Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది. దానిని మరిచిపోయేందుకు గాను ఆస్ట్రేలియా టెస్ట్ సిరీస్ గెలవాలని ప్రతి ఒక్క భారతీయుడు కోరుకున్నారు. కాని తొలి టెస్ట్‌లో భాత జట్టు దారుణమైన ప్రదర్శన కనబరచింది.బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో ప్రారంభమైన తొలి టెస్టు తొలి సెషన్ లోనే మన బ్యాటర్లు తడబడ్డారు. ఆస్ట్రేలియా పేసర్లు హేజిల్‌వుడ్, స్టార్క్ ధాటికి వరుసగా పెవిలియన్ కు క్యూ కట్టారు. దీంతో లంచ్ సమయానికి ఇండియా 4 వికెట్లు కోల్పోయి కేవలం 51 పరుగులు మాత్రమే చేసింది.
మంచి బౌన్స్ తో పేస్ బౌలింగ్ కు అనుకూలించే పిచ్ పెర్త్ లో ఆస్ట్రేలియా పేస్ దెబ్బ ఎలా ఉంటుందో ఇండియన్ బ్యాటర్లు చూశారు. ఒక్కో పరుగు కోసం తంటాలు పడటమే కాదు.. వికెట్లనూ కాపాడుకోలేకపోయారు. ఓపెనర్లు కేఎల్ రాహుల్ (26), యశస్వి జైస్వాల్ (0), దేవదత్ పడిక్కల్ (0), విరాట్ కోహ్లి (5) వెంటవెంటనే ఔటయ్యారు.రిషబ్ పంత్(37), నితీష్ రెడ్డి(41) కాస్త పోరాడడంతో భారత్ 150 పరుగులకి ఆలౌట్ అయింది. యువకులతో కూడిన భారత జట్టు తీవ్రంగా నిరాశపరచడం అభిమానులని బాధించింది. ఇక ఈ మ్యాచ్‌లో కేఎల్ రాహుల్ ఔట్ వివాదాస్పదంగా మారింది. మిచెల్ స్టార్క్ ఆఫ్ స్టంప్ అవల విసిరిన గుడ్ లెంగ్త్ బంతిని ఫార్వర్డ్ డిఫెన్స్ ఆడేందుకు కేఎల్ రాహుల్ ప్రయత్నించాడు. కానీ.. బ్యాట్‌కి అత్యంత సమీపంలో వెళ్లిన బంతి నేరుగా వెళ్లి వికెట్ కీపర్ అలెక్స్ క్యారీ చేతుల్లో పడింది.
దాంతో క్యాచ్ ఔట్ కోసం ఆస్ట్రేలియా టీమ్ అప్పీల్ చేయగా.. బంతి బ్యాట్‌కి తాకలేదని భావించిన ఫీల్డ్ అంపైర్.. ఆ అప్పీల్‌ను తిరస్కరించాడు. కానీ.. బంతి బ్యాట్ పక్క నుంచే వెళ్లే క్రమంలో ఒక చిన్న శబ్ధం రావడంతో.. ఆస్ట్రేలియా సాహసోపేతంగా రివ్యూకి వెళ్లింది.థర్డ్ అంపైర్ ఔట్ ఇచ్చారు. వాస్తవానికి బంతి బ్యాట్ పక్క నుంచి వెళ్లే సమయంలో వచ్చిన శబ్ధం.. బంతి బ్యాట్‌కి తాకడంతో వచ్చింది కాదు. అదే సమయంలో బ్యాట్.. కేఎల్ రాహుల్ ప్యాడ్‌ను తాకడంతో వచ్చింది. ఒకవేళ థర్డ్ అంపైర్.. ఫ్రంట్ యాంగిల్‌లో ఆ రీప్లేను పరిశీలించి ఉంటే.. నిజం తెలిసేది. తొలి సెషన్ ముగిసిన తర్వాత ఈ వీడియో మొత్తం బయటికి వచ్చింది. బంతి బ్యాట్‌కి తాకకపోయినా.. అంపైర్ ఔట్ ఇవ్వడంతో ఆస్ట్రేలియా ఫీల్డర్లు అతిగా సంబరాలు చేసుకోగా.. కేఎల్ రాహుల్ అసహనంగా అంపైర్‌ను తిట్టుకుంటూనే పెవిలియన్ వైపు నడిచాడు.
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప 2 Pushpa 2 The Rule ప్రమోషన్స్ జోరందుకున్నాయి. సినిమాను పాన్…
Wheat Flour : ప్రస్తుతం మార్కెట్లో దొరికే ప్రతి వస్తువు కూడా కల్తీ గా మారింది. అలాగే ఎక్కడ చూసినా కూడా…
IPL 2025 Schedule : క్రికెట్ ప్రేమికులకి మంచి మజా అందించే గేమ్ ఐపీఎల్. ధనాధన్ ఆటతో ప్రేక్షకులకి మంచి…
This website uses cookies.