1) (a) కల్పిస్తుంది. రచయితలు, కవులు తమ భావాలను స్వేచ్ఛగా వ్యక్తపరిస్తుంటారు.కొన్నిసార్లు ఎవరిని కించపరిచే ఉద్దేశం లేకపోయినా వారి వ్యాఖ్యలను కొన్ని వర్గాలకు చెందిన కొందరు వ్యక్తులు లేదా పార్టీలను సానుభూతిపరులు అవి తమను ఉద్దేశించి చేసినవేనని అనుకొని ట్రోల్స్ చేస్తుంటారు.ఈ విషయంలో మహిళా రచయితలపై మరింతగా ట్రోల్స్ వస్తుంటాయి.ప్రముఖ రచయిత్రి కొండెపూడి నిర్మల రాసిన బొట్టు అని కవిత విషయంలో తీవ్రంగా ఎదుర్కొన్నారు.
ఒకరిద్దరు కామెంట్లు పెట్టి వదిలేయడం లేదు. మొత్తం వర్గాన్ని ప్రేరేపిస్తూ కామెంట్లు పెడతారు. తమకు సపోర్టుగా ఉన్న గ్రూపులలో షేర్ చేసి నెగిటివ్ కామెంట్లు పెట్టడం లేదా? అసభ్య పదజాలంతో దూషించడం చేస్తారుష ఈ ట్రోల్స్ ద్వారా ఎదుటి వ్యక్తి ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తున్నారు. ఈమె మనకు వ్యతిరేకంగా మాట్లాడింది అంటూ గ్రూపుల్లో షేర్ చేస్తారు. అప్పుడు ఒకేసారి మూకలా వచ్చి బూతులను కామెంట్లు గా పెడతారు. అదే సమయంలో ఎవరైనా మనల్ని అభిమానించే వాళ్ళు లేదా కంటెంట్ ను పొగడాలని భావించేవారు అక్కడ వచ్చే నెగటివ్ కామెంట్స్ చూసి సపోర్ట్ గా కామెంట్ పెట్టేందుకు ధైర్యం చేయరు. ఎవరైనా పాజిటివ్ కామెంట్ పెడితే వారిపై దాడికి దిగుతారు అని జర్నలిస్టు తులసి చందు తెలిపారు.
ఒక సర్వేలో 35 ఏళ్లలోపు ఉన్న 33 శాతం మంది యువతులు ఆన్లైన్లో లైంగిక వేధింపులకు గురైనట్లు తెలిపారు. మైనారిటీ వయసు వేధింపులు మరింత ఎక్కువ. ఇండియా అమెరికా బ్రెజిల్ సహా 22 దేశాల్లో 15 , 22 ఏళ్ళ వయసున్న 14,000 మంది యువతులపై సర్వే నిర్వహించింది. తామ వేధింపులకు గురైన తర్వాత ప్రతి ఐదుగురులో ఒకరు సోషల్ మీడియా చూడటం మానేశారు. అదే సమయంలో ప్రతి పది మందిలో ఒకరు వేరొక మాధ్యమం లేదా ఐడిని మార్చుకున్నారు. ఇన్ స్టాలో 23%, వాట్సాప్ లో 14%, స్నాప్ చాట్ లో 10% , ట్విట్టర్లో తొమ్మిది శాతం, టిక్ టాక్ లో ఆరు శాతం చొప్పున వేధింపులకు గురవుతున్నట్లు సర్వేలో తేలింది.
ఐదేళ్ల కిందట హైదరాబాదులోని ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రాజెక్ట్ ఏంజిల్ అనే సాఫ్ట్ వేర్ ను అభివృద్ధి చేసింది. సోషల్ మీడియాలో టీనేజ్ అమ్మాయిలకు వ్యతిరేకంగా వచ్చే పోస్టులు అసభ్య పదజాలాన్ని నియంత్రించడం మెసేజ్ లోని కంటెంట్ కనిపించకుండా చేయడం ఈ ప్రాజెక్టు యొక్క ప్రధాన ఉద్దేశం. దాదాపుగా 20 లక్షల మెసేజ్ లోని పదాలు వేధింపులకు గురి చేసే విధంగా ఉన్నట్లు ఉన్నాయని అంటున్నారు. ఆ స్థాయిలో సోషల్ మీడియా అసభ్య పదజాలం, బాడీ షేమింగ్, దూషణలు జరుగుతున్నాయని వివరించారు.
సాధారణ సమయాల్లో మామూలుగా కనిపించే వ్యక్తులు కూడా ఆన్లైన్లోకి వచ్చేసరికి చాలా క్రూరమైన వ్యక్తిత్వాన్ని కనబరుస్తున్నారని పరిశోధనలో తేలింది. బంద్ లు, రాస్తారోకోలు చేసినప్పుడు సహజంగా కనిపించే వాళ్ళు గుంపులో కలిసినప్పుడు రాళ్లు విసురుతుంటారు. అద్దాలు పగలగొడతారు. మనల్ని ఎవరు చూడరని భావించినప్పుడు ప్రవర్తన మారుతుంది. ఇక సోషల్ మీడియాలో కూడా ఫేక్ నేమ్స్ తో ఉంటారు. ఎవరు చేశారనేది తెలుసుకోవడం కష్టం. నన్ను ఎవరు పట్టించుకోరు అన్న సందర్భంలో విపరీత ప్రవర్తనను బయటపెడుతున్నారు.
ఎదుటి వ్యక్తులు పాపులర్ అవుతుంటే డీఫేమ్ చేయాలనుకోవడం. పుట్టి పెరిగిన వాతావరణం, చదువు, స్నేహితులు తన గురించి తెలుసుకోలేరులే అనే భావనతో ట్రోల్స్ కు పాల్పడుతున్నారు. మహిళలు అవి పట్టించుకోకుండా పట్టుదల ఆత్మవిశ్వాసం కనబరిస్తేనే లక్ష్యాలు చేరుకోగలుగుతారు. మహిళలు ఎదుగుతుంటే కొంతమంది ప్రోత్సహిస్తారు కొంతమంది రాళ్లేస్తుంటారు. అయినా లక్ష్యం మాత్రం సూటిగా ఉండాలి. ఎన్ని ఎదురు దెబ్బలు తగిలిన మనోధైర్యాన్ని వీడకుండా బలంగా మహిళా శక్తిని ప్రపంచానికి చాటాలి.
2022 లో దేశవ్యాప్తంగా మహిళలపై 3001 వేధింపు కేసులు నమోదయ్యాయి. ఆన్లైన్లో లైంగికంగా వేధించిన 2305 కేసులు ఇందులో ఉన్నాయి. మహిళలను బ్లాక్ మెయిల్ చేయడం డెఫినేషన్ మార్ఫింగ్, ఫేక్ ప్రొఫైల్ తయారు చేయడం వంటి ఘటనలపై 696 కేసులు ఉన్నాయి. మహిళలకు ఆన్లైన్లో వేధింపుల గురించి ఫిర్యాదు చేసేందుకు జాతీయ స్థాయిలో పోర్టల్ అందుబాటులో ఉంది. నేరుగా పోలీస్ స్టేషన్కు రావాల్సిన అవసరం లేకుండానే www.cybercrime.gov.in అనే పోర్టల్ లో ఫిర్యాదు చేయవచ్చు. వెంటపడి వేదించడం అసభ్య పదజాలంతో దూషించడం వంటి విషయంలో కొన్ని చట్టాలు వర్తింపజేస్తాయి. ఐటీ చట్టంలోని సెక్షన్ 67, 67ఏ కింద ఆన్లైన్ ట్రోలింగ్ విషయంలో కేసులు నమోదు చేయవచ్చు. ఎలక్ట్రానిక్ రూపంలో అశ్లీల విషయాలను ప్రచురించడం, లైంగికంగా అసభ్యకరమైన చర్యల వంటివి ఎలక్ట్రానిక్ రూపంలో ప్రచురించడం పరిగణిస్తారు. కానీ ఇండియాలో సోషల్ మీడియా ట్రోలింగ్ పై నమోదు చేసేందుకు ప్రత్యేకించి చట్టాలు లేవు. దీనిపై కొత్త చట్టాలు చేసేందుకు ప్రభుత్వం యోచిస్తుంది. అయితే ఐపీసీ 499 ప్రకారం సోషల్ మీడియాలో అభ్యంతరకర ఫోటోలు వీడియోలు వ్యాఖ్యలు చేస్తే చర్యలు తీసుకునేందుకు మహిళను డీఫేమ్ చేసినట్లు రుజువైతే రెండేళ్లు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. ఎవరైనా వ్యక్తి మహిళపై లైంగిక వేధింపుల మాటలు ఎలక్ట్రానిక్ రూపంలో పోస్ట్ చేస్తే అది రుజువైతే ఐదు నుంచి ఏడు సంవత్సరాల జైలు శిక్ష , పది లక్షల జరిమానా విధిస్తారు. మహిళలు, యువతులు తమపై జరుగుతున్న సోషల్ మీడియా దాడులు ఆన్లైన్ లైంగిక వేధింపులపై ఫిర్యాదు చేయాలి. వాటిని దాచేస్తే నేరం చేసిన వారిపై చర్యలు తీసుకునే వీలు ఉండదు అని అంటున్నారు.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.