Geethanjali : గీతాంజలి భర్త బయట పెట్టిన దారుణ నిజాలు.. ఆమె చనిపోవడానికి కారణాలు ఇవే…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Geethanjali : గీతాంజలి భర్త బయట పెట్టిన దారుణ నిజాలు.. ఆమె చనిపోవడానికి కారణాలు ఇవే…!

 Authored By tech | The Telugu News | Updated on :13 March 2024,2:00 pm

ప్రధానాంశాలు:

  •  Geethanjali : గీతాంజలి భర్త బయట పెట్టిన దారుణ నిజాలు.. ఆమె చనిపోవడానికి కారణాలు ఇవే...!

Geethanjali  : ఆంధ్రప్రదేశ్ లో గీతాంజలి ఆత్మహత్య రాజకీయాలలో కలకలం రేపింది. టీడీపీ అల్లరి మూకల దాష్టికానికి ఆమె బలయిందని సోషల్ మీడియాలో తీవ్ర ఆరోపణలు వినిపిస్తున్నాయి. మా తప్పేమీ లేదని తెలుగుదేశం పార్టీ కవర్ చేసుకుంటుంది. ఈ క్రమంలో గీతాంజలి భర్త బాలచందర్ కీలక విషయాలు వెల్లడించారు. సోషల్ మీడియా ట్రోలింగ్ వల్లే తన భార్య మానసిక వేదనకు గురైందని చివరకు రైలు కిందపడి ఆత్మహత్య చేసుకుందని తెలిపారు. గీతాంజలి భర్త చెప్పిన దాని ప్రకారం తన భార్య తీవ్ర మానసిక వేదన అనుభవించినట్లు తెలుస్తోంది. అర్ధరాత్రి కూడా ఫోన్ చూసుకొని ఆమె బాధపడేదని చెప్పారు. పిల్లలను స్కూల్ కి పంపించి ఆమె ఆత్మహత్యకు పాల్పడిందని అన్నారు. తాము ఎప్పుడు సోషల్ మీడియాలో కామెంట్లు, పోస్ట్ లు పెట్టలేదని, ఆ అలవాటు కూడా తమకి లేదని కానీ తమపై మాత్రం కామెంట్లు పెట్టి వేధించారని అన్నారు. ఆ కామెంట్లు చూసి తన భార్య తీవ్ర ఆవేదన చెందిందని, అందుకే ఆత్మహత్యకు పాల్పడిందని వెల్లడించారు.

ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అందించిన పథకాలతో లబ్ధి పొందిన వారు తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ లు పెట్టడం సహజం. కానీ గీతాంజలి తనకు తాను ఏ పోస్టింగ్ పెట్టలేదు. ఇంటి పట్టా తీసుకున్న తర్వాత ఆమె మీడియాతో మాట్లాడారు. తన సంతోషాన్ని మీడియాతో పంచుకున్నారు. ఎక్కడా వైయస్ జగన్ ని కానీ వైసీపీని కానీ ఆమె విపరీతంగా పొగడలేదు. అలా అని ప్రతిపక్షాల ప్రస్తావన కూడా ఆమె తీసుకురాలేదు. అయినా కూడా టీడీపీ ఆమెను టార్గెట్ చేసిందని అంటున్నారు. టీడీపీ అనుబంధ ఎకౌంట్ల నుంచి విపరీతమైన ట్రోలింగ్ జరగటంతో ఆమె మానసిక వేదనకు గురైంది అని చివరకు ఆత్మహత్య చేసుకుందని అంటున్నారు. ఈ ఘటనపై వైసీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మహిళా మంత్రులు, మహిళా కమిషన్ మాజీ చైర్ పర్సన్ సోషల్ మీడియా ట్రోలింగ్ ను ఖండించారు. నిందితులకు కఠిన శిక్షలు పడాలని డిమాండ్ చేశారు. ఇక ఇదంతా జరుగుతున్నా టీడీపీ, జనసేన నుంచి మౌనం మాత్రమే సమాధానం అయింది. మహిళా దినోత్సవం రోజు ఆడవారందరికీ అండగా ఉంటామని ట్వీట్ చేసిన పవన్ కళ్యాణ్ కూడా గీతాంజలి మృతి పై కనీసం సానుభూతి కూడా తెలపలేదు. నారీశక్తి నవ శకం అంటూ కబుర్లు చెప్పే చంద్రబాబు నాయుడు కూడా సైలెంట్ గా ఉండిపోయారని అంటున్నారు. సోషల్ మీడియా ద్వారా ఒక వ్యక్తిని అందులోను ఒక మహిళను ఇంతలా టార్గెట్ చేయడం చివరకు ఆమె ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమైన విషయం. ఆమెకు ఇంటి పట్టా వచ్చిన సంతోషంలో తన ఆనందాన్ని పంచుకున్నారు. దానిపై ఇంత ట్రోలింగ్ జరగటం అందులోను అది ఆమె మరణానికి కారణం అవ్వటం బాధాకరమైన విషయం అని చెప్పాలి.

tech

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది